బలమైన ప్రాంతీయ భావాలు మరియు రాజకీయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మే 13న అసెంబ్లీ మరియు లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది.
ఈ ఎన్నికల రంగంలో కీలక పోటీదారులలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ [YSRCP] మరియు భారతీయ జనతా పార్టీ [BJP] , తెలుగుదేశం పార్టీ [TDP] జనసేన పార్టీ [JSP]తో కూడిన NDA కూటమి ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా బహిరంగ సభలు, కేడర్ సమావేశాలు, భారీ రోడ్‌షోలు నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచార వాహనం పై నిలబడి ఉన్న ఫొటోను, జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఇటీవల నిర్వహించిన రోడ్‌షోలోని ఫోటోగా, ఓ వ్యంగ్య వాదనతో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
'ఇప్పుడే అందిన తాజా వార్త!
విజనరీ బాబ్ గారి రోడ్ షో కి భారీ ఎత్తున హాజరైన జనం ! తన 40 ఏళ్ల కేరీర్ లో ఎప్పుడూ ఇంత జనసందోహాన్ని చూడలేదు అని సంబ్రమాశ్చర్యానికి గురైన నారా చంద్రబాబు నాయుడు బాబ్ గారు' అని పేర్కొంటూ YSRCP తమ అధికారిక ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటోను షేర్ చేసింది.
ఆర్కైవ్ లింక్
ఇక్కడనిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న చంద్రబాబు రోడ్‌షో ఫోటో పాతదని, ఇది ఆయన ఇటీవలి రోడ్‌షోలది కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము వైరల్ ఫోటో యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించినప్పుడు, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారిక హ్యాండిల్ ద్వారా ఏప్రిల్ 3, 2019 నాటి పోస్ట్‌ని కనుగొన్నాము.
RGV చేసిన పోస్ట్‌లో ప్రచార వాహనంపై చంద్రబాబు నాయుడు ఉన్న ఫోటో ని మనం చూడవచ్చు. అదే ఫోటో, ఇప్పుడు తప్పుగా షేర్ చేయబడుతోంది.
ఏదైతే చంద్రబాబు ప్రచార వాహనం పై నిలబడి ఉన్న ఫొటోను, కొందరు ఇటీవల ఎన్నికల ప్రచారానికి సంబంధించినదిగా షేర్ చేస్తున్నారో ఆ ఫోటో నిజానికి 2019 ఎన్నికల ప్రచారం లోనిది.
వైరల్ అయిన ఫోటో గురించి మరింత శోధించగా, ఏప్రిల్ 3, 2019 లో నెల్లూరులో జరిగిన రోడ్‌షోలో ప్రచార వాహనంపై చంద్రబాబు నాయుడు ఉన్న ఫోటో అని మేము కనుగొన్నాము. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ రోడ్‌షోకి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
మేము అధికారిక Fact Check TDP X హ్యాండిల్ ద్వారా కూడా ఒక పోస్ట్‌ను కనుగొన్నాము, అది YSRCP చేసిన పోస్ట్ ని ఫేక్ అని తేల్చింది.
అందుకే, చంద్రబాబు నాయుడు ప్రచార వాహనంపై ఉన్న వైరల్ ఫోటో 2019 ఎన్నికల రోడ్‌షోకి సంబంధించినదని, ఈ ఫోటోకు రాబోయే ఎన్నికల కోసం ఆయన ప్రస్తుతం చేస్తున్న రోడ్‌షోలకు సంబంధం లేదని మేము నిర్ధారించాము.