హైదరాబాద్: ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9, 2024న ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగు చీరలో కనిపిస్తుంటుంది. ఇది రాష్ట్ర వ్యవసాయంకు సంబంధించిన సంకేతాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించిన ఎరుపు చీర, ఆభరణాలతో ఉన్న తెలంగాణ తల్లి రూపానికి భిన్నంగా ఉంటుంది.
ఈ సందర్భంలో ఎక్స్ (పూర్వం ట్విట్టర్)లో షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారింది. ఇందులో హైదరాబాద్ మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫారంపై పరస్పరం పక్కపక్కన ఉంచిన రెండు విభిన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్‌లు చూపించబడ్డాయి. (ఆర్కైవ్)
మొదటి స్టాండ్‌లో తెలంగాణ తల్లిని బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించినట్లు చెప్పబడిన ఎరుపు రంగు చీరలో ఆభరణాలతో చూడవచ్చు. రెండో స్టాండ్‌లో తెలంగాణ తల్లిని ఆకుపచ్చ రంగు చీరలో చూడవచ్చు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రూపొందించబడిన బిగించిన పిడికిళ్ళ బేస్ పై నిలబడినట్లు మనం చూడవచ్చు.
మరో వైరల్ ఫోటోలో తెలంగాణ తల్లి ఎరుపు రంగు చీరలో కాంగ్రెస్ ప్రభుత్వ రూపొందించిన బిగించిన పిడీకిళ్ల పునాదిపై నిలబడినట్లు చూపబడింది.
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ ఫోటోలను పరిశీలించి అవి డిజిటల్ ఎడిటింగ్‌తో మార్పు చేయబడినట్లు గుర్తించింది.
ఇమేజ్ 1:
మొదటి ఫోటోలో రెండు తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్‌లు పక్కపక్కన కనిపిస్తున్నాయి:
స్టాండీ 1: ఎరుపు రంగు చీరలో ఆభరణాలతో ఉన్న తెలంగాణ తల్లి.
స్టాండీ 2: ఆకుపచ్చ రంగు చీరలో ఉన్న తెలంగాణ తల్లి, కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన బిగించిన పిడికిళ్ల పునాదిపై నిలబడిన రూపం.
ఎరుపు రంగు చీరలో తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్ (స్టాండీ 1) అసలు స్టాండ్ కాదు. ఇది ఆకుపచ్చ రంగు చీరలో ఉన్న స్టాండ్ (స్టాండ్ 2) యొక్క డిజిటల్ ఎడిట్ వెర్షన్.
మిర్రర్ ఇమేజ్: జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎరుపు రంగు చీరలో స్టాండ్ ఆకుపచ్చ చీరలో స్టాండ్‌ని హారిజాంటల్‌గా తిప్పి తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఫ్లెక్స్‌లో ఉన్న మడతలు, పైభాగంలో ఉండే తెల్లటి గుర్తులు రెండింటిలోను ఒకే విధంగా ఉన్నాయి, కానీ అవి తిప్పబడినవి.
స్టాండ్ డిజైన్: రెండు స్టాండ్‌ల బేస్ ఒకే డిజైన్‌గా ఉంది. ఇది తెలంగాణ తల్లి చిత్రాన్ని మాత్రమే మార్చి బేస్ భాగాన్ని అలాగే ఉంచినట్లు సూచిస్తుంది.
ఇమేజ్ 2:
రెండవ ఫోటోలో తెలంగాణ తల్లి ఎరుపు రంగు చీరలో బిగించిన పిడీకిళ్ళ పునాదిపై నిలబడి కనిపిస్తుంది.
ఈ స్టాండ్ వాస్తవంగా లేదు. ఇది ఆకుపచ్చ రంగు చీర తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్‌ను ఎరుపు రంగు చీరలో ఉన్న తెలంగాణ తల్లి రూపంతో డిజిటల్ ఎడిట్ చేసి తయారు చేయబడింది. కాబట్టి ఇది ఆకుపచ్చ రంగు చీర స్టాండ్ ఎడిట్ వెర్షన్ అని మరింత స్పష్టమవుతుంది.
అందువల్ల, ఎరుపు రంగు చీరలో ఆభరణాలతో ఉన్న తెలంగాణ తల్లి ప్లెక్సీ స్టాండ్‌ను చూపించే ఇమేజ్‌లు డిజిటల్ ఎడిట్ చేయబడినవి.