Fact Check : YSRCP పార్టీ సభ్యులు VVPAT మోసానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు

వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధం లేనిది.

By Badugu Ravi Chandra
Published on : 24 May 2024 10:47 AM IST

Fact Check : YSRCP పార్టీ  సభ్యులు VVPAT మోసానికి పాల్పడినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
Claim:YSRCP పార్టీ సభ్యులు VVPAT మోసానికి పాలుపడుతున్నారు
Fact:వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధం లేనిది.

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో పోలింగ్‌ ముగిసింది, పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు భాగస్వామ్యంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. పౌరులు తమ ప్రజాస్వామ్య హక్కును ఉత్సాహంతో మరియు దృఢ సంకల్పంతో వినియోగించుకున్నందున, రాష్ట్రంలో అధిక సంఖ్యలో బ్యాలెట్‌లు నమోదయ్యాయి. పోలింగ్ పూర్తయిన తరుణములో, రాష్ట్ర భవిష్యత్తును రూపొందించడంలో వారి సామూహిక స్వరాన్ని ప్రతిబింబిస్తుందని ఆశతో ప్రజలు ఫలితాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

ఈ నేపథ్యంలో ఈవీఎంలను భద్రతతో కూడిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లో ఇద్దరు YCP పార్టీ సభ్యులు VVPAT మెషీన్‌ల నుండి స్లిప్పులను తొలగిస్తున్నట్లు మరియు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) మోసానికి పాల్పడుతున్నట్లు చూపుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.





ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ

నిజ నిర్ధారణ :


YCP పార్టీ సభ్యులు EVM (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్) మోసానికి పాల్పడుతున్నట్లు చూపుతున్న వీడియో 2022 నాటి వీడియో మరియు 2024 ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేనిది అని న్యూస్‌మీటర్ కనుగొన్నది.
మా పరిశోధనలో మేము వైరల్ వీడియో యొక్క రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించాము. శోధిస్తున్నప్పుడు, ఈ వైరల్ వీడియో కి సంబంధించిన డిసెంబర్ 2022 నాటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీసిన వీడియో మరియు ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత, స్లిప్‌లు బ్లాక్ కవర్‌కు బదిలీ చేయబడిన తరువాత మిగిలిపోయిన రోల్‌ను పక్కన పెట్టి EVMలు వాటి స్వంత మార్గంలో వెళ్తాయి మరియు VVPAT నుండి స్లిప్‌లు ఈ విధంగా తీయబడతాయి అని 2022 లో గుజరాత్ భావ్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆ వీడియోకి వివరణ ఇచ్చింది

అదనంగా, భారత ఎన్నికల సంఘం తన అధికారిక X ఖాతాలో ఏప్రిల్ 23న వైరల్ అవుతున్న వీడియో ECI మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ అనంతర వ్యాయామాన్ని చూపుతుందని వివరణలను పోస్ట్ చేసింది.

అందువల్ల,YSRCP పార్టీ సభ్యులు EVM మోసాలకు పాల్పడుతున్నారు అని వైరల్ అవుతున్న వీడియో 2022 నాటిదీ మరియు ఇటీవలిది అని తప్పుగా ప్రచారం చేయబడుతోందని మేము నిర్ధారించాము.

Claim Review:YSRCP పార్టీ సభ్యులు VVPAT మోసానికి పాలుపడుతున్నారు
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వీడియో పాతది మరియు 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంబంధం లేనిది.
Next Story