ఇటీవల, రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతూ, పిండుకుంటూ ఉన్న వీడియో ఇంటర్నెట్‌లో ఫుల్ ట్రెండ్ గా మారింది. ఫౌంటెన్ దగ్గర ఆమె బట్టలు ఉతుకుతుండగా పక్కన కొంతమంది సెల్ఫీ దిగడం కూడా ఈ వీడియోలో మనం చూడవచ్చు.
అయితే "నీళ్లు లేక రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుక్కుంటున్న తెలంగాణ మహిళలు. ఏం మార్పు రా అయ్యా ఇది" అనే క్యాప్షన్ తో అనేక మంది సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
మరి కొందరు ఈ వీడియోను షేర్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు.
ఆర్కైవ్ లింక్ ఇక్కడ
నిజ నిర్ధారణ:
రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతున్న వీడియో తెలంగాణకు సంబంధించినది కాదని, ఆంధ్రప్రదేశ్‌కు చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది.'రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుక్కుంటున్న మహిళ' అనే పదాలను ఉపయోగించి గూగుల్ కీవర్డ్ శోధన నిర్వహించినపుడు,ఈ సంఘటనను నివేదించిన వార్తా నివేదిక మరియు
వీడియోను మేము కనుగొన్నాము.
'తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని గణపతి సెంటర్లో పార్కుతో పాటుగా వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. మూడు వారాల క్రితం స్థానిక ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడు చేతులు మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సెల్ఫీ తీసుకునేందుకు ఐ లవ్ నిడదవోలు పేరుతో ఓ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటెన్ దగ్గర ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
ఓ మహిళ ఆ ఫౌంటెన్ దగ్గర బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఓవైపు కొందరు ఆ పౌంటెన్ దగ్గర నిల్చుని ఫోటోలు తీసుకుంటుంటే. మహిళ మాత్రం బకెట్లో తెచ్చుకున్న బట్టల్ని వాష్ చేసుకుంటూ కనిపించింది. ఓ వ్యక్తి బైక్‌పై అటుగా వెళుతూ ఈ విషయాన్ని గమనించి వీడియో తీశాడు.' అంటూ ఓ
నివేదిక పేర్కొంది.
ఇలా ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవ్వగా, ఈ వీడియోను పట్టుకొని కొందరు ఫేస్ బుక్ వినియోగదారులు ఈ ఘటన తెలంగాణలో జరిగిందని, నీళ్లు లేక రోడ్డు పై ఉన్న వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుక్కుంటున్న తెలంగాణ మహిళలు అని తప్పుడు ప్రచారం చేశారు.
మేము X మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుక్కుంటున్న మహిళ యొక్క వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకి చెందినదిగా ధృవీకరించిన పోస్ట్‌లను కనుగొన్నాము.
1,
2.
అందుకే రోడ్డు పై వాటర్ ఫౌంటెన్ వద్ద బట్టలు ఉతుకుతున్న మహిళ యొక్క వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకి చందినదని, ఇది తెలంగాణాలో జరగలేదని మేము నిర్ధారించాము.