Fact Check: బంగ్లాదేశ్ లో రాజకీయ నాయకురాలితో గుంజీలు తీయించిన వీడియోను హిందూ మహిళకు జరిగిన అవమానంగా ప్రచారం.
సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేశారని వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు పోస్టులు పెట్టారు.
By Newsmeter Network Published on 12 Aug 2024 8:33 AM GMTClaim: బంగ్లాదేశ్‌లోని హిందూ అమ్మాయి జ్యోతిక బసు ఛటర్జీని అవమానిస్తూ.. బహిరంగంగా ఆమెతో గుంజీలు తీయించారు
Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్న మహిళ సాగరిక అఖ్తర్. ముస్లిం అమ్మాయి. ఛత్ర లీగ్ నాయకురాలు.
చుట్టూ ఉన్న చాలా మంది ఓ మహిళను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉండగా.. ఓ మహిళ బలవంతంగా గుంజీలు తీస్తూ, ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎన్నో మంచి పనులు చేసిన మహిళ, మతం- కులంతో సంబంధం లేకుండా ప్రజలకు సహాయం చేయడానికి బంగ్లాదేశ్‌లో సంస్థను నడుపుతున్న మానవతావాది హిందూ మహిళ అయిన జ్యోతికా బసు ఛటర్జీని చిత్రహింసలకు గురి చేసి చంపారని పలువురు ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
షేక్ హసీనా ప్రభుత్వం పతనం అయిన తర్వాత, బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్ల సమయంలో జ్యోతికను మతపరమైన నినాదాలు చేస్తూ బట్టలు విప్పించారని. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేశారని వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు పోస్టులు పెట్టారు.
ఒక X వినియోగదారు వీడియోను పంచుకుంటూ.. “ఇందులో ఉన్నది బంగ్లాదేశ్‌కు చెందిన జ్యోతికా బసు ఛటర్జీ, తన సంస్థ ద్వారా హిందువులు, ముస్లింల విద్య, ఆరోగ్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన మహిళ. మతం, కులాలకు అతీతంగా పేద మహిళలకు అన్ని విధాలా సాయం చేసింది. అయితే, అల్లర్లు ప్రారంభమైన వెంటనే, ఛాందసవాద పురుషులు, మహిళలు ప్రతిదీ మర్చిపోయారు. జ్యోతికతో బలవంతంగా గుంజీలు తీయించారు. ఆ తర్వాత ఇరవై మంది వ్యక్తులు ఆమెను బట్టలు విప్పి అత్యాచారం చేశారు. ఆమె సోదరుడు ఈ సంఘటన వీడియోను రికార్డ్ చేశాడు. భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతూ మరియు జ్యోతికకు జరిగిన అన్యాయాన్ని పంచుకున్నాడు. అయితే అతడి ప్రాణం కూడా గాల్లోకి కలిసిపోయింది. అతడిని కూడా సజీవదహనం చేశారు." అంటూ పోస్టు పెట్టారు.
పలు సోషల్ మీడియా ఖాతాలలో ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది.
బంగ్లాదేశ్ జర్నలిస్ట్ మహదీ హసన్ తల్హా ఆమె పేరు సాగరిక అఖ్తర్ అని ధృవీకరించారు. ఆమె హిందూ కాదు ముస్లిం మహిళ అని.. ఈడెన్ మొహిలా కాలేజీలో ఛత్ర లీగ్ నాయకురాలని తెలిపారు.ఛత్ర లీగ్ అనేది షేక్ హసీనా నేతృత్వంలోని బంగ్లాదేశ్ అవామీ లీగ్ పార్టీ విద్యార్థి విభాగం. కోటా వ్యతిరేక సంస్కరణ ఉద్యమం సమయంలో, ఛత్ర లీగ్ నాయకులను హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుదారులుగా భావించి విద్యార్థులు దాడి చేశారు.బంగ్లాదేశ్ ఫ్యాక్ట్ చెకర్.. షోహనూర్ రెహమాన్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేశారు. ఈ వీడియోలో ఉన్న మహిళ సాగరిక అఖ్తర్ అని.. ముస్లిం, ఈడెన్ మొహిలా కాలేజీకి చెందిన ఛత్ర లీగ్ నాయకురాలు అని వివరించాడు. మిగిలిన విద్యార్థులను వ్యతిరేకించినందుకు, రాజకీయ అధికారాన్ని ఉపయోగించి వారిని హింసించినందుకు సాగరిక అఖ్తర్ ను శిక్షించారని ఆయన వివరించారు. ఈ సంఘటన జూలై 17న జరిగింది. (ఆర్కైవ్)
She is Sagarika Akhter, a Muslim and a female Chhatra League leader from Eden Women's College. This video and incident is from July 17.She is not Jyotika Basu, as mentioned in your fabricated story. She was punished for standing against students and torturing them using… https://t.co/s6WJI3ll1x pic.twitter.com/k3ErhAC4hM
— Shohanur Rahman (@Sohan_RSB) August 9, 2024
మహదీ హసన్ తల్హా యొక్క ఫేస్‌బుక్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను కూడా చేర్చారు. అందులో వీడియోలోని మహిళను సాగరిక అఖ్తర్ అంటూ వివరాలు పంచుకున్నారు.
