Fact Check: అమెరికాలో 7 లక్షల మంది క్రైస్త‌వులు హిందూ మ‌తం స్వీక‌రించారా? నిజమెంత

అమెరికాలోని ఏడు లక్షల మంది క్రైస్తవులు ఒకేసారి తమ విశ్వాసాన్ని వదులుకుని హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారనే క్లెయిమ్‌తో, జనం ర్యాలీలో పాల్గొంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon  Published on  26 Nov 2024 6:08 PM IST
Fact Check: అమెరికాలో 7 లక్షల మంది క్రైస్త‌వులు హిందూ మ‌తం స్వీక‌రించారా? నిజమెంత
Claim: ఏడు లక్షల మంది క్రైస్తవ అమెరికన్లు తమ విశ్వాసాన్ని వదులుకుని హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ఈ వీడియో చూపిస్తుంది.
Fact: వీడియో ఇస్కాన్ యూకేలో నిర్వహించిన రథయాత్ర ఉత్సవంకు సంబంధించింది. ఏడు లక్షల మంది క్రైస్తవ అమెరికన్లు హిందూ మతంలోకి మారడం చూపించడం లేదు.

Hyderabad: ‘హరే రామ హరే కృష్ణ’ నినాదాలు చేస్తు భారీగా జనం ర్యాలీలో పాల్గొంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో అమెరికాలోని ఏడు లక్షల మంది క్రైస్తవులు ఒకేసారి తమ విశ్వాసాన్ని వదులుకుని హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారనే క్లేయిమ్ వైరల్ అవుతోంది.

Xలో ఈ వీడియోను షేర్ చేసిన వ్యక్తి ఇలా వ్రాశారు, “ప్రపంచ రికార్డ్ అమెరికాలో 7 లక్షల మంది క్రిస్టియన్ ని వదిలి హిందూ మతం లోకి మారారు.” (ఆర్కైవ్)

అవే క్లెయిమ్‌లు చేస్తున్న పోస్ట్‌లను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు

Fact Check

ఈ వీడియోలో కనిపిస్తున్నది 2022లో జరిగిన ఇస్కాన్‌ రథయాత్ర కాబ‌ట్టి, ఈ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది.

వివిధ కీవర్డ్ సర్చ్‌ల‌ను ఉపయోగించి వెత‌క‌గా.. 7 లక్షల మంది క్రైస్తవ అమెరికన్లు హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించడం గురించి ఎటువంటి వార్తలు దొరకలేదు.

వీడియోలో కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే జూలై 22న అప్‌లోడ్ చేయబడిన యూట్యూబ్ వీడియోను కనుగొన్నాము. “లండన్ రథయాత్ర 2024 #లండన్ #హరేకృష్ణ #ఫెస్టివల్ #ISKCONలండన్ #బృందావన్ #పూరి” అనే టైటిల్ తో వీడియో అప్‌లోడ్ చేయబడింది.

వీడియోలో జనం ర్యాలీలో నడుచుకుంటూ సంగీత వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడడాన్ని మనం చూడవచ్చు. ఈ లీడ్‌లను అనుసరించి, కీవర్డ్ సెర్చ్‌ చేసాము. యూట్యూబ్లో అప్‌లోడ్ చేయబడిన “లండన్ రథయాత్ర 2023” వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో 2023లో జూలై 31న అప్‌లోడ్ చేయబడింది.

వీడియోలో జనం పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, నినాదాలు చేస్తు ర్యాలీలో పాల్గొనడం చూడవచ్చు. ఈ యూట్యూబ్ వీడియో కీఫ్రేలను పరిశీలించి, వైరల్ వీడియోను కూడా ఇదే పరిసరాలలో చిత్రీకరించబడినట్లు కనుగొన్నాము. రెండు వీడియోలలో భవనాల పోలికలను క్రింద ఉన్న చిత్రంలో చూడవచ్చు.

ఈ యూట్యూబ్ వీడియో 37:59 టైమ్‌స్టాంప్ వద్ద మనం ఫ్రేమ్‌లో రథాన్ని చూడవచ్చు. వైరల్ వీడియోలో కూడా అదే రథం కనిపిస్తుంది. రెండు వీడియోల నుండి కీఫ్రేమ్‌లను పోలిన ఫోటో క్రింద చూడవచ్చు.

మేము ఇటీవల జూలైలో లండన్ రథయాత్ర 2024 కు సంబంధించి యూట్యూబ్ వీడియోను కనుగొన్నాము. 2023, 2022, 2013లలో యూకేలో ఇలాంటి రథయాత్ర ర్యాలీలను చూపించే యూట్యూబ్ వీడియోలను కనుగొన్నాము. ప్రతి సంవత్సరం లండన్ రథయాత్రను ఇస్కాన్ నిర్వహిస్తోంది. వైరల్ వీడియో కూడా లండన్‌లో ఇస్కాన్ నిర్వహించిన రథయాత్ర ఉత్సవంకు సంబంధించిన‌దిగా స్పష్టమవుతుంది.

వైరల్ వీడియో అమెరికాలో జరిగింది కాదు, యూకేలో ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలోది. అమెరికాలోని ఏడు లక్షల మంది క్రైస్తవులు ఒకేసారి తమ విశ్వాసాన్ని వదులుకుని హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారనే దావాను సమర్ధించే ఆధారాలు లేవు. వైరల్ వాదనలు తప్పు అని న్యూస్ మీటర్ కనుగొంది.

Claim Review:ఏడు లక్షల మంది క్రైస్తవ అమెరికన్లు తమ విశ్వాసాన్ని వదులుకుని హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ఈ వీడియో చూపిస్తుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వీడియో ఇస్కాన్ యూకేలో నిర్వహించిన రథయాత్ర ఉత్సవంకు సంబంధించింది. ఏడు లక్షల మంది క్రైస్తవ అమెరికన్లు హిందూ మతంలోకి మారడం చూపించడం లేదు.
Next Story