ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల ప్రతిష్టను దెబ్బతీసేందుకు అధికార పక్షం నుంచి, ప్రతిపక్షం నుంచి అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
అయితే, బీజేపీ టీడీపీ, జనసేన కలిసి ఏర్పడిన ఎన్డీయే కూటమి పై అలాంటి ప్రయత్నంలో Way2News పేరుతో ఓ వార్తా కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
AP: బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. గత వైఎస్సార్ ప్రభుత్వం మైనార్టీలకు అన్యాయంగా 4% రిజర్వేషన్లు కట్టబెట్టిందని ఆరోపించారు. కూటమి గెలిచిన వెంటనే తొలి సంతకం రిజర్వేషన్ల రద్దుపైనే ఉంటుందని, ఇందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. కాగా, గత తెలంగాణ ఎన్నికల్లోనూ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా సంచలన ప్రకటన చేశారు". అని కథనం పేర్కొంది.
ఆర్కైవ్ లింక్
ఇక్కడ ,
ఇక్కడ
వైరల్ వార్తా కథనంలో ఉన్న అదే దావాను నివేదిస్తూ ABN TV పేరుతో కూడా కొన్ని వార్తా కథనాలు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి.
నిజ నిర్ధారణ:
అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యానించినట్లు వచ్చిన కథనం నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది.'ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వెల్లడించారు' అనే పదాలను ఉపయోగించి మేము కీవర్డ్ శోధనను నిర్వహించినప్పుడు,
దగ్గుబాటి పురందేశ్వరి ముస్లిం రిజర్వేషన్లపై వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని
ఆమె స్వయంగా మాట్లాడిన వీడియోను
ఈనాడు అధికారిక X హ్యాండిల్ ద్వారా మేము కనుగొన్నాము.
అదే విధంగా, ఈ వైరల్ కథనం Way2News ప్రచురించలేదని, ఈ వైరల్ కథనం ఫేక్ అని పేర్కొంటూ
Way2News యొక్క అధికారిక హ్యాండిల్ ద్వారా Xలో పోస్ట్‌ను కనుగొన్నాము.
అదే విధంగా, వైరల్ వార్తా కథనాన్ని ఫేక్ అని పేర్కొంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికారిక హ్యాండిల్ ద్వారా Xలో ఒక
పోస్ట్‌ను కనుగొన్నాము.
ఈ ఫేక్ న్యూస్ పై క్లారిటీ ఇస్తూ ABN ఓ
వీడియోను విడుదల చేసింది.
ఈ రుజువులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్త అవాస్తవమని తేల్చిచెప్పాం.