Fact Check: పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసిరి కొట్లాడుకునే వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది కాదు తమిళనాడుకు చెందినది
తమిళనాడులో జరిగిన ఓ ఘటనను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు
By Sridhar Published on 12 April 2024 12:20 PM GMTClaim: 07/04/2024, ఈ రోజు అనగా ఆదివారం TDP BJP JSP విజయవాడ ఆత్మీయ సమావేశం లో కుర్చీలతో ముష్టి యుద్ధం చేసుకుంటున్న కార్యకర్తలు.
Fact: తమిళనాడులో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను, విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశానికి చెందినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి కూటమిగా (ఎన్డీయే) ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై ఎన్డీయే కూటమి పోటీ చేయనుంది.
నిజ నిర్ధారణ:
తమిళనాడులో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను, విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశానికి చెందినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని న్యూస్‌మీటర్ కనుగొంది.మొదటగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ‘ఆత్మీయ సమ్మేళనం’ సమావేశాలకు సంబంధించిన వార్తలు, వీడియోల కోసం వెతకగా. ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాల నివేదికలు, వీడియోలు మాకు లభించాయి. అయితే ఈ సమావేశాల్లో విజయవాడలో గానీ, ధర్మవరంలో గానీ పార్టీ కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నట్టు గానీ గొడవకి దిగినట్టు లేదా వేరే ఎలాంటి గొడవలు జరిగినట్లు సమాచారం లేదు.
అయితే న్యూస్ 18 తమిళనాడు లైవ్ స్ట్రీమ్ వీడియోలో, కుర్చీలు విసురుకోవడం గానీ గొడవకి దిగినట్టు వీడియో క్లిప్‌లు లేకపోయినప్పటికీ.. లైవ్ స్ట్రీమ్ వీడియోలో మేము వేదికకు సంబంధించిన విజువల్స్‌ను పోల్చి చూడగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న వీడియో కాంచీపురంలో జరిగిన న్యూస్ 18 “మక్కల్ సభై” మీటింగ్‌లోని వీడియో అని నిర్దారించాము.
మేము మరింత శోధించినప్పుడు, ఈ సంఘటనను నివేదించిన "DMK గూండాలు న్యూస్ 18 తమిళనాడు యొక్క డిబేట్ షో లో బీజేపీకి చెందిన SG సూర్య నుండి విమర్శలను స్వీకరించలేక పోయారు" అనే శీర్షికతో వార్తా కథనాన్ని కనుగొన్నాము.
6 ఏప్రిల్ 2024 న న్యూస్ 18 తమిళనాడు ఛానెల్ కాంచీపురంలోని ఉమా మురుగన్ మహల్‌లో “మక్కల్ సభై” పేరుతో ప్రత్యక్ష కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ ఘటనపై స్పందిస్తూ, డీఎంకే చర్యలను ఖండిస్తూ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌జీ సూర్య X హ్యాండిల్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, “ఆలోచనలతో ఆలోచనలను ఎదుర్కోవడంలో డీఎంకే శక్తి లేనిది. ఈరోజు కాంచీపురంలో న్యూస్ 18 తమిళనాడు "మక్కల్ సభై " కార్యక్రమంలో డీఎంకే దుండగులు బీజేపీ సభ్యుల పై దాడి చేశారు. డిఎంకె ఎమ్మెల్యే మిస్టర్ ఎజిలరసన్ ఎదుట కుర్చీలు విసిరి థర్డ్ క్లాస్ పదాలు వాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు.
கருத்துக்களை கருத்துக்களால் எதிர்கொள்ள திராணியற்ற தி.மு.க. இன்று காஞ்சிபுரத்தில் நடந்த @News18TamilNadu “மக்கள் சபை” நிகழ்ச்சியில் தி.மு.க குண்டர்கள் பா.ஜ.க-வினரை தாக்கி வன்முறை. நாற்காலிகளை வீசி, மூன்றாம் தர சொற்களை பேசி தி.மு.க எம்.எல்.ஏ திரு.எழிலரசன் முன்னிலையில் அநாகரீகம்.
— Dr.SG Suryah (மோடியின் குடும்பம்) (@SuryahSG) April 6, 2024