Fact Check: పుష్ప 2 ప్రీమియర్‌లో తోపులాటలో గాయపడిన బాలుడు చనిపోలేదు; నిజమిది...
బాలుడికి పోలీసు సిబ్బంది సీపీఆర్ ఇస్తున్న వీడియో, బాలుడు ప్రాణాలు కోల్పోయాడనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
By K Sherly Sharon Published on 5 Dec 2024 3:06 PM GMTClaim: పుష్ప 2 ప్రీమియర్ తోపులాటలో గాయపడిన బాలుడు బాలుడు ఇక లేడు.
Fact: వైరల్ క్లెయిమ్‌లు తప్పు. బాలుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు, అతని పరిస్థితి విషమంగా ఉంది.
Hyderabad: హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్లో “పుష్ప 2: ది రూల్” సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ బుధవారం సాయంత్రం విషాదకరంగా ముగిసింది. జనం ఎక్కువ సఖ్యలో రావటం వల్ల తొక్కిసలాటకు దారి తీసింది. ఈ రద్దీ వల్ల జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించింది, తన ఎనిమిదేళ్ళ కొడుకు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు .
తొక్కిసలాటలో ఊపిరందక స్పృహకోల్పోయిన ఆ బాలుడిని గమనించిన జనం, పోలీసు సిబ్బంది cpr చేసారు, ఈ సంఘటనను చూపిస్తున్న వీడియో వైరల్ అవుతుంది.
ఇటీవల ఈ వీడియోను షేర్ చేస్తూ బాలుడు ప్రాణాలు కోల్పోయాడనే క్లెయిమ్‌లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
ఈ వీడియోను షేర్ చేస్తు, పోస్ట్ క్యాప్షన్‌లో ఇలా రాశారు, “గుండె పగిలేలా ఉంది. #పుష్ప పెర్మియర్ షో @alluarjun @MythriOfficial.! సంధ్య ప్రీమియర్ షోలో గాయపడిన చిన్నారి ఇక లేకపోవడం చాలా దురదృష్టకరం. అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.” (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ చూడవచ్చు.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌లు తప్పు అని కనుగొంది.
హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి వైద్య నివేదిక ప్రకారం, సీపీఆర్ తర్వాత బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
వైద్య నివేదిక ప్రకారం, బాలుడిని ఆసుపత్రి ఎమర్జెన్సీకి తీసుకు వెళ్ళే సమయానికి పాక్షిక స్పృహతో ఉన్నాడు. "శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడంతో తక్షణం ఇంట్యూబేషన్, వెంటిలేషన్ పెట్టాల్సివచ్చింది,” అని వ్రాసారు.
బాలుడి సెన్సోరియం బలహీనంగా ఉంది. పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉండడంతో ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్నాడని తెలిపారు.
చాలాసేపు స్పృహ లేక పోవడం వల్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పిరేషన్ లేదా కంట్యూషన్ కారణంగా తీవ్రమైన హైపోక్సియా (ఆక్సిజన్ లోపం), ఊపిరితిత్తులు గాయపడి ఉండవచ్చు అని వైద్య నివేదిక పేర్కొంది.
చుట్టుపక్కలవారు, పోలీసులు సమయానికి CPR అందించడం , బాలుడిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించింది, తదుపరి వైద్యం చేయడానికి సాయపడిందని కిమ్స్ నివేదిక తెలిపింది.
గురువరం The Hindu "హైదరాబాద్‌లో పుష్ప-2' స్క్రీనింగ్‌లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి, చిన్నారికి గాయాలు" అనే కథనం ప్రచురించింది. సంధ్య థియేటర్లో “పుష్ప 2: ది రూల్” సినిమా ప్రీమియర్ స్క్రీనింగ్ కోసం నటుడు అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ థియేటర్‌కు చేరుకున్నారని కథనంలో వ్రాసారు.
“రెండు గంటల ముందు వరకు వారి రాక గురించి ఎటువంటి సమాచారం లేదు, అందువల్ల ఎటువంటి బందోబస్త్ ఏర్పటుచేయలేదు. అల్లు అర్జున్ థియేటర్ నుండి బయటకు వెళుతున్నప్పుడు ఆయన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు, ఇది తొక్కిసలాటకు దారితీసింది, ”అని చిక్కడపల్లి పోలీసు అధికారి తెలిపారని The Hindu ప్రచూరించింది.
సామర్థ్యానికి మించి నిండిపోయిన థియేటర్‌లో జనం ఊపిరి పీల్చుకోడానికి కష్టంగా ఉన్నందు వల్ల బయటకు వచ్చినట్లు చిక్కడపల్లి ఏసీపీ ఎల్.రమేష్ కుమార్ తెలిపారని The Hindu కథనం పేర్కొంది.
ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఎనిమిదేళ్ల బాలుడు, అతని తల్లి చిక్కుకున్నారని మనకు తెలుస్తుంది.
"సిపిఆర్ చెసి వారికి ఎవరూ సహాయం చేయలేదు, ఆ మహిళ ఊపిరాడనందు వల్ల చనిపోయింది" పోలీసు అధికారిని ఉటంకిస్తూ The Hindu రాసింది.
NTDV ఈ సంఘటన గురించి వ్రాస్తూ "పుష్ప 2 చూడాలని కొడుకు కోరుకున్నాడు": హైదరాబాద్ తొక్కిసలాటలో చనిపోయిన మహిళా భర్త " అనే కథనం ప్రచురించింది. రేవతి భర్త భాస్కర్ తన కుమారుడు అల్లు అర్జునకు పెద్ద ఫ్యాన్ కాబట్టే ప్రీమియర్ షో చూడడానికి నిర్ణయించుకున్నాం అన్నారని కథనం పేర్కొంది.
దంపతులకు ఏడు సంవత్సరాల కూతురు కూడా ఉంది, ఆ తొక్కిసలాటలో ఆమెకు కూడా గాయాలయ్యాయని NDTV వ్రాసింది.
న్యూస్‌మీటర్ ఈ కథనాన్ని ప్రచురించే సమయానికి బాలుడి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.