Fact Check : 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేయడం లేదు
వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు అంటూ ఒక ఫేక్ సందేశం ప్రచారంలో ఉంది.
By Sridhar Published on 23 April 2024 11:21 AM ISTClaim: 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో, వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త కమ్యూనికేషన్ నిబంధనలను అమలు చేసింది.
Fact: 2024 ఎన్నికల సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేయడం లేదు.
18వ లోక్‌సభకు 543 మంది సభ్యులను ఎన్నుకునే సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించబడతాయి. లోక్‌సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. దాదాపు 64% ఓటింగ్ శాతం రాష్ట్రాల వ్యాప్తంగా నమోదైంది.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని, ప్రభుత్వం అలాంటిదేమీ చేయడంలేదని న్యూస్‌మీటర్ కనుగొంది.మా పరిశోధనలో భాగంగా మేము కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఎన్నికల సంఘం యొక్క అన్ని అధికారిక వెబ్‌సైట్‌లు మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో శోధన చేసాము, అయితే వైరల్ సందేశంలో ఉన్నట్లు ఏమీ కనుగొనబడలేదు.
అయితే, ప్రభుత్వ వాస్తవ తనిఖీ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో [PIB] ఈ సందేశంపై స్పందిస్తూ ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసిందని.
ఈ సందేశం నకిలీదని మరియు ఇదే సందేశం గతంలో కూడా వివిధ సందర్భాల్లో షేర్ చేయబడిందని. అదే తప్పుదోవ పట్టించే సందేశం ఏప్రిల్ 2020లో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సమయంలో కూడా వైరల్ అయిందని, పౌరులలో భయాందోళనలను రేకెత్తించిందని మేము కనుగొన్నాము.
'సోషల్ మీడియా మరియు ఫోన్ కాల్‌లను 'కొత్త కమ్యూనికేషన్ నిబంధనల' ప్రకారం భారత ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది అని ఒక సందేశం పేర్కొంది. ఈ దావా ఫేక్. ఇలాంటి నిబంధనలేవీ భారత ప్రభుత్వం విధించలేదు. అటువంటి నకిలీ/అస్పష్టమైన సమాచారాన్ని షేర్ చేయవద్దని' PIB తన X పోస్ట్‌లో పేర్కొంది.
एक मैसेज में दावा किया जा रहा है कि भारत सरकार द्वारा 'नए संचार नियम' के तहत सोशल मीडिया और फोन कॉल की निगरानी की जाएगी।#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) July 10, 2023
▶️ यह दावा फ़र्ज़ी है।
▶️ भारत सरकार द्वारा ऐसे कोई नियम लागू नहीं किए गए हैं।
▶️ ऐसी किसी भी फ़र्ज़ी/अस्पष्ट सूचना को शेयर ना करें। pic.twitter.com/pqh0eXBPJ7
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
వైరల్ అవుతున్న సందేశం ఫేక్ అని పేర్కొన్న అనేక వార్తా నివేదికలను కూడా మేము కనుగొన్నాము. వాట్సాప్ ట్రిపుల్ టిక్‌లను అమలు చేయడంతో పాటు కాల్ రికార్డింగ్ మరియు సోషల్ మీడియా మానిటరింగ్‌లో ప్రభుత్వ ప్రమేయాన్ని సూచించే వాదన పూర్తిగా తప్పు అని indiatvnews పేర్కొంది.
అందువల్ల 2024 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేస్తుందని. వాట్సాప్ కాల్‌లను రికార్డ్ చేస్తుందని మరియు సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది అనే వైరల్ సందేశం నకిలీదని మేము నిర్ధారించాము.