Hyderabad: రోడ్డుపై కదులుతున్న వాహనం పేలిపోతున్నట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిబ్రవరి 14, 2019న జరిగిన పుల్వామా దాడికి సంబంధించిన నిజమైన ఫుటేజీని చూపిస్తుందన్న క్లెయిమ్‌లతో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.
రోడ్డుపై వెళుతున్న కొన్ని వాహనాలు పేలిపోవడం, దాని వల్ల ప్రకంపనలు రావడం, CCTV కెమెరాను కూడా ప్రభావితం చేస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్‌లో అప్‌లోడ్ చేయబడింది. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ ఫుటేజ్ పుల్వామా దాడి నుండి కాదు, ఇరాక్ నుండి వచ్చింది.
వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2008 ఏప్రిల్ 8న యూట్యూబ్ లో అలోడ్ చేయబడిన ఇదే వీడియో క్లిప్ దొరికింది. ఈ వీడియోను "ఇరాక్‌లో ట్రక్ బాంబు వీడియో" అనే శీర్షికతో అప్లోడ్ చేశారు.
"భారీ ఇరాక్ బాంబు పేలుడు" అనే శీర్షికతో 2007 నవంబర్ 25న అప్లోడ్ చేయబడిన ఇదే వీడియోని యూట్యూబ్ లో కనుగొన్నాం. ఈ వీడియోలో జరిగిన పేలుడు 'ఇరాక్‌లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్' తో చేయబడిందని రాశారు.
'VBIED IED SEP 02 2007 క్యాంప్ తాజి ఇరాక్ భారీ పేలుడు' అనే శీర్షికతో 2008లో ఈ వీడియోని షేర్ చేస్తూ ఇరాక్‌లోని క్యాంప్ తాజి వద్ద గేటు వెలుపల జరిగిన VBIED పేలుడు అని రాశారు. "సెప్టెంబర్ 02, 2007న, నేను మంచం మీద పడుకుని సినిమా చూస్తున్నప్పుడు పేలుడు శబ్దం విన్నాను, గది కంపించి కిటికీలు పేలిపోయాయి. నా నివాస గృహాలు 1/4 మైలు దూరంలో ఉన్నాయి" అని వీడియో వివరణలో ఉంది.
పుల్వామాలో దాడి జరిగింది 2019లో, ఈ వీడియో ఇంటర్నెట్లో కనీసం 2008 మొదలుకొని చాలా సార్లు వైరల్ అవుతూ వస్తోంది.
కాబట్టి, ఈ క్లెయిమ్స్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.