నిజమెంత: 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు కాకుండా సింగపూర్ కు వెళ్లాడా?

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ మే 13న ముగిసింది. జూన్ 4న ఫలితాల కోసం వేచి ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పని చేశారు నాయకులు..

By Newsmeter Network  Published on  22 May 2024 1:00 PM IST
నిజమెంత: 2024 ఏపీ ఎన్నికల పోలింగ్ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాకు కాకుండా సింగపూర్ కు వెళ్లాడా?
Claim: 2024 మే 13న ఆంధ్రప్రదేశ్ పోలింగ్ తర్వాత సింగపూర్‌కు చంద్రబాబు నాయుడు వెళ్లారు.
Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చంద్రబాబు నాయుడు పాత ఫోటోను సింగపూర్ రోడ్డులో ఉన్నట్లుగా డిజిటల్‌గా ఎడిట్ చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ మే 13న ముగిసింది. జూన్ 4న ఫలితాల కోసం వేచి ఉన్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా పని చేశారు నాయకులు.. ఎన్నికల వేడి కూడా ముగియడంతో పార్టీలకు అతీతంగా చాలా మంది రాజకీయ నాయకులు భారతదేశాన్ని విడిచిపెట్టి విదేశాలలో రిలాక్స్ అవుతూ ఉన్నారు.

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వరితో కలిసి అమెరికాకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతూ ఉంది.

అయితే చంద్రబాబు నాయుడు అమెరికాకు కాకుండా సింగపూర్‌కు వెళ్లినట్లు కొన్ని విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు సింగపూర్‌లోని ఆర్చర్డ్ రోడ్‌లో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

“What are you doing in Singapore when you say you are going to America???” అంటూ ట్విట్టర్ యూజర్లు పోస్టులు పెడుతున్నారు. అమెరికాకు వెళుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు సింగపూర్ లో ఏమి చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. (Archive)

నిజ నిర్ధారణ:

ఆర్చర్డ్ రోడ్‌లోని చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వైరల్ చిత్రం డిజిటల్ గా ఎడిట్ చేయడంతో.. ఆ వాదన తప్పు అని NewsMeter కనుగొంది.

వైరల్ ఇమేజ్‌ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సెప్టెంబరు 27, 2023న CNA వెబ్‌సైట్ ప్రచురించిన కథనాన్ని మనం చూడొచ్చు. కథనంలో చూపబడిన చిత్రం వైరల్ ఇమేజ్‌తో సమానంగా ఉంది. ఇక ఆ ఫోటోలో చంద్రబాబు నాయుడు లేరు.

‘File photo of people crossing the road along the Orchard Road shopping belt in Singapore. (Photo: AFP/Roslan Rahman)’ అంటూ ఇమేజ్ క్యాప్షన్ లో వివరణ ఇచ్చారు. సింగపూర్ లో ప్రజలు రోడ్డు దాటుతున్నారని ఆ ఫోటో ద్వారా తెలిసింది. ఈ ఫోటో కనీసం సెప్టెంబర్ 2023 నుండి ఇంటర్నెట్‌లో ఉందని తెలియజేస్తోంది.

రెండు చిత్రాలను పక్కపక్కనే పోల్చి చూడగా.. రెండూ ఒకేలా ఉన్నాయని చూపిస్తుంది. ఫ్రేమ్ మధ్యలో ముసుగు ధరించిన తెల్లటి దుస్తులు ధరించిన స్త్రీ, ఎడమ వైపున నల్లటి టీ-షర్టులో ఉన్న వ్యక్తి రెండు చిత్రాలలో ఒకే చోట ఉన్నారు.

మేము చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నారో కనుగొనడానికి వార్తా కథనాల కోసం వెతికాము.

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్లిన నేపథ్యంలో చంద్రబాబు కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలుగు న్యూస్ పోర్టల్ ది ఫెడరల్ మే 19న నివేదించింది.

మే 19న ప్రచురితమైన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని మేము కనుగొన్నాము. పార్టీ వర్గాలను ఉటంకిస్తూ, చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లినట్లు కథనం పేర్కొంది. గతంలో అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని.. ఇప్పుడు మరోసారి వెళ్లినట్లు పేర్కొంది. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి వస్తారని కథనం పేర్కొంది.

అయితే, చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లలేదని పార్టీ సభ్యులు పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. మే 13న ఏపీ పోలింగ్ రోజు తర్వాత న్యూస్ మీటర్ స్వతంత్రంగా చంద్రబాబు నాయుడు ప్రయాణం గురించి ధృవీకరించలేకపోయినప్పటికీ.. సింగపూర్ రోడ్డులో చంద్రబాబు నాయుడు ఉన్నారనే వైరల్ ఇమేజ్ ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము.

Claim Review:2024 మే 13న ఆంధ్రప్రదేశ్ పోలింగ్ తర్వాత సింగపూర్‌కు చంద్రబాబు నాయుడు వెళ్లారు.
Claimed By:X Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. చంద్రబాబు నాయుడు పాత ఫోటోను సింగపూర్ రోడ్డులో ఉన్నట్లుగా డిజిటల్‌గా ఎడిట్ చేశారు.
Next Story