Fact Check : 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ అంటూ వైరల్ అవుతున్న వీడియో కల్పితం
ఒక ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మహిళ 24 మంది పిల్లలకు పిల్లలకు జన్మనిచ్చింది
By Newsmeter Network
Claim:ఒక ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మహిళ 24 మంది పిల్లలకు పిల్లలకు జన్మనిచ్చింది
Fact:వైరల్ అవుతున్న వీడియో కల్పితం. మరొక వీడియోలో ఆ మహిళ తాను పెంచుకుంటున్న మొక్కలను పిల్లలుగా భావిస్తున్నట్టు తెలిపింది.
ఒక ఎక్స్ వినియోగదారుడు, దాదాపు ఒక 4:30 నిమిషాల వ్యవధి గల వీడియోను షేర్ చేసి, ఇందులో ఉన్న మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి అంటూ రాసుకొచ్చారు. తమ పోస్టులో, “యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు.” ఇలాంటి మరిన్ని పోస్టుల ఆర్కైవ్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి..
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2024
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది.
వీరిలో 16 మంది ఆడపిల్లలు కాగా.. 8 మంది మగ సంతానం.
ఆమె భర్త ట్యాక్సీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.#Ayodhya #Mother #BigTV pic.twitter.com/bSuNXOhwTF
24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి....
— ChotaNews (@ChotaNewsTelugu) September 25, 2024
యూపీకి చెందిన మహిళ 24 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అందులో 16 మంది ఆడపిల్లలు, 8 మంది మగపిల్లలు. ఈమె భర్త ఒక సాధారణ టాక్సీ డ్రైవర్, టాక్సీ నడుపుకుంటూ 24 మంది పిల్లలను పోషిస్తున్నాడు. pic.twitter.com/eYxJIcbiIs
సాధారణ వినియోగదారులే కాకుండా, కొన్ని వార్తా సంస్థల ఎక్స్ అకౌంట్లు కుడా ఈ విధమైన క్లెయిమ్స్ తో అదే వీడియోని షేర్ చేసాయి, వాటిలో బిగ్ టీవీ, చోటా న్యూస్, కూడా ఉన్నాయి(ఆర్కైవ్ ఇక్కడ, ఇక్కడ)
Fact Check
కానీ వైరల్ అవుతున్న వీడియో లో ఎలాంటి నిజాము లేదు, ఎందుకంటే ఇది ఒక కల్పిత ఘటనకు సంబంధించినది.
వైరల్ వీడియో లో కీ ఫ్రేమ్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, మాకు Bharat Times అనే ఒక యూట్యూబ్ ఛానల్ లభించింది. ఇక్కడ, వైరల్ వీడియో లో ఉన్న మహిళ మరొక ఇంటర్వ్యూ ఇవ్వడం మనం చూడవచ్చు, ఇందులో 1:42 నిమిషాల వ్యవధి వద్ద తన పేరు కుష్బూ పాథక్ అని తెలియజేసింది. ఈ వీడియోలో తన భర్త ఒక డ్రైవర్ అని తనకు 24 మంది పిల్లలు అని తెలియజేసింది, పాత్రికేయుడు ఈ విషయం నిజంగా వాస్తవమా అని ప్రశ్నించగా, అందులో వెనుక నిలబడి ఉన్న ఒక వ్యక్తి తమ యూట్యూబ్ ఛానల్ కు వెళ్లి చూస్తే అన్ని తెలుస్తాయి అని తెలియజేసారు.
పైగా, 8:45 వద్ద, ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి, ఆ మహిళను తమ యూట్యూబ్ ఛానల్ గురించి ప్రస్తావించటం జరుగుతుంది, వాళ్ళందరూ కామెడీ వీడియోలు చేస్తారు అని, తనతో పాటు ఉంది కూడా తమ టీం సభ్యులు అని తెలుపుతూ, వారికి Apna Aj అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని పేర్కొంది. దీని ఆధారంగా, మేము apna aj ఛానల్ ని వెతికి చూసాము, ఇందులో హాస్యాస్పదమైన వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది. కొన్ని వీడియోలలో కుష్బూ పాథక్ నటించటం కుడా మనం చూడవచ్చు.
ఈ విషయమై మరి కాస్త పరిశోధించగా, కుష్భు పాథక్ ని ఇంటర్వ్యూ చేసిన మరొక వీడియో లభించింది. ఈ వీడియోను story of success అనే ఒక యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఇందులో 0:03 సెకెన్ల వద్ద ఒక వివరణ లభించింది, దీని ప్రకారం, కుష్బూ పాథక్ ఒక వీడియో క్రియేటర్ అని, కేవలం వినోదం కోసమే ఆమె ఇలా వీడియో చేసినట్లు పేర్కొన్నారు.
ఆమె ఇచ్చిన ఇతర ఇంటర్వ్యూలలో కుడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. పైగా, ఈ వీడియో ద్వారా, తాను వైరల్ అయిన తరువాత, 24 bachho ki maa అనే తమ యూట్యూబ్ ఛానల్ పేరు మార్చారు. ఇందులో ఒక వీడియోలో, తన 24 పిల్లలు అంటే తాను పెంచుకునే మొక్కలు అని, వాటిని తన వీడియో లో చూపించారు.
పైగా మరింత నిర్ధారణ కోసం, వైరల్ అవుతున్న క్లెయిమ్ లో వాస్తవం ఏమైనా ఉందా అని, 24 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి గురించి మేము గూగుల్ లో శోధించాము, కానీ అలాంటి వార్తా కథనాలు ఏమి మాకు లభించలేదు. ఇలాంటి సంఘటన నిజంగా జరిగి ఉంటే, కచ్చితంగా ప్రధాన వార్తా పత్రికలు ఈ విషయం గురించి రాసేవి.
దీని ఆధారంగా, వైరల్ అవుతున్న వీడియో కల్పితం అని మనం నిర్ధారించవచ్చు.