Hyderabad: గత మూడు రోజులుగా ఒక యువతి తన తల్లి సమాధి వద్ద నిద్రిస్తున్నట్లు క్లెయిమ్‌లతో ఆన్‌లైన్‌లో ఒక వీడియో వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో బుర్ఖా ధరించిన మహిళ సమాధిపై కూర్చుని ఉంది. వీడియోలో ఒక గేటు కనిపిస్తుంది, గేటు దగ్గర గోడపై ఉన్న రాతలు ఆ స్థలం సమరన్ మసీదు, గేట్ నంబర్ 6 అని సూచిస్తున్నాయి.
వైరల్ వీడియోను Xలో షేర్ చేస్తూ, @ChotaNewsApp అనే యూజర్ ఇలా రాశారు, "కరీంనగర్ జిల్లాలోని కబరస్తాన్‌లో(స్మశానంలో) ఓ యువతి తన తల్లి మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే గత మూడు రోజులుగా నిద్రిస్తూ సంచలనం సృష్టించింది. యువతి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లి, పగలూ రాత్రీ తేడా లేకుండా సమాధిని ఆనుకుని ఉండటం స్థానికులలో, కుటుంబ సభ్యులలో భయాందోళన కలిగిస్తోంది. షీ టీమ్స్, సఖి టీం, మహిళా సంక్షేమ అధికారులు స్పందించి యువతికి రక్షణ, వైద్యం అందించాలని మానవతా వాదులు కోరుతున్నారు." (ఆర్కైవ్)
ఇదే క్లెయిమ్ చేస్తున్న పోస్ట్‌ను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2, ఆర్కైవ్ 3)
అనేక వార్తా సంస్థలు కూడా వివిధ భాషల్లో ఇవ్వే క్లెయిమ్‌లతో వైరల్ వీడియోను షేర్ చేస్తున్నాయి. ఈ కథనాలను ఇక్కడ చూడవచ్చు: న్యూస్18 తెలుగు (ఆర్కైవ్), సాక్షి (ఆర్కైవ్), ది సియాసత్ డైలీ (ఆర్కైవ్), సమయం (ఆర్కైవ్), తేజస్ న్యూస్ (ఆర్కైవ్)
Fact Check
వైరల్ వాదనలలో నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది. యువతి తల్లి మరణించలేదని, మానసికంగా కలత చెందినందువల్ల స్మశానవాటికలో కూర్చున్నట్లు వైరల్ వీడియోలో ఉన్న యువతి తండ్రి న్యూస్‌మీటర్‌కు ధృవీకరించారు.
వైరల్ వీడియోలో ఉన్న సమరన్ మసీదు మేనేజింగ్ కమిటీ జాయింట్ సెక్రటరీ అర్షద్ అలీని సంప్రదించాం. వీడియోలో ఉన్న యువతి తల్లి చనిపోలేదని అయన అన్నారు.
న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, "వీడియోలో ఉన్న యువతి మానసికంగా కుంగిపోయింది, అందుకే ఆమె స్మశానవాటికకు వచ్చి ఇక్కడ కూర్చుంది. గతంలో ఇలా జరిగినప్పుడు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం, వారు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఎవరో దీనిని వీడియో తీసి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ షేర్ చేశారు" అన్నారు అర్షద్ అలీ.
జమియత్ ఉలామా కరీంనగర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ ముదస్సిర్ ఉర్ రెహమాన్ తబ్రైజ్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, బాలికల తల్లిదండ్రులు ఇద్దరూ బతికే ఉన్నారని ధృవీకరించారు. "ఆమె తల్లితండ్రులు బ్రతికే ఉన్నారు. తల్లి సమాధిపై మూడు రోజులు నిద్రించడం అనేది నిజం కాదు. ఆమె మానసిక అస్వస్థతతో బాధపడుతోంది, నిరాశకు గురై అక్కడికి వెళ్లింది. అక్కడ మూడు రోజులు కూర్చుంది అన్న మాట అబద్దం" అన్నారు.
వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి తండ్రి, పేరు వెల్లడించకుండా ఉండటాన్ని ఎంచుకుని, న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ , "ఆ వీడియోలో ఉన్న అమ్మాయి నా కూతురు. ఆమె బిటెక్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఆమె కలత చెంది స్మశానవాటికలో కూర్చోవడానికి వెళ్ళింది. ఆమె తల్లి సజీవంగా, ఆరోగ్యంగా ఉంది, వైరల్ వాదనలు పూర్తిగా అవాస్తవం" అని అన్నారు.
కాబట్టి, వైరల్ అవుతున్న క్లెయిమ్‌లలో నిజం లేదని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.