తెలంగాణలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు ఒకే దశలో మే 13న పోలింగ్ జరగనుంది.
ధర్మపురి అరవింద్ తెలంగాణలోని నిజామాబాద్ నుండి లోక్‌సభలో ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు మరియు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు నిజామాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కూడా.
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్‌లో జరిగిన బహిరంగ చర్చకు సంబంధించిన ఆయన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను, నిరుద్యోగంపై అడిగిన ప్రశ్నకు ఆయన హిందూ మతం గురించి మాట్లాడడాన్ని మనం చూడవచ్చు.
ఫేస్‌బుక్ మరియు ఇతర సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో క్లిప్ ను 'ఆయన ఏం అడిగారు నువ్వేం చెప్తున్నావ్ నాయన ?
అణువణువునా అహంకారం తప్ప.. ఆవగింజంత సబ్జెక్ట్ లేదు..నిరుద్యోగం గురించి అడిగితే ఏం చెప్తున్నావ్' అని పేర్కొంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఇక్కడ
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేయబడింది మరియు తప్పుగా షేర్ చేయబడుతుందని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్‌ను నిర్వహించగా, ఈ ఓపెన్ డిబేట్ యొక్క పూర్తి వీడియో 'Prof . Nageshwar Open Debate With MP Dharmapuri Arvind' అనే టైటిల్ తో ఏప్రిల్ 15న 10TV News Telugu యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడింది అని కనుగున్నాము.
మేము పూర్తి వీడియోను క్షుణ్ణంగా వీక్షించిన తర్వాత, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ నిరుద్యోగంపై అడిగిన ప్రశ్నకు ఎంపీ ధర్మపురి అరవింద్ హిందూమతం గురించి మాట్లాడినట్లు కనిపించేలా 10TV News Telugu ఓపెన్ డిబేట్ వీడియో సవరించబడిందని మేము కనుగొన్నాము.
10TV News Telugu ఓపెన్ డిబేట్‌లో ప్రొఫెసర్ నాగేశ్వర్, ఎంపీ ధర్మపురి అరవింద్‌ని రెండు వేర్వేరు ప్రశ్నలు అడిగారు, ఒకటి తాజా లోక్‌నీతి - CSDS సర్వే, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పై, టైమ్‌స్టాంప్ 19:00 నిమిషాల వద్ద. మరో ప్రశ్న 42వ రాజ్యాంగ సవరణ మరియు సెక్యులరిజంపై, టైమ్‌స్టాంప్ 45:00 నిమిషాల వద్ద.
ఈ రెండు ప్రశ్నలకు ఎంపీ ధర్మపురి అరవింద్ విడివిడిగా సమాధానాలు చెప్పారు. నిరుద్యోగం పై ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్న వేసిన వీడియో క్లిప్ ను మరియు 42వ రాజ్యాంగ సవరణపై ప్రశ్నకు ఎంపీ ధర్మపురి అరవింద్ సమాధానమిచ్చిన వీడియో క్లిప్ ను డిజిటల్‌గా ఎడిట్ చేసి జోడించి, తప్పుగా షేర్ చేస్తున్నారు.
అందుకే, ఎంపీ ధర్మపురి అరవింద్‌కి సంబంధించిన ఈ వైరల్ వీడియో క్లిప్ డిజిటల్‌గా సవరించబడిందని మేము నిర్ధారించాము.