Fact Check: యూపీలోని క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు ఈత కొడుతున్న వైరల్ వీడియో పాతది

ఈ వీడియో దాదాపు మూడు నెలల కిందటిది. ఎండ తీవ్రత నుండి పిల్లలు తట్టుకోడానికి.. కాసేపు సేదతీరడానికి తరగతి గదిలో నీటిని ఉంచారు. వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని NewsMeter కనుగొంది.

By Newsmeter Network  Published on  2 Aug 2024 5:18 PM IST
Fact Check: యూపీలోని క్లాస్‌రూమ్‌లో విద్యార్థులు ఈత కొడుతున్న వైరల్ వీడియో పాతది
Claim: ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తరగతి గది నీళ్లలో మునిగిపోయింది. పిల్లలు చదువుకోకుండా ఈత కొట్టాల్సి వస్తోందని వీడియో చూపుతోంది.
Fact: వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఏప్రిల్ 2024 నాటిది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి, హాజరును పెంచడానికి తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చింది.

దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల మధ్య విద్యార్థులు నీటమునిగిన తరగతి గదిలో ఈత కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఇది ఇటీవల చోటు చేసుకున్న ఘటన అంటూ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల దుస్థితి ఇదని చెబుతూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. తరగతి గదులు వరద నీటిలో ఉన్నాయని.. పిల్లలు చదువుకోడానికి బదులుగా ఈత కొట్టవలసి వస్తోందనే వాదనతో పోస్టులు పెడుతూ ఉన్నారు.
Telugu Scribe ప్రీమియం అకౌంట్ లో “ఉత్తరప్రదేశ్‌లో స్కూల్‌లో ఈత కొడుతున్న విద్యార్థులు.” అంటూ వీడియోను పోస్టు చేశారు. గదిలో నీళ్లు ఉన్నాయి.. మునిగిపోయే అంత నీళ్లు అయితే కావు. పిల్లలు మాత్రం సరదాగా ఈత కొడుతూ కనిపించారు. (Archive)



ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేసి.. యూపీలోని తరగతి గది ఇదని.. పిల్లలకు స్విమ్మింగ్ పూల్ అందించినందుకు యోగి జీకి ధన్యవాదాలని తెలిపారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వీడియో దాదాపు మూడు నెలల కిందటిది. ఎండ తీవ్రత నుండి పిల్లలు తట్టుకోడానికి.. కాసేపు సేదతీరడానికి తరగతి గదిలో నీటిని ఉంచారు. వైరల్ అవుతున్న వాదన తప్పుదోవ పట్టించేదిగా ఉందని NewsMeter కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మేము NDTV YouTube ఛానెల్ ద్వారా ఏప్రిల్ 30, 2024న అప్లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము. “Heatwave In India | UP School Converts Classroom Into Swimming Pool As Temperature Soars.” అనే టైటిల్ తో వీడియోను పోస్ట్ చేశారు. హీట్ వేవ్ నుండి స్కూల్ పిల్లలు తట్టుకోడానికి క్లాస్ రూమ్ లను ఇలా మార్చారని వివరణలో ఉంచి.
ఛానల్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లోని ఒక పాఠశాలలో ఎండ వేడిని తట్టుకోడానికి అసాధారణమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరగడంతో, విద్యార్థులకు అటు సేదతీరడానికి, స్కూల్ కు హాజరయ్యే వారిని ప్రోత్సహించడానికి తరగతి గదిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చారు.


Mirror Now, Times Now, Zee Bussiness మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను పోస్టు చేశాయి. UPలోని కన్నూజ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థుల హాజరును పెంచడానికి, ఉషోగ్రతను తట్టుకునేలా.. తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చారని ఏప్రిల్ 2024లో వీడియోను అప్లోడ్ చేశారు.
ఏప్రిల్ 30, 2024న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్ నివేదించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వేడిని తట్టుకోవడానికి తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చారని న్యూస్ వెబ్సైట్స్ నివేదించాయి. (Click here and here to read the reports.)
అందువల్ల, మేము వైరల్ వీడియో పాతదని.. భారీ వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్‌లో తరగతి గది మునిగిపోలేదని మేము నిర్ధారించాము.

Claim Review:ఉత్తరప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తరగతి గది నీళ్లలో మునిగిపోయింది. పిల్లలు చదువుకోకుండా ఈత కొట్టాల్సి వస్తోందని వీడియో చూపుతోంది.
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో ఏప్రిల్ 2024 నాటిది. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి, హాజరును పెంచడానికి తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చింది.
Next Story