మార్చి 15న, ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మ్‌నెట్ డైరెక్టరేట్ [ED] మాజీ ముఖ్యమంత్రి కె. చద్రశేఖరరావు కుమార్తె, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది.
ED రైడ్ సమయంలో కవిత సోదరుడు మరియు మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు కొంతమంది న్యాయవాదులు కవిత ఇంటి దగ్గర కనిపించారు.
దీనికి సంబంధించి కవితను విడుదల చేయకపోతే తాను పెట్రోల్ పోసుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినట్టు ‘నా తెలంగాణ’ అనే పత్రిక రిపోర్ట్ చేసినట్టు ఉన్న ఒక న్యూస్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"కవితను విడుదల చేయకపోతే నేను పెట్రోల్ పోసుకుంటా..! మాజీ మంత్రి హరీష్
అక్రమంగా ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో ఇరికించారు
మా జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మా ఓపికను, సహనాన్ని పరీక్షంచొద్దు
కాంగ్రెస్, బిజెపి పార్టీలకు తెలంగాణలో తిరిగే హక్కు లేదు
కవిత అరెస్ట్ పై మాజీ మంత్రి హరీష్ ఫైర్" అంటూ ఆ న్యూస్ క్లిప్ పేర్కొంది.
నిజ నిర్ధారణ:
వైరల్ న్యూస్ క్లిప్ డిజిటల్‌గా ఎడిట్ చేయబడిందని మరియు నకిలీదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వైరల్ న్యూస్ క్లిప్ 2024 మార్చి 17న నా తెలంగాణ వార్తాపత్రిక ప్రచురించినట్లు పేర్కొన్నందున, మేము ఆ తేదీకి సంబంధించిన వార్తాపత్రికను మొత్తం చూశాము. ఈ వైరల్ న్యూస్ క్లిప్
వార్తాపత్రికలో ఎక్కడా మాకు కనిపించలేదు.
వైరల్ న్యూస్ క్లిప్‌పై లింక్ ఉన్నందున, మేము ఆ
లింక్‌తో వెతకగా, బెంగాల్‌లో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగానికి సంబంధించిన వార్తా కథనం కనుగొనబడింది.
కవితను ED అరెస్ట్ చేసిన తరువాత హరీష్ రావు
మీడియా తో మాట్లాడినప్పుడు కూడా, ఈ వైరల్ క్లిప్ లో రాసినట్టుగా అయన ఎటువంటి ఘాటు వ్యాఖ్యలు చేయలేదు. పైగా హరీష్‌రావు నిజంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చిఉండేవి.
ఈ ఆధారాలతో, బెంగాల్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగంపై వార్తా కథనాన్ని వైరల్ న్యూస్ క్లిప్‌కు ఎడిట్ చేసినట్లు రుజువైంది.
కావున, కవితను విడుదల చేయకపోతే పెట్రోల్ పోసుకుంటానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు వచ్చిన ఈ న్యూస్ క్లిప్ ఫేక్ అని మేము నిర్ధారించాము.