Fact Check: లవర్‌తో దొరికిన కొడుకు, మెట్రో స్టేషన్‌లో ఎంగేజ్మెంట్ చేసిన తల్లి? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి
ఒక జంటకు మెట్రో స్టేషన్‌లోనే ఎంగేజ్మెంట్ జరిపించిన తల్లిని చూపిస్తుంది అనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
By - K Sherly Sharon |
Claim:మెట్రో స్టేషన్‌లోనే ఎంగేజ్మెంట్ జరిపించిన తల్లిని చూపిస్తున్న వాస్తవ ఘటన
Fact:ఈ క్లెయిమ్‌లో నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో స్క్రిప్టెడ్.
Hyderabad: మెట్రో స్టేషన్‌లోనే ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య జరిగిన నిశ్చితార్థ వేడుక జరిగించిన తల్లి అనే క్లెయిమ్‌లతో ఓ వీడియోను వార్తా వెబ్సైట్లు ప్రచురిస్తున్నాయి. వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
వీడియోలో, వరుడి తల్లి వీడియో పూర్తయిన తర్వాత దానిని అమ్మాయి తండ్రికి పంపమని చిత్రీకరిస్తున్న వ్యక్తికి చెబుతుంది. వీడియోపై ఇలా రాశారు, "లవర్ తో దొరికిన కొడుకు మెట్రో స్టేషన్ లో ఎంగేజ్మెంట్ చేసిన తల్లి"
ఈ వీడియో ఫేస్‌బుక్‌లో కూడా ఇదే క్యాప్షన్‌తో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఈ వీడియో గురించి టీవీ9, ఆంధ్రజ్యోతి, వన్ ఇండియా, Z తెలుగు న్యూస్, ఎన్ టీవీ మీడియా సంస్థలు కూడా కథనాలను ప్రచురించాయి.
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. ఈ వీడియో ఉద్దేశపూర్వకంగా రాసి, చిత్రీకరించబడింది.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఆధారంగా ఇదే వీడియోలో యూట్యూబ్ షార్ట్స్‌లో కూడా ఫిబ్రవరి 5న అప్లోడ్ చేయబడినట్లు గుర్తించాం. ఈ వీడియోని, "మెట్రో స్టేషన్‌లో నా ఎంగేజ్మెంట్ జరిగింది #aaravmavi #chaltephirte #shareyourstory #manishsom" అనే శీర్షికతో షేర్ చేశారు. 'Chalte_phirte098' అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని అప్లోడ్ చేసింది.
ఈ ఛానెల్‌ని పరిశీలించగా వేరే వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనలను కూడా కథలు కథలుగా చిత్రీకరించి షేర్ చేసినట్లు చూడగలం.
'సిద్ధార్థ్ మరియు దీక్షల ప్రేమకథ (మెట్రో స్టేషన్‌లో నిశ్చితార్థం జరిగింది) #aaravmavi #chaltephirte' అనే శీర్షికతో అదే ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన వైరల్ వీడియో పొడిగించిన వెర్షన్‌ను కనుగొన్నాం.
పూర్తి వీడియో 18 నిమిషాల నిడివి ఉంది. ఈ పూర్తి వీడియోలో సిద్ధార్థ్ అనే వరుడు గ్రామం నుండి వచ్చిన బాబాయ్, పిన్నిలతో కలిసి వధువు, దీక్ష, కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది. వారు మెట్రో స్టేషన్‌లో అమ్మాయి కోసం వేచి ఉన్నారు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత, ఆ అమ్మాయి వచ్చి వారిని ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరిస్తుంది. తన తండ్రి కులాంతర వివాహానికి వ్యతిరేకం అని ఆమె వివరించింది.
దీని తర్వాత, ఆ అమ్మాయి తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడింది, కానీ అతను నిరాకరించాడు. ఆ తర్వాత అబ్బాయి పిన్ని ఇద్దరికీ మెట్రో స్టేషన్‌లో ఆపి ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపించింది. సంఘటనను చిత్రీకరించిన వ్యక్తిని దానిని సరిగ్గా రికార్డ్ చేసి అమ్మాయి తండ్రికి పంపమని పిన్ని కోరింది..
ఈ సంఘటనను చిత్రీకరించిన వ్యక్తి వీడియో ప్రారంభంలో కనిపించాడు. అదే వ్యక్తి ఈ ఛానెల్‌లో ఇతరుల వీడియోలలో నాటకీయ సంఘటనలను చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి వీడియోలను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోలలో కూడా అతను వీడియో ప్రారంభంలో కనిపించాడు, మిగిలిన వీడియోలో ఏమి జరుగుతుందో వివరిస్తాడు.
ఈ యూట్యూబ్ ఛానెల్ వివరణ విభాగంలో లింక్ చేయబడిన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌ను కనుగొన్నాం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లకు వినియోగదారు పేర్లు ఒకే విధంగా ఉన్నాయి - 'chalte_phirte098'
ఈ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కూడా అదే వైరల్ వీడియో షేర్ చేయబడింది. వినియోగదారు పేరు ఆరవ్ మావి అని పేర్కొనబడింది. వీడియో గురించి తెలుసుకోవడానికి ఆరవ్ మావిని సంప్రదించాం.
న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, ఆరవ్ మావి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలు నిజమైన సంఘటనలను ఆధారం చేసుకొని రూపొందించబడిన స్క్రిప్టెడ్ వీడియోలు అని ధృవీకరించాడు. ఇలా అన్నాడు, "నా ఛానెల్ 'చల్తే ఫిర్తే'లో, నిజమైన వ్యక్తులు నాతో పంచుకున్న నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన వీడియోలను నేను సృష్టిస్తాను. సంఘటనలు వాస్తవమైనవి అయినప్పటికీ, కథ చెప్పే ప్రయోజనాల కోసం సన్నివేశాలను నాటకీయంగా చూపిస్తాను, సృజనాత్మక స్వేచ్ఛలను తీసుకుంటాను. కథల సారాంశాన్ని గౌరవిస్తూనే అవి కథనానికి సరిపోతాయని నిర్ధారించుకోవడం నా లక్ష్యం."
కాబట్టి వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదని, అది స్క్రిప్టెడ్ వీడియో మాత్రమే అని తేలింది. న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.