Fact Check: భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే అని టీడీపీ మద్దతుదారులకు, చంద్రబాబు నాయుడు రాశారంటూ వచ్చిన లేఖ నకిలీది
బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే అని చంద్రబాబు నాయుడు లేఖ రాయలేదు.
By Sridhar Published on 29 March 2024 7:09 AM GMTClaim: బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే అంటూ టీడీపీ మద్దతుదారులకు చంద్రబాబు నాయుడు లేఖ.
Fact: బిజెపి పొత్తుకు సంబంధించి టిడిపి మద్దతుదారులకు చంద్రబాబు నాయుడు అలాంటి లేఖలేవీ రాయలేదు; చెలామణిలో ఉన్న లేఖ నకిలీది.
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన NDA కూటమి ఏర్పడింది. ఈ పార్టీల మధ్య సీట్ల పంపకం ఖరారు అయి అభ్యర్థులను కూడా వారు ప్రకటించారు. రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార YSRCP ని NDA ఎదుర్కోనుంది.
ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు ఎన్నికల వరకు మాత్రమే అని టీడీపీ మద్దతుదారులకు చంద్రబాబు నాయుడు రాసిన లేఖ అంటూ సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతోంది..
'Breaking News
ఎన్నికల వరకే భాజపాతో పొత్తు
తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు లేఖ' అనే క్యాప్షన్‌తో, ఫేస్బుక్ లో ముఖ్యంగా వాట్సాప్‌లో ఈ లేఖను పోస్ట్ చేస్తున్నారు
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
పోలవరానికి నిధులు ఇవ్వని కేంద్రాన్ని నిలదీస్తాం.. ఏపీకి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టిన భాజపాను కడిగేస్తాం తెలుగు తమ్ముళ్లు సంయమనం పాటించాలి.. భాజపాతో పొత్తు విషయంలో ఎలాంటి ఆందోళన వద్దు.
తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసే విషయంలో పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. సీట్ల పంపకాలపై తుది చర్చలు ముగిసిన దృష్ట్యా.. ఎన్నికల ప్రచారంపై దృష్టిసారించాలి. గతంలో మనం విభేదించిన భారతీయ జనత పార్టీతో పొత్తు అనవసరం అని కొందరు భావిస్తున్నారు. కానీ, ఎన్నికల వరకే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉంటుందని మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ కూటమి ఏర్పడితే.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో విభేదించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏపీకి తలమానీకమైన పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వని భాజపా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పదేండ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని నరేంద్ర మోడీని ప్రశ్నిస్తాం. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చకుండా భాజపా తీరని అన్యాయం చేసింది. తెలుగుదేశం పార్టీ స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకోలేదు. చివరి వరకు ప్రత్యేక హోదా కోసమే పోరాటం చేసింది. హైదరాబాద్ వల్ల నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజీ పేరుతో రెండు పాచిపోయిన లడ్డూలు చేతిలో పెట్టిన కేంద్రాన్ని ఆంధ్రా ప్రజలు మర్చిపోలేదు. మూడు పార్టీల మధ్య స్నేహపూర్వక బంధం ఎన్నికల వరకు మాత్రమే కొనసాగుతుంది. తెదేపా శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు కూటమి గెలుపు కోసం కృషి చేయాలి. అని ఆ లేఖ పేరుకుంది.
నిజ నిర్ధారణ:
టీడీపీ, బీజేపీ పొత్తుపై చంద్రబాబు నాయుడు నుంచి టీడీపీ మద్దతుదారులకు చెలామణిలో ఉన్న లేఖ నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది.కానీ, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ లేఖ ఫేక్ అని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన X హ్యాండిల్ నుండి మాకు స్పష్టత వచ్చింది.
మోదీ గారి నాయకత్వంలో ఎన్డీయే దేశంలో 400 సీట్లను గెలుచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని 25 సీట్లలో గెలిపించి మోదీ గారి సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోడానికి ప్రజలు సంకల్పించాలి#PrajaGalam #TDPJSPBJPWinning #APWelcomesNamo pic.twitter.com/QiRTIhYngg
— N Chandrababu Naidu (@ncbn) March 18, 2024
అన్నిటికిమించి, వైరల్ లెటర్‌లో వ్రాసిన తేదీని గమనిస్తే అది 20-23-2024 అని ఉంది, దీనితో మనం ఈ లేఖ నకిలీదని నిర్ధారించవచ్చు.