Hyderabad: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పలు కార్చిచ్చులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వందలాది మంది నిరాశ్రయులయ్యారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంటల్లో చిక్కుకొని ఊరంతా కాలిపోయినా.. ఒక చర్చి మాత్రం కాలిపోలేదని క్లెయిమ్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
"అమెరికా దేశంలో లాస్ ఏంజెల్స్ మొత్తం కాలిపోయినా... దేవుని మందిరము మాత్రం చెక్కు చెదరలేదు," అని చూపిస్తున్న చిత్రాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్ ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ చిత్రం ఏఐ ద్వారా సృష్టించబడినది.
వైరల్ అవుతున్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా లాస్ ఏంజెలెస్ నగరానికి చెందినట్టుగా ఎలాంటి మ్యాచ్స్ దొరకలేదు.
అగ్నిప్రమాదంలో చర్చి మాత్రమే కాలిపోకుండా ఉంది అని చూపించే కథనాలు కూడా ఏవీ దొరకలేదు.
చిత్రం బ్యాక్ గ్రౌండ్లో ఉన్న చెట్లు, రోడ్డు, సముద్రం అస్పష్టమైన వివరాలు ఉండడం వల్ల, ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారేమో అని తెలుసుకోడానికి Fake Image Detector సాధనాన్ని ఉపయోగించాం. ఈ చిత్రం కంప్యూటర్ రూపొందించిన లేదా సవరించిన చిత్రంలా కనిపిస్తోంది అని తేలింది.
Hive Moderation, wasitai వంటి ఏఐ సవరింపులను గుర్తించే సాధనాలను తో పరిశీలించగా, ఈ చిత్రం ఏఐ చేత తయారు చేసినట్లు కనుగొన్నాం.
కాబట్టి, న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.