NewsMeter Network
Hyderabad: భారతదేశ శాంతి, పురోగతికి విఘాతం కలిగించడానికి ముస్లింలు, కమ్యూనిస్టులు కుట్ర పన్నుతున్నారని ఒక వ్యక్తి మీడియాతో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ముస్లింలు, కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ కనిపిస్తున్న వ్యక్తి హైదరాబాద్ నవాబు అని, ఆయన బహుశా ముస్లిం అయ్యి ఉండవచ్చని ఫేస్‌బుక్‌లో 
ఈ పోస్టును షేర్ చేసిన వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను షేర్ చేస్తూ, క్యాప్షన్‌లో ఇలా వ్రాసారు, “ఇది హైదరాబాద్ నవాబ్ చెప్పిన అక్షర సత్యం.”(హిందీ నుండి అనువదించబడింది) (
ఆర్కైవ్)
 
Fact Check
వీడియోలో కనిపిస్తుంది హైదరాబాదీ నవాబు కాదు, ఆచార్య ధర్మేంద్ర.. కాబట్టి ఈ పోస్టులో రాసిన వాదన తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, 2020 ఫిబ్రవరి 16న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన 
వీడియో దొరికింది. పౌరసత్వ సవరణ చట్టానికి, ఒవైసీ సోదరులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (VHP)కు చెందిన ఆచార్య ధర్మేంద్ర మాట్లాడుతున్న వీడియో అని పోస్ట్ క్యాప్షన్ సూచిస్తుంది. వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ వీడియోలో నుండి తీసిన క్లిప్ అని తెలుస్తుంది.
వైరల్ అవుతున్న వీడియోలో Youth Media TV లోగోను కనిపిస్తుంది. ఈ లీడ్‌లను అనుసరించి, కీవర్డ్ సెర్చ్ చేసాము. Youth Media TV యూట్యూబ్ వెరిఫైడ్ ఛానెల్‌లో 2020 జనవరి 2న పోస్ట్ చేయబడిన మూడున్నర నిమిషాల 
వీడియోను కనుగొన్నాము. ఈ వీడియో ప్రారంభంలో వైరల్ క్లిప్‌లు కనిపించాయి.
వీడియోలో ఉన్న వ్యక్తి పేరును Youth Media TV తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రస్తావించనప్పటికీ.. వీడియో థంబ్‌నెయిల్‌లో.. అతన్ని ఉద్దేశించి 'మహారాజ్' అని హిందీలో వ్రాశారు.
ముస్లింలు, కమ్యూనిస్టులతొ పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హైదరాబాద్‌లోని ఒవైసీ సోదరుల గురించి కూడా వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ వీడియోలో కనిపించారు. ఫేస్‌బుక్, యూట్యూబ్ ద్వారా ఈ వీడియో 2020లో తీసినట్లు నిర్ధారించబడింది.
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఆచార్య ధర్మేంద్ర చిత్రాన్ని వైరల్ వీడియోతో పోల్చి అవి ఒకేలా వున్నాయని గుర్తించాం.
 
The Print, 
Aaj Takలో ప్రచురించబడిన  కథనాల ప్రకారం.. ఆచార్య ధర్మేంద్ర సుదీర్ఘ అనారోగ్యంతో 2022 సెప్టెంబర్ 19న మరణించారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.
 ఆచార్య ధర్మేంద్ర విశ్వహిందూ పరిషత్‌లోని కేంద్రీయ మార్గదర్శక్ మండల్‌లో ప్రముఖ సభ్యుగా ఉండేవారు . జనవరి 9, 1942న గుజరాత్‌లోని మాల్వాడలో జన్మించిన ఆయన, 1965లో గో హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి పేరుగాంచారు.
ముస్లింలను విమర్శిస్తూ వీడియోలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ నవాబు కాదు కాబట్టి ఈ పోస్టు ద్వారా చేస్తున్న వాదన తప్పు అని న్యూస్‌మీటర్ కనుగొంది.
(Translated by K Sherly Sharon)