Fact Check: ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు అంటూ వచ్చిన రిపోర్టు ఫేక్

ఇంటెలిజెన్స్ బ్యూరో ఎటువంటి సర్వే నిర్వహించలేదు

By Sridhar  Published on  11 April 2024 5:54 PM IST
Intelligence Bureau survey results for Andhra Pradesh, IB survey report
Claim: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే రిపోర్టు విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో.
Fact: ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు అంటూ వచ్చిన రిపోర్టు ఫేక్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాతావరణం వేడెక్కుతోంది.

అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా అనేక సంస్థలు ప్రీ పోల్ సర్వే నిర్వహించడం మనం చూశాం.
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో [IB] సర్వే అంటూ ఓ రిపోర్టు చక్కర్లు కొడుతోంది.
అసెంబ్లీలో వైసీపీకి 118 నుంచి 124 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి 48 నుంచి 51 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ జీరో నుంచి ఒక సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ సర్వే రిపోర్టు లో ఉంది. వైసీపీకి 49 నుంచి 51 శాతం ఓట్లు, ఎన్డీయే కూటమికి 41 నుంచి 45 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 1 నుంచి 3 శాతం, ఇతరులకు సున్నా నుంచి ఒక శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే పేర్కొంది. మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ మధ్య ఈ సర్వే చేసినట్లు ఆ రిపోర్టు లో ఉంది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

దానితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు లో ఉన్న అదే సర్వే ఫలితాల్ని ETV ఆంధ్రప్రదేశ్‌ నివేదించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

'ఏపీ ఎన్నికల పై సంచలన రిపోర్టు విడుదల చేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో
ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడి
124 సీట్లతో రెండోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ
ఎన్టీయే కూటమి 51 సీట్లకే పరిమితం అవుతుందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో
గత నెలలో 175 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ' అంటూ ETV నివేదించింది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ



నిజ నిర్ధారణ:

ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో వచ్చిన రిపోర్టు మరియు సర్వే ఫలితాలు ఫేక్ అని న్యూస్‌మీటర్ కనుగొంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పై సర్వే రిపోర్టు కోసం మేము ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క అన్ని సోషల్ మీడియా ఖాతాలలో వెతికాము, కానీ మాకు ఎలాంటి సర్వే రిపోర్టు దొరకలేదు.
అయితే వైరల్ IB రిపోర్టు ను నిశితంగా పరిశీలించినప్పుడు, అది ఏప్రిల్ 10, 2024 న విడుదల చేయబడిందని మనం చూడవచ్చు , అయితే రిపోర్టు లో “ఆన్-గ్రౌండ్ అసెస్‌మెంట్ యొక్క వివరణాత్మక రిపోర్టు ఏప్రిల్ 8, 2024 న కార్యాలయానికి సమర్పించబడుతుంది అని ఉంది. దీంతో ఈ రిపోర్టు ఫేక్ అని తేల్చవచ్చు. అంతేకాకుండా ఈ రిపోర్టు యొక్క ఫార్మాట్ సందేహాస్పదంగా ఉంది.


ఇక ETV ఆంధ్రప్రదేశ్ IB సర్వేను నివేదించినట్టు వచ్చిన వీడియో గురించి న్యూస్‌మీటర్, ETV ఎడిటర్ ని సంప్రదించగా, "ఈ వీడియోను తాము ప్రసారం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ETV పేరుతో వచ్చిన వీడియో ఫేక్ అని, వీడియో ఎడిట్ చేయబడిందని" ఆయన పేర్కొన్నారు.
పైగా ETV రిపోర్టింగ్‌లో స్పెల్లింగ్ తప్పులను కూడా మనం చూడవచ్చు.


మరింత శోధిస్తున్నప్పుడు, IB సర్వే రిపోర్టు మరియు ETV ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఉన్న వీడియోను ఫేక్ అని పేర్కొంటూ టీడీపీ అధికారిక హ్యాండిల్ ద్వారా X లో పోస్ట్ కూడా కనుగొనబడింది.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది భారతదేశ అంతర్గత గూఢచార సంస్థ. ఇది దేశంలోని ప్రధాన దేశీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గా పని చేస్తుంది, దేశంలో గూఢచార సేకరణకు మరియు ఇతర చట్ట అమలు సంస్థలతో గూఢచార కార్యకలాపాలను సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంది.
అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాంటి సర్వే నిర్వహించలేదు.
అందుకే ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సర్వే ఫేక్ అని మేము నిర్ధారించాము.
Claim Review:A report by the Intelligence Bureau shows survey results for the Andhra Pradesh elections.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు అంటూ వచ్చిన రిపోర్టు ఫేక్
Next Story