Fact Check: 'చలో విజయవాడ' ధర్నాలో ఆశాాా వర్కర్ల అరెస్ట్ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది...

తమ డిమాండ్ల సాధన కోసం ఆశాాా వర్కర్లు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని మార్చి 6న చేప‌ట్టారు. ఆశాాా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారంటూ క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon  Published on  6 March 2025 9:08 PM IST
Fact Check: చలో విజయవాడ ధర్నాలో ఆశాాా వర్కర్ల అరెస్ట్ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది...
Claim: వీడియోలో ఉన్నది 2025 మార్చి 6న జరిగిన 'చలో విజయవాడ' ధర్నాలో పోలీసులు ఆశాా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు.
Fact: ఈ క్లెయిమ్స్ తప్పు. ఈ వీడియో 2024 ఫిబ్రవరి 8 'చలో విజయవాడ' ధర్నాలో జరిగిన అరెస్టులకు సంబంధించింది.

Hyderabad: తమ డిమాండ్ల సాధన కోసం ఆశాాా వర్కర్లు 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని మార్చి 6న చేప‌ట్టారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి విజయవాడకు ఆశాాా వర్కర్లు తరలి వస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసు సంబంధించిన జీఓలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడకు తరలివస్తున్న ఆశాాా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారంటూ క్లెయిమ్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియోలో ధర్నా చేస్తున్న కొంతమంది స్త్రీలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను, మార్చి 6న Xలో షేర్ చేస్తూ, శీర్షికలో ఈ విధంగా రాశారు:

"ఆశాాా వర్కర్ ల అరెస్ట్... > ఏపీ - చలో విజయవాడకు తరలివస్తున్న ఆశాాా వర్కర్లను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు... > వడ్డేశ్వరంలో 100 మందిని అదుపులోకి తీసుకోగా, కాజా టోల్ గేట్ వద్ద ర్యాలీకి ప్రయత్నించిన ఆశాాా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు... #CBNFailedCM" (ఆర్కైవ్)

ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్టును ఇక్కడ చూడవచ్చు (ఆర్కైవ్)

Fact Check:

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇది 2024 ఫిబ్రవరి 8న జరిగిన ఆశా వర్కర్ల అరెస్టుకు సంబంధించిన పాత వీడియో. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024 జూన్ 4న.

'చలో విజయవాడ'కి తరలి వస్తున్న ఆశాాా వర్కర్లను అరెస్ట్ చేశారా అని తెలుసుకోవడానికి కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించాము. మార్చి 6న NTV ప్రచురించిన "Asha Workers Protest: 'ఛలో విజయవాడ'.. ఆశాాా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు!" అనే కథనం దొరికింది.

ఈ కథనంలో, "ఆశాాా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి... చలో విజయవాడకు వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్టాండ్లకు వచ్చిన ఆశాాా వర్కర్ల పేర్లను పోలీసులు నమోదు చేసుకుని.. తిరిగి ఇంటికి పంపించి వేస్తున్నారు," అని పేర్కొన్నారు.

ప్రజాశక్తి మార్చ్ 6న ప్రచురించిన కథనంలో ఆశాా వర్కర్ల అరెస్టుకి సంబంధించిన సమాచారం లేదు. అయితే ఆశాాావర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటిలిజెన్స్‌ టీంల ద్వారా పోలీసులు పరిశీలిస్తున్నారు అని రాశారు.

'చలో విజయవాడ' ధర్నాలో ఆశాా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నట్లు పేర్కొంటూ వైరల్ వీడియోని షేర్ చేసిన విశ్వసనీయ కథనాలు ఏవి మాకు దొరకలేదు.

వైరల్ వీడియో కీ ఫ్రేముల రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2024 ఫిబ్రవరి 8న Telugu States News ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేసిన వీడియో దొరికింది.

ఈ వీడియోని "గుంటూరు మరియు విజయవాడ హైవేని బ్లాక్ చేసిన ఆశాా వర్కర్లు....హైవేపై బైటాయించి నిరసన తెలుపుతున్న ఆశాా వర్కర్లు....." అనే శీర్షికతో షేర్ చేశారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో 0:24 నిమిషం మార్కు నుండి చూడవచ్చు.

గుంటూరు మరియు విజయవాడ హైవేని బ్లాక్ చేసిన ఆశ వర్కర్లు.... హైవేపై బైటాయించి నిరసన తెలుపుతున్న ఆశ వర్కర్లు..... #andhrapradesh #andhra #AndhraPradesh #TeluguNews #AndhraNews #andhrapradeshnews #Andhra

Posted by Telugu States News on Thursday, February 8, 2024

ఇదే వీడియోని మరో కోణంలో చూపిస్తున్న ఫేస్‌బుక్‌ వీడియో కీ వర్డ్ సెర్చ్ ద్వారా దొరికింది. ఈ వీడియో కూడా 2024 ఫిబ్రవరి 8న అప్లోడ్ చేయబడింది. "గుంటూరు విజయవాడ హైవేని బ్లాక్ చేసిన ఆశాా వర్కర్లు,హైవేపై బైటాయించి నిరసన తెలుపుతున్న ఆశాా వర్కర్లు..," అనే శీర్షికతో ఈ వీడియో షేర్ చేశారు.

వైరల్ వీడియో, Telugu States News ఫేస్‌బుక్‌లో అప్లోడ్ చేసిన వీడియో మధ్య పోలికలను ఇక్కడ చూడవచ్చు:

కీ వర్డ్ సెర్చ్ ద్వారా 2024 ఫిబ్రవరి 8న, 'చలో విజయవాడ' కార్యక్రమంలో భాగంగా గుంటూరు రహదారిపై ఆందోళన చేపట్టిన ఆశాా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసారని TV 5 News, RTV ప్రసారం చేసిన కథనాలు దొరికాయి.

వైరల్ అవుతున్న వీడియోలు 2024 ఫిబ్రవరి 8న చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఆశాాా వర్కర్లు ఆందోళన చేపట్టినప్పుడు, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నప్పుడు చిత్రీకరించిన వీడియో అని తేలింది.

ఈ వైరల్ పోస్టులపై స్పందిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వా ఫ్యాక్ట్ చెక్ విభాగం Xలో పోస్ట్ చేసింది. "రాష్ట్రంలో ఆశాాా వర్కర్లని పోలీసులు అరెస్ట్ చేసారు అంటూ, కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు... సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో, ఫిబ్రవరి 8, 2024లోని వీడియో. ఏడాది క్రితం వీడియో తీసుకుని వచ్చి, ఇప్పటి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. అది ఫేక్ ప్రచారం," అని రాశారు.

వీడియోని షేర్ చేస్తోంది వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్లు. అయితే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 2024 జూన్ 4న. వీడియోలో కనిపిస్తున్న ఆశాా వర్కర్ల అరెస్ట్ ఘటన 2024 ఫిబ్రవరి 8న, అంటే వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది.

వైరల్ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claim Review:వీడియోలో ఉన్నది 2025 మార్చి 6న జరిగిన 'చలో విజయవాడ' ధర్నాలో పోలీసులు ఆశాా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్స్ తప్పు. ఈ వీడియో 2024 ఫిబ్రవరి 8 'చలో విజయవాడ' ధర్నాలో జరిగిన అరెస్టులకు సంబంధించింది.
Next Story