రెహ్మాన్ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా, మేము తల్హా ఫేస్‌బుక్ ఖాతా కోసం శోధించాము. జూలై 17న పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము. బయో ప్రకారం, మహదీ హసన్ తల్హా బంగ్లాదేశ్ జర్నలిస్ట్.
మహదీ హసన్ తల్హా యొక్క ఫేస్‌బుక్ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను కూడా చేర్చారు. అందులో వీడియోలోని మహిళను సాగరిక అఖ్తర్ అంటూ వివరాలు పంచుకున్నారు.రెహ్మాన్ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా, మేము తల్హా ఫేస్‌బుక్ ఖాతా కోసం శోధించాము. జూలై 17న పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాము. బయో ప్రకారం, మహదీ హసన్ తల్హా బంగ్లాదేశ్ జర్నలిస్ట్.ఈడెన్ మొహిలా కాలేజ్ ఛత్ర లీగ్ నాయకురాలు సాగరిక అఖ్తర్ తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమెను విద్యార్థులు ఎలా నిర్బంధించారో పోస్ట్ లో వివరించారు. వారు ఆమె చెవులు పట్టుకుని గుంజీలు చేసేలా చేశారు. తల్హా పోస్ట్‌లో #quotamovement2024, #quotamovement, #edenmohilacollege #Eden అనే హ్యాష్ ట్యాగ్ లను కూడా ఉపయోగించారు.
మరింత ధృవీకరణ కోసం, న్యూస్‌మీటర్ తల్హాను సంప్రదించింది. ఈ వీడియోలో ఉన్న మహిళ సాగరిక అఖ్తర్ అని.. ముస్లిం మహిళ, ఈడెన్ మొహిలా కాలేజ్ ఛత్ర లీగ్ నాయకురాలు అని నిర్ధారించింది. "అవామీ లీగ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జూలై 17న కాలేజీలోని స్టూడెంట్ హాల్‌లో వీడియో రికార్డ్ చేశారు" అని తల్హా పేర్కొన్నారు."సాగరిక మొదటి నుండి కోటా వ్యతిరేక ఉద్యమాన్ని వ్యతిరేకించింది. స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో లబ్ధి పొందుతున్నందున విద్యార్థులు ఆమెపై కోపంగా ఉన్నారు" అని ఆయన అన్నారు. సాగరిక అఖ్తర్ అడ్మిట్ కార్డును కూడా తల్హా పంచుకున్నారు. అడ్మిట్ కార్డ్ ప్రకారం, మహిళ పేరు సాగరిక అఖ్తర్ అని.. ఆమె స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో లబ్ధిదారుగా ఉంది.
అత్యాచారం, హత్య ఆరోపణలపై విచారించగా.. తల్హా అవన్నీ తప్పుడు వార్తలని తెలిపారు. “సంఘటన జరిగిన కళాశాల మహిళా కళాశాల, ఇక్కడ అబ్బాయిలు వెళ్లడం నిషేధం. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బాధిత నేతలను కలిశారు. ఆమె కూడా అక్కడే ఉన్నారు. సాగరిక అఖ్తర్ హసీనాను కలిసిన చిత్రాన్ని కూడా షేర్ చేశారు.
చివరగా.. మేము కీవర్డ్ సెర్చ్ ను కూడా నిర్వహించాము. జూలై 29న ప్రచురించిన మీడియా నివేదికలను కూడా చూశాము. అందులో కోటా సంస్కరణ ఉద్యమం సమయంలో ఛత్ర లీగ్ మహిళా నాయకులను కలిసిన ఫోటోలను కూడా గుర్తించాం. ఏ ప్రముఖ మీడియా కథనాల్లో కూడా అత్యాచారం చేసారంటూ కథనాలు రాలేదు.అందువల్ల, ఈ వీడియో హసీనా ప్రభుత్వ పతనానికి ముందే జరిగిన ఘటన అని తేలింది. హిందూ బాలిక జ్యోతికా బసు ఛటర్జీని హింసించి అత్యాచారం చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.