Hyderabad: పదిహేడు అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు, అదే రోజు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది.
ఈ నేపథ్యంలో, ఒక సంవత్సరంలో ప్రజల్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జే రామ్ చందర్ నాయక్ అభినందిస్తున్నట్లు చూపిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వైరల్ వీడియోలో, ఎమ్మెల్యే సభలో మాట్లాడుతూ… “మనం ప్రజల్ని మోసం చేసే దాంట్లో విజయవంతం అయినం అధ్యక్షా. ఈ రోజు ప్రజల్లో చాల స్ఫూర్తిదాయకంగా ముందుకి తీసుకెళ్తున్నాం, ముఖ్యంగా ముఖ్య మంత్రి గారికి అభినందనలు తెలియజేయాలి అధ్యక్షా.”
“నిజం నిర్భయంగా ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్‌లో షేర్ చేయబడింది. (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్‌లను చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఎమ్మెల్యే ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకునేలా వైరల్ వీడియో రూపొందించారు.
కీవర్డ్ సెర్చ్‌ని ఉపయోగించి, సాక్షి టీవీ యూట్యూబ్ ఛానెల్‌లో ఎమ్మెల్యే రామ్ నాయక్ అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఎడిట్ చేయని వీడియోను కనుగొన్నాము. వీడియోలో, ఎమ్మెల్యే ప్రసంగం 1:21:11 నిమిషాల మార్క్ దగ్గర ప్రారంభమవుతుంది, దాదాపు ఐదు నిమిషాల పాటు కొనసాగుతుంది.
ఎమ్మెల్యే ప్రసంగం చేస్తున్న వీడియో నాలుగు వేర్వేరు భాగాలను కలిపి వైరల్ క్లిప్ తయారు చేసినట్లు చూడవచ్చు.
యూట్యూబ్ వీడియోలో 1:21:36 నిమిషాల మార్క్ నుండి 'గత ఒక సంవత్సరంలో మనం' అనే క్లిప్ తీసుకోబడింది; 1:21:40 నిమిషాల మార్క్ నుండి 'విజయవంతం అయినం అధ్యక్షా’ అనే క్లిప్ తీసుకోబడింది; 1:21:43 నిమిషాల మార్క్ నుండి ‘ప్రజల్ని మోసం చేసే దాంట్లో' అనే పదబంధం; యూట్యూబ్ వీడియోలో 1:21:17 నిమిషాల మార్క్ నుండి ‘ముఖ్యంగా ముఖ్య మంత్రి గారికి అభినందనలు తెలియజేయాలి’ అనే క్లిప్ తీసుకోబడింది.
అసలు సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం అన్నారు?
ఎమ్మెల్యే తన ప్రసంగంలో, “తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా, ఒక రాష్ట్రీయ గీతాన్ని, మరి ఈ రోజు ప్రజల్లో చాల స్ఫూర్తిదాయకంగా ముందుకి తీసుకెళ్తున్నాము ముఖ్యంగా ముఖ్య మంత్రి గారికి మనం అభినందనలు తెలియజేయాలి అధ్యక్షా.” అని అన్నారు. (తెలుగు నుండి అనువదించబడింది)
“తెలంగాణ పోరాట చరిత్రను మార్చే విధంగా, కేవలం వారి కుటుంబమే సాధించిందనే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనే కుట్ర కేటీర్ కుటుంబం చేస్తుంది,” అన్నారు
కేవలం కేసీఆర్, కేసీఆర్ కుటుంబమే తెలంగాణను సాధించిందనే కుట్రను మరిపించే విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
“పోరాట స్ఫూర్తి ని తెలంగాణ ప్రజలలో నింపడమే కాదు, ప్రజాకాంక్షలు నెరవేర్చే విధంగా పాలనను కూడా, మరి ప్రజలకు అన్ని ఫలాలను అందించడంలో కూడా విజయవంతం అయ్యాం. మళ్ళీ ఒకసారి ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కెసిఆర్ కుటంబ సభ్యులు ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే, దాన్ని కూడా మనం స్వాగతిస్తే అది కరెక్ట్ కాదు”
ఎమ్మెల్యే ప్రసంగంలోని వేర్వేరు క్లిప్స్ కలిపి వైరల్ వీడియోను తయారు చేసినట్లు న్యూస్‌మీటర్ నిర్ధారించింది. కాంగ్రెస్ మ్మెల్యే జే రామ్ చందర్ నాయక్ ప్రజల్ని మోసం చేయడంలో విజయవంతం అయ్యారని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని అభినందించలేదు.
ఈ క్లెయిమ్స్ తప్పు.