Hyderabad: 242 మందితో ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లో టేక్ ఆఫ్ అయిన కొద్దీ సమయానికే కూలిపోయింది.
ప్రమాదం అనంతరం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంటల్లో చిక్కుకున్న ఒక భవనం పై అంతస్తు నుండి ప్రజలు పడిపోతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోని షేర్ చేస్తూ అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం దృశ్యాలను చూపిస్తోందన్న క్లెయిమ్‌లతో షేర్ చేస్తున్నారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను అహ్మదాబాద్ సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లతో షేర్ చేశారు. వీడియోపై “మనుషులు అలా కింద పడుతున్నారు చూడండి” అని రాసి ఉంది. (హిందీ నుండి అనువదించబడింది). (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ వాదన తప్పు అని కనుగొంది. వైరల్ వీడియో జూన్ 10న ఢిల్లీలోని ద్వారకలోని ఒక అపార్ట్‌మెంట్ మంటల్లో చిక్కుకున్న దృశ్యాలను చూపిస్తోంది.
వీడియో కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా జూన్ 10న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన అదే వీడియో కనిపించింది. ఈ కథనం ప్రకారం, వీడియోలో MRV స్కూల్ సమీపంలోని ద్వారక సెక్టార్ 13లో ఉన్న షాబాద్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ వీడియో ఆ అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూపిస్తోంది.
జూన్ 10న టైమ్స్ నౌ, న్యూస్9 లైవ్, ఎన్డీటీవీ వంటి అనేక ఇతర మీడియా సంస్థలు ప్రచురించిన అదే దృశ్యాలను కూడా కనుగొన్నాం. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు వీడియో చూస్పిస్తోందని ఈ కథనాలు ధ్రువీకరించాయి.
జూన్ 11న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, జూన్ 10న జరిగిన భారీ అగ్నిప్రమాదం నుండి తప్పించుకోవడానికి 10వ అంతస్తులోని డ్యూప్లెక్స్ ఫ్లాట్ బాల్కనీ నుండి దూకి ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మరణించారు. ఈ సంఘటన ద్వారకా సెక్టార్ 13లోని షాబాద్ అపార్ట్‌మెంట్ అనే రెసిడెన్షియల్ సొసైటీలో జరిగింది.
10 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఆకాష్ ఆసుపత్రికి చేరుకునేలోపే మరణించినట్లు తెలిసింది. యష్ యాదవ్ (40) గా గుర్తించబడిన వ్యక్తి, మరణించారని ఇందిరా గాంధీ ఆసుపత్రి అధికారులు సమాచారం అందించారని పోలీసులు తెలిపారు. అతను ఆ అమ్మాయి తండ్రి, అబ్బాయికి మామ.
ఈ సంఘటన గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్ కూడా కథనాలు ప్రచురించాయి.
కాబట్టి వైరల్ వీడియో అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన దృశ్యాలను చూపించలేదని నిర్ధారించాం. న్యూస్‌మీటర్ ఈ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని ధ్రువీకరించింది.