Fact Check: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని భార్య కొట్టిందా? కాదు, వైరల్ పేపర్ క్లిప్పింగ్ నకిలీది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య చేతిలో దెబ్బలు తిన్నారని తెలిపే నకిలీ ఈ-పేపర్ క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By M Ramesh Naik
Published on : 28 July 2025 7:15 PM IST

A purported e-newspaper clipping has gone viral, alleging that BRS leader Padi Koushik Reddy was beaten by his wife.
Claim:బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని ఆయన భార్య శాలిని కొట్టిందని 'తెలుగు స్క్రైబ్' అనే ఈ-న్యూస్ పత్రిక కథనం ప్రచురించిందని వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి.
Fact:ఈ దావా తప్పు. వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ డిజిటల్‌గా ఫేక్ చేసినదే.

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఆయన భార్య శాలిని కొట్టిందని చెప్పే ఈ-పేపర్ క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్పింగ్‌పై ‘తెలుగు స్క్రైబ్’ అనే లోగో ఉంది. తేదీగా జూలై 26, 2025 (గురువారం)ని చూపించారు. ఇందులో కౌశిక్ రెడ్డి, ఆయన భార్య శాలిని ఫొటోలు ఉండగా, వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఒక కథనం ప్రచురించారు.

ఒక ఎక్స్ యూజర్ ఈ క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ, “పెళ్ళాం చేతిలో చెప్పులు దెబ్బలు తిన్నాక ఇంక నీవు బతికి ఉన్నావు అంటే నీ గుండె గట్టిదే రా పాడి,” అంటూ క్యాప్షన్ పెట్టాడు. (Archived)

ఇలాంటి పోస్ట్‌లు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (Archived 1), (Archived 2), (Archived 3), (Archived 4)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్ మీటర్ పరిశీలనలో ఈ క్లిప్పింగ్ నకిలీదని తేలింది.

మొదటిగా ఈ క్లిప్పింగ్‌పై చూపించిన తేదీ – జూలై 26, 2025 – గురువారం అని ఉంది. కానీ ఆ తేదీ వాస్తవానికి శనివారం. ఈ తేదీకి రోజు సరిపోవడం లేదన్నదే ఈ క్లిప్పింగ్ పై అనుమానాలు రేకెత్తించింది.

తెలుగు స్క్రైబ్’ అనే మీడియా సంస్థకు వెబ్‌సైట్ లేదు. ఇది కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రమే వార్తలు షేర్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ-పేపర్ లా కనిపించే ఫార్మాట్‌లో పోస్టులు వేస్తుంటుంది కానీ, ఆ పద్ధతిలో ఈ వైరల్ క్లిప్పింగ్‌ను ఎక్కడా షేర్ చేయలేదు.

మేము తెలుగు స్క్రైబ్ అధికారిక ఎక్స్ ఖాతా @TeluguScribe ను పరిశీలించగా, ఇలాంటి కథనం కనిపించలేదు. పైగా ఈ సంస్థ ఫ్యాక్ట్ చెక్ కోసం నిర్వహిస్తున్న అధికారిక ఖాతా @ScribeFactCheck ఈ క్లిప్పింగ్ నకిలీదని స్పష్టంగా ఖండించింది.

అలాగే, ఈ ఘటనపై ఎటువంటి విశ్వసనీయ మీడియా కథనాలు గానీ, అధికారిక ప్రకటనలు గానీ లేవు.

కాబట్టి, పాడి కౌశిక్ రెడ్డిని ఆయన భార్య శాలిని కొట్టారన్న కథనాన్ని చూపిస్తూ వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ నకిలీదే.

Claim Review:బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని ఆయన భార్య శాలిని కొట్టిందని 'తెలుగు స్క్రైబ్' అనే ఈ-న్యూస్ పత్రిక కథనం ప్రచురించిందని వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X, Facebook, Instagram
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పు. వైరల్ అవుతున్న ఈ-పేపర్ క్లిప్పింగ్ డిజిటల్‌గా ఫేక్ చేసినదే.
Next Story