Fact Check: తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌లో మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్ చేశాడా? నిజం ఏమిటి?

తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌లో మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్ చేశాడని చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By -  M Ramesh Naik
Published on : 16 Oct 2025 5:07 PM IST

Fact Check: తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌లో మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్ చేశాడా? నిజం ఏమిటి?
Claim:తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌లో మద్యం మత్తులో వ్యక్తి యాత్రికులను భయభ్రాంతులకు గురి చేశాడు.
Fact:ఈ దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఆ వీడియో ఏడుకొండల బస్టాండ్‌ది కాదు. ఇది తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్‌ వద్ద ఉన్న ప్రైవేట్‌ బస్‌స్టాప్‌ దగ్గర జరిగిన సంఘటన. ఆ వ్యక్తి మద్యం మత్తులో కాకుండా మొబైల్‌ దొంగతనానికి పాల్పడగా పట్టుబడ్డాడు.
హైదరాబాద్: తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌లో మద్యం మత్తులో వ్యక్తి హల్‌చల్ చేశాడని చెబుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఒకరిని పట్టుకుని తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది.

ఒక ఫేస్‌బుక్‌ యూజర్‌ ఆ వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశాడు,“మద్యం మత్తులో తిరుపతి ఏడుకొండల బస్టాండ్ వద్ద వ్యక్తి హల్‌చల్... సోమవారం అర్థరాత్రి తాగిన మద్యం మత్తులో గుర్తు తెలియని వ్యక్తి యాత్రికులను భయభ్రాంతులకు గురిచేశాడు...” (ఆర్కైవ్)

Fact Check

న్యూస్‌మీటర్ ఈ వీడియోపై చేసిన పరిశీలనలో క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని తేలింది. ఆ వీడియో ఏడుకొండల బస్టాండ్‌ది కాదు, ఆ వ్యక్తి మద్యం మత్తులో కాకుండా మొబైల్‌ దొంగతనానికి పాల్పడగా పట్టుబడ్డాడు.

తిరుపతి పోలీసు శాఖ అక్టోబర్ 15, 2025న తమ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోపై స్పష్టీకరణ ఇచ్చింది. ఆ పోస్టులో ఇలా ఉంది,“తిరుపతి జిల్లా పోలీస్ శాఖ...

- ఫ్యాక్ట్ చెక్ — వైరల్ వీడియోపై పోలీస్ శాఖ అధికారిక స్పష్టీకరణ
- సోషల్ మీడియాలో ఒక వీడియోను “మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తిరుపతి ఏడు కొండల బస్‌స్టాండ్ వద్ద యాత్రికులను భయబ్రాంతులకు గురి చేశాడు” అంటూ ప్రచారం చేయడం జరుగుతున్నది.
- వాస్తవ పరిస్థితి:
- పోలీసులు విచారణ జరిపినప్పుడు, ఆ వీడియో ఏడు కొండల బస్‌స్టాండ్‌ది కాదని, 14.10.2025 సాయంత్రం పూర్ణకుంభం సర్కిల్ సమీపంలోని ప్రైవేట్ బస్‌లు ఆగే ప్రదేశంలో చిత్రీకరించబడినదిగా తేలింది.
- భారతి ట్రావెల్స్‌లో పనిచేస్తున్న క్లీనర్ నాగరాజు నిద్రపోతుండగా, సెల్వం మహేష్ (నాగూర్ వాసి) అతని మొబైల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించాడు.
- అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా స్పందించి, ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు
- ఆ సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో లేడు.”
పోలీసులు ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 529/2025, సెక్షన్ 303(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తిరుపతి పోలీసులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని పంచుతున్న వారిపై హెచ్చరిక జారీ చేస్తూ, “వైరల్ అవుతున్న ఈ వీడియో తప్పుడు, వాస్తవాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు” అని తెలిపారు.

అదేవిధంగా తిరుపతి పోలీస్ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో కూడా ఇదే విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేస్తూ పోస్టు చేశారు.

వైరల్ అవుతున్న వీడియో తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌ది కాదు. పూర్ణకుంభం సర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ బస్‌స్టాప్‌లో మొబైల్ దొంగతనం ఘటనకు సంబంధించినది.
అందువల్ల, ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించేది.
Claimed By:Social Media user
Claim Reviewed By:NewsMeter
Claim Source:Facebook, Instagram
Claim Fact Check:False
Fact:ఈ దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఆ వీడియో ఏడుకొండల బస్టాండ్‌ది కాదు. ఇది తిరుపతిలోని పూర్ణకుంభం సర్కిల్‌ వద్ద ఉన్న ప్రైవేట్‌ బస్‌స్టాప్‌ దగ్గర జరిగిన సంఘటన. ఆ వ్యక్తి మద్యం మత్తులో కాకుండా మొబైల్‌ దొంగతనానికి పాల్పడగా పట్టుబడ్డాడు.
Next Story