దేశంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రాబోయే ఎన్నికలకు సంబంధించి, ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ సోషల్ మీడియాలో, ఎక్కువగా వాట్సాప్ గ్రూపులలో మరియు ఫేస్బుక్ లో షేర్ చేయబడుతోంది.
ఎన్నికల సమయంలో ఓటు వేయకూడదని నిర్ణయించుకుంటే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.350 మినహాయించబడతాయని, ఒక వ్యక్తికి బ్యాంకు ఖాతా లేకుంటే మొబైల్ రీఛార్జ్ నుండి మొత్తం తీసివేయబడుతుందని ఆ వార్తాపత్రిక క్లిప్పింగ్ పేర్కొంది.
నిజ నిర్ధారణ:
ఓటు వేయకుంటే బ్యాంకు ఖాతా నుండి రూ.350 కట్ అవుతుంది అని సోషల్ మీడియా లో షేర్ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.భారత ఎన్నికల సంఘం [ECI] ఓటర్ల ఖాతా నుండి డబ్బును తీసివేయడం గురించి అటువంటి ప్రకటన చేసిందో లేదో తనిఖీ చేయడానికి మేము గూగుల్ లో నివేదికల కోసం వెతికినప్పుడు, మేము కనుగొన్నది ఏమిటంటే.
వైరల్ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ మొదటిసారిగా 2019లో హోలీ సందర్భంగా వ్యంగ్యంగా షేర్ చేయబడింది. హోలీ సందర్భంగా హిందీ దినపత్రిక నవభారత్ టైమ్స్ ఈ నివేదికను వ్యంగ్య కథనంగా ప్రచురించింది. కథనం పైభాగంలో 'జోక్స్' మరియు 'ఫేక్ న్యూస్' అనే పదాలను కుడా చూశాము.
అప్పటి నుంచి ఇది అసలైన ప్రకటనగా ప్రచారం జరుగుతోంది.
గూగుల్ సెర్చ్ మమల్ని 'Spokesperson ECI' యొక్క అధికారిక X హ్యాండిల్‌లో షేర్ చేయబడిన
పోస్ట్‌కి దారితీసింది. ఈ పోస్ట్, వైరల్ అయిన వార్తాపత్రిక క్లిప్పింగ్ ఫేక్ అని పేర్కొంది.
అలాగే, వైరల్ వార్తాపత్రిక క్లిప్పింగ్ ఫేక్ అని పేర్కొంటూ PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా Xలో ఒక పోస్ట్‌ను కూడా మేము కనుగొన్నాము.
చివరిగా, ఓటు వేయకుంటే ఓటర్ల బ్యాంకు ఖాతాల నుంచి ECI రూ. 350 కట్ చేస్తుందన్న తప్పుడు ప్రకటనతో వ్యంగ్య వార్తాపత్రిక క్లిప్పింగ్ యొక్క చిత్రం సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోందని మేము నిర్దారించాము.