Hyderabad: ఒక హిందూ అమ్మాయిని వేధించిన ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారనే క్లెయిమ్‌లతో రెండు వీడియో క్లిప్‌ల కొలాజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి క్లిప్‌లో ఒక అమ్మాయి ఒక వ్యక్తి నుండి పారిపోతున్నట్లు కనిపిస్తుంది, రెండో క్లిప్‌లో పోలీసు కస్టడీలో ఆ వ్యక్తి కుంటుతున్నట్లు కనిపిస్తుంది.
ముస్లిం సమాజాన్ని విమర్శిస్తున్న పోస్ట్‌లతో పాటు వచ్చిన క్లెయిమ్‌లో రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే వ్యక్తి హిందూ అమ్మాయిని వేధించినందుకు అరెస్టు చేశారు అని ఆరోపించారు.
"ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసే ఒక భక్తుడు వీధిలో ఒక అమ్మాయిని వేధించాడు" అనే క్యాప్షన్‌తో X లో వీడియోను షేర్ చేశారు. (హిందీ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ముజఫర్‌నగర్ పోలీసులు నిందితుడిని హిందూ సమాజానికి చెందిన రోహిత్‌గా గుర్తించారు.
కీవర్డ్ సెర్చ్ ద్వారా ఫిబ్రవరి 5న ప్రచురింపబడిన Dainik Bhaskar, ఫిబ్రవరి 6న ప్రచురింపబడిన Aaj Tak కథనాలలో వైరల్ అవుతున్న వీడియోలు ఉపోయోగించారని కనుగొన్నాం. ఈ కథనాల ప్రకారం, ఈ సంఘటన ముజఫర్‌నగర్‌లోని న్యూ మండి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో జరిగింది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అయిన రెండు గంటల్లోనే నిందితుడు రోహిత్‌ను అరెస్టు చేశారు.
వీడియో వైరల్ అయిన తర్వాత, న్యూ మండి పోలీసులు వెంటనే చర్య తీసుకుని, ముజఫర్‌నగర్‌లోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని విలాయత్ నగర్‌కు చెందిన సమయ్ సింగ్ కొడుకు రోహిత్‌ను దుష్ప్రవర్తన, వేధింపులకు పాల్పడినందుకు అరెస్టు చేశారని ముజఫర్‌నగర్ పోలీసులు ఒక X పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.
సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని కూడా పోస్ట్‌లో పేర్కొన్నారు. నిందితుడిని రోహిత్‌గా గుర్తించినట్లు ధృవీకరిస్తూ న్యూ మండి CO మాట్లాడుతున్న వీడియో ఈ పోస్టులో చూడవచ్చు.
ఈ కేసు గురించి విచారించడానికి న్యూస్‌మీటర్ న్యూ మండి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించింది. ఈ సంఘటనకు మతపరమైన కోణం లేదని పోలీసు అధికారి చెప్పారు. నిందితుడు కొడుకు సమయ్ సింగ్ రోహిత్ సహా ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరూ హిందూ సమాజానికి చెందినవారు.
ఫిబ్రవరి 5 నాటి ఎఫ్ఐఆర్ కాపీ కూడా దొరికింది. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం, వీడియోలోని మహిళ గత ఏడాది కాలంగా తనను వేధిస్తూ, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు రోహిత్‌పై కేసు నమోదు చేసింది. BNS ప్రకారం, రోహిత్ పై సెక్షన్లు 78, 127(2), 351(2) కింద అభియోగాలు మోపబడ్డాయి.
కాబట్టి, వైరల్ వీడియోలో ఒక ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే క్లెయిమ్ నిజం కాదని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.