Fact Check: భారత-పాక్ మ్యాచ్ – పాక్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారా? లేదు, క్లెయిమ్ తప్పు

భారతదేశంతో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఇంటిని తగలబెట్టారని ఫేస్‌బుక్ పోస్ట్ పేర్కొంది.

By -  K Sherly Sharon
Published on : 25 Sept 2025 5:42 PM IST

Fact Check: భారత-పాక్ మ్యాచ్ – పాక్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారా? లేదు, క్లెయిమ్ తప్పు
Claim:ఆసియా కప్ సూపర్ ఫోర్‌లో భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి తర్వాత హారిస్ రవూఫ్ ఇల్లు కాలిపోయింది.
Fact:ఈ క్లెయిమ్ తప్పు. మ్యాచ్ తర్వాత హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Hyderabad: భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. పాకిస్తాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ ఛేదించి, ఏడు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది.

మ్యాచ్ సమయంలో, పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హారిస్ రవూఫ్ రెచ్చగొట్టే విధంగా ‘6-0’ సంకేతం చేసి, ఫైటర్ జెట్‌ను అనుకరిస్తూ చూపించాడు. మే నెలలో ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆరు భారతీయ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్లో ఉన్న క్లెయిమ్‌లను ఈ సంజ్ఞ సూచిస్తుంది.

ఈ నేపథ్యంలో, మ్యాచ్ తర్వాత, పాకిస్తాన్‌లోని హారిస్ రవూఫ్ ఇంటికి క్రికెట్ అభిమానులు నిప్పంటించారని సోషల్ మీడియా వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ఫేస్‌బుక్‌ పోస్టులో ఓ వ్యక్తి ఇలా రాశారు, "నిన్న మాచ్ లో 50 కొట్టాక.. ఉగ్రవాది లా ప్రవర్తించిన వాడి ఇల్లు తగుల బెట్టేసిన పాకీలు.." (ఆర్కైవ్)

ఫేస్‌బుక్ యూజర్ వ్యాఖ్యలలో మూలంగా మరొక ఫేస్‌బుక్ పోస్ట్‌ను పంచుకున్నారు. ఈ పోస్టులో హారిస్ రవూఫ్ ఫోటోతో పాటు, కాలిపోతున్న ఒక ఇంటి ఫోటోని చూడవచ్చు. ఈ ఫోటోపై ఇలా రాశారు “భారత్ చేతిలో ఓటమి తర్వాత పాకిస్తాన్ అభిమానులు పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఇంటి లోపల పెట్రోల్ బాంబులు విసిరారు.”

Fact Check


న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారని చూపించడానికి ఎటువంటి రుజువు లేదు.

కీవర్డ్ శోధనలను ఉపయోగించినా, హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారని పేర్కొంటున్న పాకిస్తాన్ వార్త కథనాలు లేవని కనుగొన్నాం.

హారిస్ రవూఫ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ హ్యాండిల్స్‌ను కూడా తనిఖీ చేసాము, సూపర్ ఫోర్ మ్యాచ్ ఓటమి తర్వాత అతని ఇల్లు తగలబడిపోయినట్లు ఎటువంటి పోస్ట్‌లు కనుగొనబడలేదు.

కీవర్డ్ శోధనలు ద్వారా ఆగస్టు 13న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన వీడియో దొరికింది. వీడియోలోని శీర్షిక, టెక్స్ట్ ఇస్లామాబాద్‌లోని ఫైసల్ టౌన్‌లోని హారిస్ రవుఫ్‌ ఇంటిని చూపిస్తుందని పేర్కొన్నాయి. ఆ ఇంటిపై 'రవుఫ్‌' అని రాసి ఉంది.

జూన్ 1న మరొక ఫేస్‌బుక్ పోస్ట్‌లో అదే ఇంటి వీడియోను షేర్ చేసి 'హరిస్ రవుఫ్‌ న్యూ హౌస్ ఫైసల్ టౌన్' అనే టెక్స్ట్‌తో షేర్ చేశారు.

Faisal town block b Pakistani cricketer wonderful house #realestate #globlepropertieshub #foryou #faisaltown Global Properties Hub Haris Rauf Official #needfollowers #viral_video #10kviews #foryou #foryoupage #10millionviews

Posted by Global Properties Hub on Sunday, June 1, 2025

ఫైసల్ టౌన్ అనేది ఇస్లామాబాద్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఫైసల్ టౌన్ గ్రూప్ చేపట్టిన హౌసింగ్ ప్రాజెక్ట్. ఫైసల్ టౌన్ గ్రూప్‌లో కన్సల్టెంట్ ఉబైద్ నాసిర్ న్యూస్‌మీటర్‌తో మాట్లాడుతూ, “ఇక్కడ ఫైసల్ టౌన్‌లో అలాంటి సంఘటన జరగలేదు. హారిస్ రవుఫ్‌ ఇల్లు కాలిపోలేదు, ఎవరూ దాని మీదకు పెట్రోల్ బాంబులు వేయడానికి ప్రయత్నించలేదు” అన్నారు.

సెప్టెంబర్ 24 హరిస్ రవూఫ్ ఇల్లు, దాని పరిసరాలను వీడియో చిత్రీకరించి ఉబైద్ నాసిర్ షేర్ చేశారు, అందులో అగ్నిప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదు అని కనిపిస్తుంది.

లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ ఆయేషా సాఘీర్, హరిస్ రవూఫ్ ఇల్లు కాలిపోయిందనే క్లెయిమ్ నిజం కాదని, అలాంటి సంఘటన జరగలేదని ధృవీకరించారు.

కాబట్టి, భారతదేశంతో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో ఓటమి తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ హరిస్ రవూఫ్ ఇంటిని అభిమానులు తగలబెట్టలేదని స్పష్టమవుతోంది. వైరల్ క్లెయిమ్‌లో నిజం లేదని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.

Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:Social Media
Claim Fact Check:False
Fact:ఈ క్లెయిమ్ తప్పు. మ్యాచ్ తర్వాత హారిస్ రవూఫ్ ఇంటికి నిప్పంటించారని చూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
Next Story