Fact Check: మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైలుపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారా? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి...

మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైలుపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

By K Sherly Sharon  Published on  3 Feb 2025 1:10 PM IST
Fact Check: మహాకుంభ్ మేళాకు వెళ్తున్న రైలుపై ముస్లింలు రాళ్లతో దాడి చేశారా? లేదు, ఇక్కడ నిజం తెలుసుకోండి...
Claim: ఝాన్సీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణిస్తున్న ప్రత్యేక మహాకుంభ రైలుపై రాళ్ళూ రువ్వింది ముస్లింలు.
Fact: చాలా సమయం రైలు కోసం వేచి చుసిన ప్రయాణికులు, ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన రైల్ తలుపులు తెరుచుకోకపోవడం వల్ల‌ కోపంతో రైలుపైకి రాళ్లు రువ్వారు. ఇక్కడ మతపరమైన కోణం లేదు.

Hyderabad: మహాకుంభ్ మేళాకు వెళ్తున్న ప్రత్యేక రైలుపై ముస్లింలు రాళ్లు రువ్వారని క్లెయిమ్స్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేస్తున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను రైల్వే స్టేషన్‌లో నిలిచి ఉన్న ఒక రైలుపై కొంతమంది రాళ్లు విసురుతున్న దృశ్యం కనిపిస్తుంది.

ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ క్యాప్షన్‌లో ఈ విధంగా వ్రాశారు, "కుంభమేళాకు వెళ్తున్న రైలుపై ఇస్లామిక్ జిహాదీ పందులు రాళ్లు రువ్వాయి, రైలు కిటికీలు పగిలిపోయాయి… #రైలు #ఉత్తరప్రదేశ్ #మహాకుంభమేళా2025" (కన్నడ నుండి అనువదించబడింది) (ఆర్కైవ్)

ఇదే క్లెయిమ్‌తో వైరల్ అవుతున్న వీడియోలను మీరు ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

Fact Check:

న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని గుర్తించింది. ఈ వీడియోలో జరిగిన సంఘటనలో మతపరమైన కోణం లేదు అని తేలింది.

రైల్వే స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు, ప్రయాణికులు ఎక్కేందుకు ప్ర‌య‌త్నించ‌గా.. రైలు తలుపులు తెరచకపోవడంతో, ఆగ్రహించిన కొంతమంది రాళ్లు విసిరారు. దీనికి మత సంబంధిత కోణం లేదు.

గూగుల్‌లో "ఝాన్సీ-ప్రయాగ్‌రాజ్-స్పెషల్ ట్రైన్" అనే కీవర్డ్‌లతో వెతికితే, NDTV జనవరి 28, 2025న ఈ వైరల్ వీడియో ఉపయోగించి ప్రచురించిన కథనం దొరికింది. "మహాకుంభ్ ప్రత్యేక రైలు తలుపులు లాక్ అయిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు రాళ్లు విసిరారు" అనే శీర్షికతో ఈ కథనం ప్రచురింపబడింది.

ఈ కథనం ప్రకారం, "ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్తున్న ప్రత్యేక రైలు హర్పాల్‌పూర్ స్టేషన్ వద్ద ఆగింది. స్టేషన్‌లో అనేక మంది ప్రయాణికులు వేచి ఉన్నారు. రైలు వచ్చాక తలుపులు లాక్‌లో ఉండటాన్ని గమనించి, కొంతమంది రాళ్లు విసిరారు. ప్రయాణికులు దాదాపు రెండు గంటలపాటు రైలు కోసం ఎదురుచూశారు. అయితే, రైలు ఎక్కేందుకు ప్రయత్నించినప్పుడు తలుపులు తెరుచుకోకపోవడంతో, కోపోద్రిక్తులైన ప్రయాణికులు రాళ్లు విసిరారు" అని పేర్కొంది.

టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇదే వైరల్ వీడియోను ఉపయోగించి, "మధ్యప్రదేశ్‌లో మహాకుంభ్ ప్రత్యేక రైలు దెబ్బతీసింది" అనే శీర్షికతో జనవరి 28, 2025న ఒక కథనాన్ని ప్రచురించింది.

హర్పాల్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పుష్పక్ శర్మ TOIతో మాట్లాడుతూ, "ప్లాట్‌ఫామ్‌లో 7,000-8,000 మంది ఉన్నారు. రైలు ఇప్పటికే పూర్తిగా నిండిపోయి ఉంది. తలుపులు తెరచకపోవడంతో కొంతమంది ప్రయాణికులు రాళ్లు విసరడం ప్రారంభించారు. మేము సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశాం. గుంపును చెదరగొట్టడానికి దాదాపు గంట సమయం పట్టింది. తర్వాత రైలు సురక్షితంగా బయల్దేరింది" అని తెలిపారు.

హర్పాల్‌పూర్ రైల్వే స్టేషన్‌లో మహాకుంభ్ ప్రత్యేక రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో, ప్రయాణికులు రాళ్లు విసిరారని అనేక వార్తా మాధ్యమాలు కథనాలను ప్రచురించాయి. ఈ కథనాలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చదవొచ్చు.

ఈ సమాచారం ఆధారంగా, "ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తున్న ప్రత్యేక మహాకుంభ్ రైలు పై ముస్లింలు రాళ్లు విసిరారు" అనే క్లెయిమ్ తప్పు అని స్పష్టంగా తేలింది. రైలు పూర్తిగా నిండిపోవడంతో, ప్లాట్‌ఫామ్‌లో ఎదురుచూసిన ప్రయాణికులు కోపంతో రాళ్లు విసిరారు. దీనికి మతపరమైన ఎలాంటి కోణం లేదు.

కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.

Claim Review:ఝాన్సీ నుండి ప్రయాగ్‌రాజ్‌కు ప్రయాణిస్తున్న ప్రత్యేక మహాకుంభ రైలుపై రాళ్ళూ రువ్వింది ముస్లింలు.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:చాలా సమయం రైలు కోసం వేచి చుసిన ప్రయాణికులు, ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన రైల్ తలుపులు తెరుచుకోకపోవడం వల్ల‌ కోపంతో రైలుపైకి రాళ్లు రువ్వారు. ఇక్కడ మతపరమైన కోణం లేదు.
Next Story