హైదరాబాద్: అభినయ తమిళ చిత్ర పరిశ్రమలో నాడోడిగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆమె వినికిడి, మాట సమస్యలున్నా తన అద్భుతమైన నటనతో గుర్తింపు పొందింది. ఇటీవల మలయాళంలో పని అనే చిత్రంలో నటించి ప్రశంసలు అందుకుంది. మరోవైపు, విశాల్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు మరియు నిర్మాత. ఆయన పూజై, మార్క్ ఆంటోనీ వంటి చిత్రాల్లో అభినయతో కలిసి నటించారు.ఐతే, సోషల్ మీడియాలో నటుడు విశాల్, నటి అభినయల ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేస్తూ "Congratulations both of you" అని రాశాడు. అలాగే ఫోటోపై "నటి అభినయ నటుడు విశాల్‌తో రిలేషన్షిప్ ధృవీకరించింది" అనే టెస్ట్ ఉంది.(ఆర్కైవ్)
ఈ పోస్ట్ కారణంగా అభినయ-విశాల్ ప్రేమలో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఇలాంటి పోస్ట్లు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్1, ఆర్కైవ్2)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ వార్త నిజం కాదని గుర్తించింది.
ఇండియా గ్లిట్జ్ జనవరి 31, 2025న ప్రచురించిన కథనంలో, అభినయ విశాల్‌తో సంబంధం ఉందన్న వార్తలను ఖండించింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, విశాల్‌కి తాను మెసేజ్ పంపి ఆరోగ్యం గురించి అడిగిన విషయాన్ని గుర్తు చేసుకుంది. ఆయన దీనికి సానుకూలంగా స్పందించారని, కానీ వారి మధ్య ఏటువంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేసింది.
అదే విధంగా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 3, 2025న ప్రచురించిన కథనంలో, అభినయ తన బాల్య స్నేహితుడితో గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు పేర్కొంది. ఇంకా, త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కూడా తెలిపింది.
అదనంగా, వైరల్ ఫోటోలో అభినయ లేదా విశాల్ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు.
కాబట్టి, నటి అభినయ నటుడు విశాల్‌తో ప్రేమలో ఉన్నట్లు చెబుతున్న వైరల్ పోస్టు అసత్యం.