Fact Check: పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ వచ్చిన లేఖ నకిలీది

ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతకంతో కూడిన నకిలీ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By Sridhar  Published on  16 March 2024 9:42 AM GMT
Pithapuram TDP Incharge SVSN Varma suspended, Ex MLA SVSN Varma suspension letter

ఆంధ్రప్రదేశ్‌లో TDP-JSP-BJP మధ్య పొత్తు ఖరారు కావడంతో సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో పిఠాపురం రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ఈ ప్రకటనతో టీడీపీ మద్దతుదారులు ప్రధానంగా పిఠాపురం అసెంబ్లీ టికెట్‌ ఆశించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ అనుచరులు పిఠాపురంలోని టీడీపీ కార్యాలయం దగ్గర టీడీపీ జెండాలను దహనం చేసి హంగామా చేయడం రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపద్యంలో పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ ప్రచారంలో ఉంది.
"పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ సస్పెన్షన్
పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తూ తెలుగుదేశం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా పిఠాపురంలో చంద్రబాబు గారిని, నారా లోకేశ్ గారిని దుర్భాషలాడిన నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనది. చంద్రబాబు గారి నిర్ణయాన్ని గౌరవించకుండా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ఇవ్వని నాయకులు పార్టీకి అవసరం లేదు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేసే నాయకులు, కార్యకర్తలే మాకు బలం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే మాత్రమే కూటమి పనిచేస్తుంది " అంటూ ఓ లేఖ పేర్కొంది.

పోస్ట్ కొరకు ఆర్కైవ్ లింక్ .

నిజ నిర్ధారణ:

పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మపై సస్పెన్షన్ వేటు వేసినట్లు ప్రచారంలో ఉన్న లేఖ నకిలీదని న్యూస్‌మీటర్ గుర్తించింది.

'పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మ సస్పెండ్‌' అనే కీవర్డ్‌లను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు, ఎస్‌విఎస్‌ఎన్ వర్మ సస్పెన్షన్‌కు సంబంధించిన ఏ ఒక్క వార్తా ప్రసారం లేదా వార్తా నివేదిక మాకు కనిపించలేదు.కానీ మేము మరింత శోధించినప్పుడు, మాకు X లో TDP అధికారిక హ్యాండిల్ నుండి ఒక పోస్ట్ కనిపించింది, దావాను తిరస్కరిస్తూ ' వైసీపీ పేటీఎం జోకర్లూ. మీ ఫేక్ బతుకులు జనానికి తెలిసిపోయాక కూడా ఇంకా ఈ ఫేక్ ప్రచారాలు ఎందుకు? ప్రజలారా జగన్ రెడ్డి బతుకులాగే ఇది ఫేక్ లెటర్. నమ్మకండి' అని ఆ పోస్ట్ పేర్కొంది.

పోస్ట్ ఆర్కైవ్ లింక్ ఇక్కడ


పైగా మనం ఉత్తరం చదివినప్పుడు అందులో కొన్ని లైన్లు అసహజంగా ఉన్నట్లు అనిపిస్తుంది.


సాధారణంగా ఈ పదాలతో కూడిన లేఖను ఏ పార్టీ కూడా విడుదల చేయదు. ఇక్కడే లేఖ యొక్క ప్రామాణికత గురించి అందరికీ సందేహం వస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లో TDP-JSP-BJP కూటమి సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతలందరినీ ఇంటికి పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అందుకే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంతకంతో కూడిన పిఠాపురం టీడీపీ ఇంచార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను సస్పెండ్ చేశారంటూ ప్రచారంలో ఉన్న లేఖ నకిలీదని తేల్చిచెప్పాం.
Claim Review:TDP releases a letter suspending Pithapuram TDP In-charge SVSN Varma
Claimed By:Social Media users
Claim Reviewed By:News Meter Telugu
Claim Source:Facebook
Claim Fact Check:False
Next Story