Hyderabad: భారీ సంఖ్యలో తుపాకులు, రైఫిళ్లు చూపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్నది గోప్యంగా జరుగుతున్న జిహాదీ సన్నాహాల చిన్న ఉదాహరణ అంటూ క్లెయిమ్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని ఒక ముస్లిం వైద్యుడి ఇంటి నుండి పట్టుబడిన 3,000 తుపాకులు, 50,000 బుల్లెట్లను చూపిస్తుందని ఆరోపిస్తూ షేర్ చేస్తున్నారు.
ఈ ఫోటోని ఫేస్‌బుక్‌లో షేర్ చేసి, క్యాప్షన్‌లో ఇలా రాశారు, "లక్నోలో దారుణం! ఒక ముస్లిం డాక్టర్ ఇంట్లో ఏకంగా 3,000 తుపాకులు. 50,000 బుల్లెట్లు పట్టుబడ్డాయి! జిహాదీల గుండెల్లో నిద్రపోతున్న యోగీజీ పాలనలోనే ఇంతటి ఘోరం అయితే... మన రాష్ట్రాల్లో ఎప్పుడు తూటా దింపేవాళ్లకు ఎదురెవరు? ఎప్పుడు మన మీద దాడి చేస్తారో ఎవరికీ తెలియదు! ఇది కేవలం గోప్యంగా జరుగుతున్న జిహాదీ సన్నాహాల చిన్న ఉదాహరణ మాత్రమే! మనం లేస్తే గాని – మన భవిష్యత్తు సురక్షితం కాదు!" (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు.(ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ ఫోటో 2013లో ఐయోవా డీసీ క్రైమ్ ల్యాబ్‌లో తీయబడింది.
ఈ చిత్రం రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2021లో Xలో పోస్ట్ చేసిన వైరల్ ఫోటో దొరికింది. 2017లో కూడా Xలో ఈ ఫోటోని షేర్ చేశారు.
KCCI డెస్ మోయిన్స్ ప్రచురించిన ఒక కథనంలో కూడా ఈ చిత్రాన్ని ఉపయోగించారని కనుగొన్నాం. ఈ కథనాన్ని మే 15, 2013న 'తుపాకీలను వెనక్కి తీసుకునే సంఘటనలు: తుపాకులు ఎక్కడికి వెళ్తాయి?' అనే శీర్షికతో షేర్ చేయబడింది.
ఈ కథనం ప్రకారం, అయోవాలోని పోలీసు విభాగాలు తుపాకుల వెనక్కి తీసుకునే కార్యక్రమాన్ని నిర్వహించాయి, ఇక్కడ ప్రజలు తమకు ఇకపై అవసరం లేని ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వచ్ఛందంగా క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ల్యాబ్ విభాగానికి అప్పగించవచ్చు. DCI క్రిమినలిస్టిక్స్ ల్యాబొరేటరీ అయోవాలోని అంకెనీలో ఉంది.
అయోవా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసిన క్రైమ్ ల్యాబ్ వీడియోను కనుగొన్నాం. ఈ వీడియో 4:11 నిమిషం మార్కు వద్ద, వైరల్ ఫోటోలో కనిపించే క్రమంలో అమర్చబడిన తుపాకులు చూడవచ్చు. అయితే వైరల్ ఫోటో ఇక్కడి నుండే వచ్చింది అని తేలింది.
లక్నోలో ముస్లిం డాక్టర్ ఇంట్లో తుపాకులు పట్టుబడ్డాయా అని తెలుసుకోడానికి కీ వర్డ్ సెర్చ్ ఉపయోగించాము. జూన్ 30న టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కథనం దొరికింది. టైటిల్‌లో "దుబాయ్, పాక్ దేశాలకు అక్రమ ఆయుధాలు, ఎంఎఫ్‌జి రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానం".
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లాలోని మలిహాబాద్‌లో అక్రమ ఆయుధ విభాగం పనిచేస్తున్నట్లు గుర్తించిన తర్వాత సంప్రదాయ వైద్యుడు హకీమ్ సలావుద్దీన్ అరెస్టు చేయబడ్డాడు.
లక్నో పోలీస్ ఈ రైడ్‌లో 14 తుపాకులు, దాదాపు 140 గుళికలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో దొరికిన తుపాకులు సంఖ్యను 3000 లకు , బుల్లెట్ల సంఖ్యను 50,000 లకు పెంచి చూపిస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. వైరల్ చిత్రం ఈ రైడ్‌లో దొరికిన తుపాకులను చూపించడం లేదు.
కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.