Fact Check : పుష్ప-2కి "అట్టర్‌ఫ్లాప్" రివ్యూలా? నిజానిజాలు ఇక్క‌డ‌ తెలుసుకోండి...

సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న పలు వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో పుష్ప 2 ఫ్లాప్ అనే క్లెయిమ్‌లతో షేర్ చేస్తున్నారు.

By K Sherly Sharon  Published on  6 Dec 2024 3:00 PM GMT
Fact Check : పుష్ప-2కి అట్టర్‌ఫ్లాప్ రివ్యూలా? నిజానిజాలు ఇక్క‌డ‌ తెలుసుకోండి...
Claim: సినీ ప్రేక్షకులు “పుష్ప 2: ది రూల్” చిత్రానికి ప్రతికూల రివ్యూలు ఇస్తున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
Fact: వైరల్ వాదనలు తప్పు. ప్రతికూల రివ్యూలు చూపిస్తున్న వీడియో క్లిప్‌లు పాతవి, వీటికీ“పుష్ప 2: ది రూల్” చిత్రానికి ఏ సంబంధం లేదు.
Hyderabad: సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న "పుష్ప 2: ది రూల్" ఈ వారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. జనం ఎన్నో అంచనాలతో థియేటర్లకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాకు ప్రతికూల రివ్యూలు వస్తున్నాయి అంటూ పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలాంటి మూడు వైరల్ క్లెయిమ్‌లను ఇప్పుడు చూద్దాం.
Claim 1
ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ సినిమా “బిలో యావ‌రేజ్‌”గా ఉందని, చాల మంది సినిమా మధ్యలోనే హాల్ నుండి వెళ్లిపోతున్నారని చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. సినిమా గురించి మాట్లాడుతూ వీడియోలో ఆ వ్యక్తి ఇలా అన్నారు “బాలేదు. అసలు నాకేం నచ్చలేదు. సినిమా థ‌యేట‌ర్‌లో ఉండబుద్ది కావట్లేదు. ఇంకా సినిమా ఉంది, నేను బయటికి వచ్చేస్తున్నా. చాలా మంది మాతోపాటు అలాగే వస్తున్నారు... బిలో యావ‌రేజ్‌ సినిమా.”
వీడియో క్లిప్‌ని షేర్ చేసిన సోషల్ మీడియా యూజ‌ర్ పోస్ట్ కాప్షన్జ్‌లో ఈ విధంగా వ్రాశారు. "#పుష్ప-2 జెన్యూన్ రివ్యూ అట్టర్ ప్లాప్... అల్ట్రా డిజాస్టర్ #Pushap2TheRule @alluarjun." (ఆర్కైవ్)

Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.
వీడియో కుడివైపు పైభాగంలో "Telugu 70MM" అనే లోగో కనిపిస్తుంది. ఈ లీడ్ అనుసరించి వైరల్ అవుతున్న వీడియో కోసం “Telugu70mm” యూట్యూబ్ ఛానెల్‌లో వెతికాము. ఆగస్టు 15న ఛానెల్ అప్‌లోడ్ చేసిన ఓ వీడియోను కనుగొన్నాము. ఆ వీడియో టైటిల్‌లో ఈ విధంగా వ్రాసారు “మిస్టర్ బచ్చన్ పబ్లిక్ టాక్ | రవితేజ | హరీష్ శంకర్ #రవితేజ #harishshankar #mrbachchanpublictalk" (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)
యూట్యూబ్ వీడియో టైటిల్ ని, అప్లోడ్ తేదిని మీరు క్రింద ఉన్న చిత్రంలో చూడగలరు.

ఈ వీడియో ఆగస్ట్‌లో చిత్రీకరించబడింది. ఇందులో “మిస్టర్ బచ్చన్” సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఇది అల్లు అర్జున్ నటించిన "పుష్ప 2: ది రైజ్" సినిమాకిచ్చిన రివ్యూ కాదు, కాబట్టి వైరల్ పోస్ట్ చేస్తున్న క్లెయిమ్ తప్పు అని నిర్ధారించాం.
Claim 2
ఈ వీడియోలో ఒక వ్యక్తి మాట్లాడుతూ తాను చూసిన సినిమా "బేకార్" అని, మొత్తం యాక్షన్ సీన్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ వీడియోని షేర్ చేసిన వ్యక్తి క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాసారు "పుష్ప 2 సినిమా హానెస్ట్ రివ్యూ #Pushpa2.” (
ఆర్కైవ్
)

Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.
ఈ వీడియో ఎడమవైపు “Viral Bollywood .com” అనే లోగో కనిపిస్తుంది. ఈ లీడ్ అనుసరించి “Viralbollywood” వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్ కనుగొన్నాము. ఈ ఛానెల్లో 2016 జూన్ 17న అప్లోడ్ చేయబడిన “ఉడ్తా పంజాబ్ ఫుల్ మూవీ రివ్యూ | పబ్లిక్ రివ్యూ | షాహిద్ కపూర్, అలియా భట్, దిల్జిత్ దోసాంజ్ & కరీనా” అనే వీడియో ఉంది. (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)
ఈ వీడియోలో సరిగ్గా 9:37 టైమ్‌స్టాంప్‌లో వైరల్ అవుతున్న వీడియో క్లిప్ కనిపిస్తుంది. ఈ యూట్యూబ్ వీడియో ఆధారంగా "బేకార్" అంటూ వైరల్ వీడియోలో వ్యక్తి ఇచ్చిన రివ్యూ "ఉడ్తా పంజాబ్" సినిమా గురించి అని తెలుస్తుంది.
వైరల్ వీడియో, యూట్యూబ్ వీడియోల మధ్య పోలికలు క్రింద ఉన్న చిత్రంలో చూడగలరు.

వైరల్ పోస్ట్ లో క్లెయిమ్ చేసినట్లు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పుష్ప 2 సినిమా గురించి ప్రతికూల రివ్యూ ఇవ్వలేదు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.
Claim 3
ఈ వీడియోలో ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ.. సినిమా చూడడం కంటే జైల్లో ఉండటమే మేలు అని మీడియాతో మాట్లాడడం చూడగలం. “నాకు చాల కోపం వచ్చింది. థియేటర్ తలుపులు ఎప్పుడు తీస్తారా పారిపోదాం అనుకున్నా... నేను జైల్లో ఉండడానికి ఇష్టపడతాను కానీ ఈ సినిమా చూడడం నాకు ఇష్టం లేదు. ఈ లోకంలోనే అత్యంత చెడ్డ సినిమా.. మీ తలకెవరైనా గన్ ఎక్కుపెట్టి ఈ సినిమా చూడమన్నా చూడకండి,” అన్నారు.
వీడియో క్లిప్ షేర్ చేస్తూ ఓ సోషల్ మీడియా యూజర్ ఇలా రాశారు “#Pushpa2Review #allua పుష్ప2 హానెస్ట్ రివ్యూ”. (ఇంగ్లీష్ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)

Fact Check
వీడియో రివ్యూకి పుష్ప2 సినిమాకి ఏ సంబంధం లేదు కాబట్టి న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది.
ఈ వీడియోలో కూడా ఎడమవైపు “Viral Bollywood .com” అనే లోగో కనిపిస్తుంది. “Viralbollywood” యూట్యూబ్ ఛానెల్లో 2017 ఆగస్టు 4న అప్లోడ్ చేయబడిన వీడియో దొరికింది.
వీడియో టైటిల్ “జబ్ హ్యారీ మెట్ సెజల్ మూవీ రివ్యూ | షారుక్ ఖాన్.” ఈ వీడియోలో సరిగ్గా 1:23 టైం స్టాంప్ దగ్గర వైరల్ క్లిప్ ఉన్నట్లు చూడగలం. క్రింద ఉన్న చిత్రంలో రెండు వీడియోల మధ్య పోలికను చూడవచ్చు. (ఆర్కైవ్)

ఈ వీడియో ఆధారంగా చూస్తే, రివ్యూ "జబ్ హ్యారీ మెట్ సెజల్" సినిమాకి ఇచ్చినది అర్థం అవుతుంది. కాబట్టి వైరల్ పోస్ట్ లో చేసిన క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.
Claim Review:సినీ ప్రేక్షకులు “పుష్ప 2: ది రూల్” చిత్రానికి ప్రతికూల రివ్యూలు ఇస్తున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి.
Claimed By:Social Media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:వైరల్ వాదనలు తప్పు. ప్రతికూల రివ్యూలు చూపిస్తున్న వీడియో క్లిప్‌లు పాతవి, వీటికీ“పుష్ప 2: ది రూల్” చిత్రానికి ఏ సంబంధం లేదు.
Next Story