Fact Check : ఢిల్లీ తొక్కిసలాట నేప‌థ్యంలో వైర‌ల‌వుతున్న వీడియో ఇప్ప‌టిది కాదు.. నిజం ఇక్కడ తెలుసుకోండి

కిక్కిరిసిన రైలులో ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తులు అనే క్లెయిమ్‌తో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

By K Sherly Sharon  Published on  18 Feb 2025 6:18 PM IST
Fact Check : ఢిల్లీ తొక్కిసలాట నేప‌థ్యంలో వైర‌ల‌వుతున్న వీడియో ఇప్ప‌టిది కాదు.. నిజం ఇక్కడ తెలుసుకోండి
Claim: కిక్కిరిసిన రైలులో కుంభమేళాకు వెళ్తున్న భక్తులు అని చూపిస్తున్న వీడియో.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో పాతది, 2018 నుండి చాలాసార్లు వైరల్ అయింది.

Hyderabad: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఫిబ్రవరి 15న విషాదం చోటుచేసుకుంది. రాత్రి 8 గంటల సమయంలో జరిగిన భారీ తొక్కిసలాటలో పిల్లలు, 14 మంది మహిళలు సహా కనీసం 18 మంది మరణించారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాకు వెళ్లే రైలులో రద్దీ పెరిగి, ఈ సంఘటన జరిగింది.

ఈ నేపథ్యంలో రద్దీగా ఉన్న రైలును చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రైలు కుంభమేళాకు వెళ్తుంది అన్న వాదనలతో షేర్ చేస్తున్నారు.

కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను విమర్శిస్తూ, ఒక X వినియోగదారుడు వైరల్ వీడియోని షేర్ చేసి, "ఈ తయారీ మూడు సంవత్సరాలుగా కొనసాగుతోంది. #KumbhStampede #trainaccident" అని రాశారు. (హిందీ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)

Fact Check


న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఇది పాత వీడియో, కనీసం 2018 నుండి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

వీడియో కీఫ్రేమ్‌ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ ద్వారా 2018 ఫిబ్రవరి 27న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడిందని కనుగొన్నాము. ఆ వీడియో బీహార్‌లోని పాట్నాకు సంభందించినది పేర్కొన్నారు.

ఈ వీడియో 2022లో కూడా వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో UP-PET పోటీ పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఇలా ప్రయాణిస్తున్నట్లు క్లెయిమ్ చేయబడింది. అయితే, నార్త్ సెంట్రల్ రైల్వే అధికారిక X హ్యాండిల్ అక్టోబర్ 15, 2022న ఒక పోస్ట్‌లో ఈ క్లెయిమ్ ని తోసిపుచ్చింది. వీడియోకి పోటీ పరీక్షలకు హాజరౌతున్న అభ్యర్థులకు ఎలాంటి సంభందం లేదని స్పష్టం చేశారు.



అక్టోబర్ 15, 2022న, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్-చెక్ X హ్యాండిల్ కూడా ఈ వీడియో UP-PET పరీక్షకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారన్న విషయాన్ని న్యూస్‌మీటర్ ఖచ్చితంగా ధృవీకరించలేకపోయింది. అయితే, ఈ వీడియో 2018 నుండి ప్రచారంలో ఉందని, ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు సంబంధం లేదని నిర్ధారించాము. కాబట్టి వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు.

Claim Review:కిక్కిరిసిన రైలులో కుంభమేళాకు వెళ్తున్న భక్తులు అని చూపిస్తున్న వీడియో.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. ఈ వీడియో పాతది, 2018 నుండి చాలాసార్లు వైరల్ అయింది.
Next Story