Fact Check: మహా కుంభమేళాలో జాన్ సినా, బ్రాక్ లెస్నర్? ఫోటోల వెనుక అసలు నిజం ఇక్కడ తెలుసుకోండి..
అమెరికా రెజ్లర్లు జాన్ సినా, బ్రాక్ లెస్నర్ మహా కుంభమేళాలో పాల్గొన్నారనే క్లెయిమ్‌లతో వైరల్ అవుతున్న పలు చిత్రాలు.
By K Sherly Sharon Published on 10 Feb 2025 2:36 PM IST
Claim: మహా కుంభమేళాలో జాన్‌సినా, బ్రాక్ లెస్నర్‌ను చూపిస్తున్న ఫోటోలు.
Fact: ఈ క్లెయిమ్ తప్పు. వైరల్ అవుతున్న ఫోటోలు ఏఐ ద్వారా రూపొందించబడినవి.
Hyderabad: మహా కుమ్భ మేళా ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తోంది. రాజకీయ వేతలు, సినీ నటులు, ప్రఖ్యాతి గాంచిన పలువురు కుంభమేళాకు తరలి వస్తున్నారు. వారి ఫోటోలను, వీడియోను చూస్తున్నాం. ఇటీవల అమెరికన్ ప్రొఫెషనల్ రెజ్లర్లు జాన్ సినా, బ్రాక్ లెస్నర్ మహా కుంభమేళాలో పాల్గొన్నారనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రాల్లో జాన్ సినా, బ్రాక్ లెస్నర్ "జై శ్రీ రామ్" జెండాలను పట్టుకుని ఉన్నట్లు కనిపిస్తున్నారు.
ఈ చిత్రాలను ఫేస్‌బుక్‌లో ఈ క్యాప్షన్‌తో షేర్ చేశారు:
"ప్రయాగ్‌రాజ్‌లో 2025 మహా కుంభమేళాలో జాన్ సెనా మరియు బ్రాక్ లెస్నర్" (ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడ్డాయి.
2025లో జరిగిన మహా కుంభమేళాను జాన్ సినా, బ్రాక్ లెస్నర్ సందర్శించినట్లు విశ్వసనీయ కథనాలు లేవని కీవర్డ్ శోధనలను ఉపయోగించి కనుగొన్నాం. రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ చిత్రాలకు సరిపోలికలు ఏవీ లభించలేదు.
ఈ చిత్రాలను పరిశీలించి చూసినప్పుడు, వాటిలో కొన్ని అసమానతలను గమనించాం. ఫోటోలను ఎడిట్ చేసి తయారు చేశారేమో అని తెలుసుకోవడానికి కొన్ని ఏఐ గుర్తించే టూల్స్ ఉపయోగించాం.
చిత్రం 1:
జాన్ సినా, బ్రాక్ లెస్నర్‌లను "ప్రయాగ్‌రాజ్" అని రాసిన పసుపు జెండాతో చూడవచ్చు. ఈ జెండాపై ఉన్న మిగితా అక్షరాలు అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని దగ్గరగా పరిశీలిస్తే ముఖ కవళికలలో అసమానతలు కనిపిస్తాయి.
ఈ చిత్రాన్ని Decopy.ai ఏఐ డిటెక్షన్ టూల్ నకిలీ అని అంచనా వేసింది. Hive Moderation ఈ చిత్రాన్ని పరిశీలించి, 99.9 శాతం ఏఐ - జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది అని గుర్తించింది.
చిత్రం 2:
జాన్ సిన, బ్రాక్ లేస్నేర్ కనిపిస్తున్న ఈ చిత్రంలో లైటింగ్, ముఖ కవళికలలో అసమానతలను మనం గమనించవచ్చు. ఈ చిత్రాన్ని Sight Engine, Hive Moderation రెండూ ఏఐతో తయారు చేయబడినట్లు 99 కంటే ఎక్కువ శాతం అవకాశం ఉంది అని నిర్ధారించాయి.
చిత్రం 3:
జాన్ సిన, బ్రాక్ లేస్నేర్ 'జై శ్రీ రామ్' అనే పటాన్ని పట్టుకున్నట్లు ఈ చిత్రం చూపిస్తోంది. ఈ జెండా చిత్రంలో కూడా, "జై శ్రీ రామ్" అనే స్పెల్లింగ్ తప్పు. ఇంకా, ఈ రకమైన మతపరమైన జెండాలు సాధారణంగా హిందూ దేవుళ్లను లేదా ఓం చిహ్నాన్ని కలిగి ఉంటాయి. అయితే, ఈ జెండా అసాధారణమైన, మామూలుగా ఉండే చిత్రాలకు భిన్నంగా ఉన్న చిత్రాన్ని కలిగి ఉంది, కాబట్టి ఈ ఫోటో నిజమైనది కాదని తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని Sight Engine ఏఐ డిటెక్షన్ టూల్ ఏఐతో రోపొందిచబడి ఉండే అవకాశం 83 శాతం ఉంది అని నిర్ధారించింది . ఈ చిత్రంలో Hive Moderation 99.9 శాతం AI-జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది అని గుర్తించింది.
చిత్రం 4:
బ్రాక్ లేస్నేర్ మాత్రమే కనిపిస్తున్న ఈ చిత్రంలో "జై శ్రీ" అనే పతాకాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తుంది. జెండాపై ఉన్న వచనంలో స్పెల్లింగ్ లోపాలు ఉన్నాయి, ఇది AI-ఉత్పత్తి చేసిన చిత్రాలకు సాధారణ సంకేతం. తప్పుగా వ్రాయబడిన పదాలు వల్ల AI ను ఉపయోగించి రూపొందించబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రంలో Hive Moderation 99.9 శాతం AI-జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ కంటెంట్ ఉండే అవకాశం ఉంది అని గుర్తించింది Sight Engine కూడా ఈ చిత్రాన్ని ఏఐ ద్వారా రూపొందించినట్లు నిర్ధారించింది.
కాబట్టి న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది