హైదరాబాద్: సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాత్రి సమయంలో ఆకస్మికంగా ఆకాశం నారింజ రంగులో వెలుగుతుంటుంది. ఆ వెలుగులో సూర్యుడిని పోలిన బింబం కనిపిస్తుంది. ఇది చూసే ప్రజలు సంబరంగా చప్పట్లు కొడుతూ వీడియోలు తీశారు.
ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను “శ్రీ సూర్య నారాయణ దర్శనం అందరు తిలకించండి” అంటూ పోస్ట్ చేశారు. (Arhcive)
ఇలాంటి పోస్టులు ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. (Archive Link1, Archive Link2)
ఫ్యాక్ట్ చెక్:
న్యూస్ మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. ఈ వీడియో సూర్యోదయాన్ని చూపించేది కాదు. ఇది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ISRO ప్రయోగించిన GSLV MK3 రాకెట్ లాంచ్.
వీడియో కీ ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇండియా టైమ్స్ ఏప్రిల్ 29, 2023న ప్రచురించిన ఒక కథనాన్ని గుర్తించాం. ఆ కథనం ప్రకారం, ఈ వీడియో ISRO రాకెట్ ప్రయోగం సమయంలో రాత్రి 12:07 గంటలకు తీసినదని వివరించారు. వైరల్ అవుతున్న వీడియో వీక్షకుల గ్యాలరీ నుండి తీసుకోబడింది. రాకెట్ ప్రయోగం యొక్క వైరల్ వీడియో యొక్క నిడివి ఎక్కువ ఉన్న వీడియో కూడా గుర్తించాం.
కీవర్డ్ సెర్చ్ ద్వారా ఇండియా టుడే ఆగస్టు 1, 2023న ప్రచురించిన ఫ్యాక్ట్ చెక్ కథనాన్ని కూడా కనుగొన్నాం.ఈ కథనం ప్రకారం, సిద్ధార్థ్ ఎంపీ, అనే చెన్నై WION రిపోర్టర్, వైరల్ వీడియో వ్యూయర్ గ్యాలరీ నుండి తీసినదిగా ధ్రువీకరించారు.అలానే అనేక మీడియా సంస్థలు ధ హిందూ, ఇండియా టుడే, ఈ కథనాన్ని ప్రచురించాయి.
కాబట్టి, ఈ వీడియో సూర్యోదయం సంబంధించిదన్న వాదన తప్పు.