Fact Check: రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా షేర్ చేసిన వీడియో క్లిప్ ను ఎడిట్ చేశారు

ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాం. వీడియో క్లిప్ ను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

By Newsmeter Network  Published on  18 Sept 2024 12:55 PM IST
Fact Check: రిజర్వేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని రాహుల్ గాంధీ చెప్పినట్లుగా షేర్ చేసిన వీడియో క్లిప్ ను ఎడిట్ చేశారు
Claim: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలని తాను, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.
Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశంలో రిజర్వేషన్‌ వ్యవస్థను ముగించాలంటే అందుకు సంబంధించిన వాతావరణం ఉండాలని.. ప్రస్తుతం భారతదేశంలో అన్ని వర్గాలకు న్యాయమైన వాతావరణం అయితే లేదని రాహుల్ గాంధీ చెబుతున్నట్లు వీడియో పూర్తి వెర్షన్ చూపిస్తుంది.

రాహుల్ గాంధీ ఇటీవల సెప్టెంబర్ 8, 2024 నుండి మూడు రోజుల యునైటెడ్ స్టేట్స్ పర్యటనను వెళ్లారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ మొదటి అంతర్జాతీయ పర్యటన కావడంతో దేశ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

కాంగ్రెస్ నాయకుడి తన పర్యటనలో భాగంగా డల్లాస్, వాషింగ్టన్ DC వంటి నగరాల్లో పర్యటించారు. అలాగే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రముఖ మీడియా సంస్థలు, ప్రవాస భారతీయులతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఒక ఇంటర్యూ సందర్భంగా తాను, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ క్లిప్‌లో, "భారతదేశం న్యాయమైన ప్రదేశంగా ఉన్నప్పుడు మేము రిజర్వేషన్‌ను రద్దు చేయడం గురించి ఆలోచిస్తాము" అని ఆయన చెప్పడం చూడొచ్చు.

బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఈ వీడియోను షేర్ చేస్తూ “Rahul Gandhi’s agenda exposed! Rahul and Congress intend to end reservations in India. This is why they had snatched rights of Dalits in Karnataka. Congress is anti-Dalit! (sic)” అంటూ రాశారు. "రాహుల్ గాంధీ అజెండా బయటపడిందని.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్స్ కు వ్యతిరేకమని చెప్పేశారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో దళితుల హక్కులను లాగేసుకుంది. కాంగ్రెస్ యాంటీ దళిత్ అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. " అంటూ తెలిపారు. (Archive)


Fact Check

ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొన్నాం. వీడియో క్లిప్ ను ఎడిట్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది.

మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. సెప్టెంబర్ 10న PTI ద్వారా Xలో పోస్ట్ చేసిన వీడియోను చూశాము. ఇందులో నిడివి ఎక్కువ ఉన్న వీడియోను గుర్తించాం. రాహుల్ గాంధీ దళితులు, గిరిజనులు, OBCల జనాభా గురించి మాట్లాడారు, రిజర్వేషన్స్ పై నిర్ణయం తీసుకోవడం, ఆర్థిక విషయాల గురించి చర్చించారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మీరు దళితులు, గిరిజనులు, OBCలను కలిపితే, వారు జనాభాలో 73 శాతం ఉన్నారు. అయితే, 70 మంది ఉన్న సమూహంలో ఒక గిరిజనుడు, ముగ్గురు దళితులు, ముగ్గురు ఓబీసీలు, ఒక మైనారిటీ ప్రతినిధి మాత్రమే ఉన్నారు. అంటే భారతదేశంలోని 90 శాతం మంది 10 శాతం కంటే తక్కువ ఉన్న వర్గాలకు చెందిన వారు ఇతరులను నియంత్రిస్తున్నారు. ఆర్థికంగా చూసుకుంటే గిరిజనులకు ప్రతి 100 రూపాయలలో 10 పైసలు, దళితులకు 5 రూపాయలు, OBCలకు కూడా అంతే మొత్తం అందుతుంది. వాస్తవమేమిటంటే వారికి సరైన ప్రాతినిధ్యం లేదు." అని అన్నారు.

వ్యాపారాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపారసంస్థల నాయకత్వంలో కూడా కొన్ని వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. “మీరు భారతదేశంలోని వ్యాపార నాయకుల జాబితాను పరిశీలిస్తే, 200 మంది నాయకులలో ఒక OBC కి చెందిన వారు మాత్రమే ఉన్నారు. వారు జనాభాలో 50 శాతం పైగా ఉన్నా కూడా ప్రాతినిధ్యం వహించే వ్యక్తులే లేరు. అసలు సమస్యను పరిష్కరించడం లేదు. అసమతుల్యత సమస్య అనేది ఖచ్చితంగా ఉంది." అని రాహుల్ తెలిపారు.

ఇక 1:46 నిమిషాల మార్క్‌లో, “భారతదేశం న్యాయమైన ప్రదేశంగా ఉన్నప్పుడు మేము రిజర్వేషన్‌లను రద్దు చేయడం గురించి ఆలోచిస్తాము. భారతదేశం ఇంకా అలాంటి ప్రదేశం కాదు." అని రాహుల్ గాంధీ చెప్పడం మనం చూడొచ్చు.

రాహుల్ గాంధీ రిజర్వేషన్ల కొనసాగింపు గురించి వాదిస్తున్నారు. వాటి రద్దు గురించి కాదని స్పష్టంగా తెలుస్తోంది.

భారతదేశంలోని పౌరులందరికీ సమాన సమాజంగా మారినప్పుడే రిజర్వేషన్లపై పునరాలోచన జరగాలని రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రకారం, దళితులు, గిరిజనులు, OBCలు వంటి అట్టడుగు వర్గాలకు దేశంలోని వనరులు సక్రమంగా పంపిణీ చేయబడటం లేదు. ఈ అసమానతలు పరిష్కరించే వరకు రిజర్వేషన్లు తప్పనిసరి అని రాహుల్ గాంధీ తెలిపారు.

సెప్టెంబరు 10 నాటి 'ABP న్యూస్' నివేదికను కూడా మేము చూశాము. వాషింగ్టన్ DC లోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్‌లో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం న్యాయమైన ప్రదేశం అయినప్పుడు మాత్రమే రిజర్వేషన్‌లను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని రాహుల్ గాంధీ అన్నారు.

సెప్టెంబరు 12 నాటి హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో రిజర్వేషన్‌లపై తన స్పందన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అమెరికాలోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో వ్యాఖ్యలు చేశారు. “నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అని నిన్న ఎవరో నా ప్రకటనను తప్పుగా చూపించారు. కానీ నేను స్పష్టం చేస్తోంది ఒకటే.. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు." అని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు.

అందువల్ల, వైరల్ వీడియో ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రాహుల్ గాంధీ చెప్పలేదు.

Claim Review:రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులు, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేయాలని తాను, కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.
Claimed By:X user
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. భారతదేశంలో రిజర్వేషన్‌ వ్యవస్థను ముగించాలంటే అందుకు సంబంధించిన వాతావరణం ఉండాలని.. ప్రస్తుతం భారతదేశంలో అన్ని వర్గాలకు న్యాయమైన వాతావరణం అయితే లేదని రాహుల్ గాంధీ చెబుతున్నట్లు వీడియో పూర్తి వెర్షన్ చూపిస్తుంది.
Next Story