Fact Check: మేమంత సిద్దం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు రాయి తగిలి గాయమైంది, పూలదండలో హుక్‌ వల్ల కాదు

సీఎం జగన్‌కు పూలదండలో హుక్‌తో గాయమైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు

By Sridhar  Published on  14 April 2024 4:17 PM IST
CM Jagan was injured by a stone in Vijayawada, Stone pelted on CM Jagans convoy, CM Jagan attacked
Claim: దొరికిపోయాడు దొంగ. ఒరిజినల్ వీడియో, బరువైన దండకున్న హుక్‌ గీసుకొని గాయమైంది, ఆ దండ ఇదే. అబ్బ కమలహాసన్ ఆస్కార్ విజేత నటన.
Fact: మేమంత సిద్దం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు రాయి తగిలి గాయమైంది, పూలదండలో హుక్‌ వల్ల కాదు.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హద్దులు దాటాయి, హింసాత్మకంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల సంఘటనలతో వాతావరణం వేడెక్కింది.

ఏప్రిల్ 13వ తేదీన విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ మోహన్ రెడ్డి గాయపడ్డారు.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పూలదండలో హుక్ తగిలి గాయమైందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'దొరికిపోయాడు దొంగ
ఒరిజినల్ వీడియో బరువైన దండకున్న హుక్ గీసుకొని గాయమైంది ఆ దండ ఇదే'

'దొరికిపోయాడు దొంగ
ఒరిజినల్ వీడియో బరువైన దండకున్న ఒక్కు గీసుకొని గాయమైంది ఆ దండ ఇదే
అబ్బ కమలహాసన్ ఆస్కార్ విజేత నటన' అంటూ అనేక మంది సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.




ఆర్కైవ్ లింక్ ఇక్కడ

నిజ నిర్ధారణ:

సీఎం జగన్‌కు పూలదండలో హుక్ తగిలి గాయమైందన్న వార్త అబద్ధమని న్యూస్‌మీటర్‌ కనుగొంది.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ గాయపడిన ఈ ఘటన సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఘటనపై ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు, మేము అనేక వార్తా నివేదికలను ఇక్కడ, ఇక్కడ మరియు యూట్యూబ్‌లో వీడియో రిపోర్టింగ్‌లను ఇక్కడ, ఇక్కడ కనుగొన్నాము.



'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు విసిరిన రాయి తగిలి గాయపడ్డారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శనివారం మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా బస్సులో ప్రచారం నిర్వహించారు.
ముఖ్యమంత్రి ఎడమ కనుబొమ్మ పైన రాయి తగిలింది. సమీపంలోని పాఠశాల నుంచి రాయి విసిరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు వైద్యులు బస్సులోనే చికిత్స అందించి అనంతరం ప్రచారం కొనసాగించారు.' అని ఓ నివేదిక తెలిపింది.

ఈ ఘటనను చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఖండించారు.
ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత విచారణకు పిలుపునిస్తూ, నాయుడు X లో పోస్ట్ చేసారు, "@ysjagan పై జరిగిన దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా మరియు నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని @ECISVEEP ని అభ్యర్థిస్తున్నాను.

ఆర్కైవ్ లింక్ ఇక్కడ

"గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరు @ysjagan పై రాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను. రాజకీయ విభేదాలు ఎప్పటికీ హింసాత్మకంగా మారకూడదు. ప్రజాస్వామ్య ప్రక్రియలో నిమగ్నమైనప్పుడు సభ్యత మరియు పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని స్టాలిన్ పోస్ట్ చేశారు.
బస్సు పై ఉన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పక్కనే నిలబడి ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని రాయి తగలడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చికిత్స పొందిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

అందుకే, సీఎం జగన్‌కు బరువైన దండకున్న హుక్ గీసుకొని గాయమైందన్న వాదన అవాస్తవమని తేల్చిచెప్పాం. పూలమాల వేసి సత్కరిస్తున్నప్పుడు ఆయన బాగానే ఉన్నారు. వాస్తవానికి మేమంతా సిద్ధం యాత్రలో రాయి తగిలి ఆయన గాయపడ్డారు.
Claim Review:A video claiming CM Jagan was injured by a hook in the garland during his Memantha Siddham Bus Yatra in Vijayawada
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook
Claim Fact Check:False
Fact:మేమంత సిద్దం బస్సు యాత్రలో సీఎం జగన్‌కు రాయి తగిలి గాయమైంది, పూలదండలో హుక్‌ వల్ల కాదు.
Next Story