మార్చి 17 (ఆదివారం) పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి గ్రామంలో ప్రాంతీయ పార్టీలు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)లో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో, టీడీపీ-జనసేన-బీజేపీలు సంయుక్తంగా నిర్వహించిన తొలి బహిరంగ సభ 'ప్రజాగళం'.
10 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో వేదికను పంచుకోవడంతో, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా సభలో పాల్గొనడంతో, సభకు భారీగా జనం తరలివచ్చారు.
దీనికి సంబంధించి "టీడీపీ, జనసేన, బీజేపీ బహిరంగ సభలో జగనన్న ‘అజెండా’ సాంగ్" అంటూ, ఆ సభకు సంబంధించిన
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెండాలు పట్టుకుని జనం ఎగరడం మనం వైరల్ వీడియోలో చూడవచ్చు.
నిజ నిర్ధారణ:
వైరల్ వీడియో ఎడిట్ చేయబడిందని మరియు ఆడియో డిజిటల్‌గా జోడించబడిందని న్యూస్‌మీటర్ కనుగొంది.
మార్చి 17న పల్నాడులో జరిగిన టీడీపీ-జనసేన-బీజేపీల ప్రజాగళం బహిరంగ సభ వీడియోలకు సంబంధించి మేము సెర్చ్ చేయగా. యూట్యూబ్‌లో ప్రజాగళం సభ ప్రత్యక్ష ప్రసారాన్ని మేము కనుగొన్నాము. [TV5 News, ABN Telugu, TV9 Telugu]
ప్రజాగళం సభ మొత్తం వీడియో చూశాం, నేతలందరి ప్రసంగాలు విన్నాం, కానీ, సమావేశంలో సీఎం జగన్‌కు సంబంధించిన పాటలేవీ వినిపించలేదు. పైగా, ప్రజాగళం మీటింగ్‌లో సీఎం జగన్ పాట ప్లే అయినట్లు మాకు ఎలాంటి వార్తా కథనాలు కనిపించలేదు.
మరింత శోధిస్తున్నప్పుడు, మేము ప్రజాగళం మీటింగ్ నుండి ఒక సంఘటన గురించి
వీడియోలు మరియు మీడియా
నివేదికలను కనుగొన్నాము. జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఆపి, లైట్ టవర్ నుండి కిందికి దిగమని పిఎం మోడీ ప్రజలను కోరడం ఇందులో మనం చూడవచ్చు.
అందుకే, ప్రజాగళం సభలో సీఎం జగన్ పాట వినిపించిందన్న వాదన అవాస్తవమని తేల్చిచెప్పాం. సోషల్ మీడియా యూజర్లు షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడింది.