Fact Check: కుంభమేళాలో సిబ్బందిపై చెప్పులు విసిరిన భక్తులు? లేదు, నిజం ఇక్కడ తెలుసుకోండి...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో భక్తులు సైనికులపై ప్రజలు చెప్పులు విసిరారనే క్లెయిమ్‌లతో సోషల్ మీడియాలో ఓ వీడియో అవుతోంది.
By K Sherly Sharon Published on 14 Feb 2025 5:36 PM IST
Claim: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో జనసమూహాన్ని నియంత్రించడానికి ప్రయత్నించిన సైనికులపై ప్రజలు చెప్పులు విసిరినట్లు వీడియో చూపిస్తుంది.
Hyderabad: పారామిలిటరీ యూనిఫాంలో ఉన్న సైనికులు భారీ జనసమూహాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తుండగా… ప్రజలు వారిపై చెప్పులు విసురుతున్నట్టు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ సంఘటన జరిగిందన్న క్లెయిమ్‌లతో వీడియో షేర్ చేయబడుతోంది.
ఈ వీడియోకు మతపరమైన కోణాన్నిజోడిస్తూ Xలో షేర్ చేశారు, “కుంభమేళాలో, జాతీయవాదులు, సనాతనవాదులు సైనిక సిబ్బందిపై చెప్పులు విసిరారు! వారు ముస్లింలు అయి ఉంటే, ఈ రోజు అన్ని ప్రభుత్వ మీడియా ఛానెళ్లలో ఇదే వార్త అయ్యేది, కానీ బహుశా ఇవన్నీ ఈ మతానికి చెందిన వారికి అనుమతించబడి ఉండవచ్చు.” (హిందీ నుండి అనువదించబడింది)(ఆర్కైవ్)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొంది. ఈ వీడియోలో కనిపిస్తున్నది 2024 నవంబర్ 17న పాట్నాలో జరిగిన 'పుష్ప 2' సినిమా ట్రైలర్ లాంచ్‌లో జరిగిన ఘటన.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా 2025 జనవరి 3న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడిన వీడియో దొరికింది. ఆకుపచ్చ-గోధుమ రంగు పారామిలిటరీ యూనిఫాం, టోపీలో ఉన్న అదే వ్యక్తి, మెటల్ బారికేడ్ పైన ఎక్కడం, జనసమూహాన్ని గమనించి అతని ఎడమ వైపుకు, కెమెరా వెలుపల వెళ్లడం వంటి సారూప్యతలు ఉన్నందున ఇది అదే వీడియో అనే నిర్ధారించాం.
యూట్యూబ్ వీడియోలో మెటల్ బారికేడ్‌కు కట్టబడిన జెండా, దానిపైన తలక్రిందులుగా ఉన్న పసుపు చేతి ముద్రతో ఎర్రటి అక్షరాలు కూడా చూడవచ్చు. వైరల్ క్లిప్‌లో కూడా యూట్యూబ్ వీడియోలో కనిపిస్తున్న జెండా కనిపిస్తుంది, ఈ రెండు జెండాల పోలికలను కింద చూడవచ్చు.
ఈ జెండాలు 2024 డిసెంబర్ 5న విడుదల అవ్వబోతోంది అంటూ పుష్ప 2 సినిమా ప్రమోషన్లు కోసం ఉపయోగించిన జెండాలతో సరిపోలుతున్నాయని కనుగొన్నాం.
నవంబర్ 17న నాటి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో జెండా, దాని డిజైన్‌ను స్పష్టంగా చూడవచ్చు. ఆ పోస్ట్‌లో సినిమా ట్రైలర్ లాంచ్ వేదిక బీహార్‌లోని పాట్నాలో గాంధీ మైదాన్ అని పేర్కొన్నారు.
నవంబర్ 17న మరొక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసిన వీడియోను కూడా కనుగొన్నాం. బీహార్ పాట్నాలోని గాంధీ మైదానంలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ వీడియోను ఆ పోస్ట్‌లో చూపిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ లీడ్ ఉపయోగించి కీవర్డ్ శోధనల ద్వారా 2024 నవంబర్ 17న Hindustan Times అధికారిక X హ్యాండిల్ పోస్ట్ చేసిన వీడియోను కనుగొన్నాం. ఈ వీడియోలో కూడా అదే జెండాలు కనిపిస్తున్నాయి. సైనికులు కూడా జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. ‘పుష్ప 2: ది రూల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా అల్లు అర్జున్, రష్మిక మందన్నలను చూసేందుకు పాట్నాలోని గాంధీ మైదానంలో భారీగా జనం తరలి వచ్చారని పోస్ట్ పేర్కొంది.
#WATCH | A massive crowd gathers at Gandhi Maidan in #Patna to catch a glimpse of #AlluArjun and #RashmikaMandanna at the trailer launch event of 'Pushpa 2: The Rule'(📽️: ANI) pic.twitter.com/jzACifR6OI
— Hindustan Times (@htTweets) November 17, 2024
Brut India 2024 నవంబర్ 18న ప్రచురించిన వీడియో కథనం “పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో జనం గందరగోళానికి గురైనప్పుడు…” పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. వైరల్ వీడియోలోని విజువల్స్ మాదిరిగానే జనసమూహాన్ని నియంత్రించడానికి సైనికులు బారికేడ్లు ఎక్కుతున్నట్లు కూడా ఈ వీడియో కథనంలో కనిపించింది.
The Hindu, Times of India 2024 నవంబర్ 18న ప్రచురించిన కథనాల ప్రకారం, పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నటులు అల్లు అర్జున్, రష్మిక మందన్నలను చూసేందుకు భారీ సంఖ్యలో జనం వచ్చారు. ఈ కథనాలతో బారికేడ్లపై ఎక్కి సైనికులు జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తున్న చిత్రాలను ఉపయోగించారు. జనం బారికేడ్లను దాటుకొని నటుల దగ్గరికి రాకుండా నియంత్రించినప్పుడు జనం వారిపై బూట్లు, చెప్పులు విసిరారని ఈ కథనాలు పేర్కొన్నాయి.
ఈ వీడియోలో కనిపిస్తున్న ఘటన కుంభమేళాలో జరగలేదు. 2024 నవంబర్ 17న బీహార్‌లోని పాట్నాలో నిర్వహించిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో జరిగిందని తేలింది. కాబట్టి, ఈ క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.