హైదరాబాద్: జనవరి 15 నాటికి, జనవరి 7న ప్రారంభమైన రెండు పెద్ద కారుచిచ్చులు లాస్ ఏంజెల్స్ కౌంటీలో ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఇవి ఇప్పటివరకు కనీసం రెండు డజన్ల ప్రాణాలను బలి తీసుకుని, వాషింగ్టన్, డీసీ పరిమాణంలో ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. ఈ కారుచిచ్చుల వల్ల 12,000 కట్టడాలు దెబ్బతిన్నాయి లేదా పూర్తిగా నాశనం అయ్యాయి.
ఈ సమయంలో, 4 నిమిషాల 12 సెకన్ల నిడివి కలిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా పంచబడుతోంది. ఈ వీడియోలో పర్వతాలు మంటల్లో కాలి పోతుండటం, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి శ్రమించటం, నగరం మంటల్లో కూరుకుపోవడం వంటి భయానక దృశ్యాలు కనిపిస్తాయి. ఇది లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న కారుచిచ్చు రియల్ ఫుటేజ్ అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ వీడియోను “కాలిఫోర్నియా అడవి మంటలు 2025 విమానం • లాస్ ఏంజిల్స్ ఇప్పుడే నవీకరించండి • కాలిఫోర్నియా వార్తలు.(sic)” (ఆంగ్లం నుండి అనువదించబడింది) అని క్యాప్షన్‌తో షేర్ చేశాడు. (ఆర్కైవ్)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ వీడియోలోని దావా తప్పు అని నిర్ధారించింది. ఈ వీడియోలోని చాలా క్లిప్‌లు AI తయారు చేసినవి. కొన్ని క్లిప్‌లు నిజమైనవి అయినప్పటికీ, ఇవి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న కారుచిచ్చుకు సంబంధం లేనివి.
వీడియోను పరిశీలించడానికి, న్యూస్‌మీటర్ వీడియోను వివిధ ఫ్రేమ్స్‌గా విభజించి, AI గుర్తించే టూల్స్ ద్వారా విశ్లేషించింది. వీడియో నుంచి తీసిన కీలక ఫ్రేమ్‌లను WasItAI, Sightengine అనే రెండు AI డిటెక్షన్ టూల్స్ ఉపయోగించి విశ్లేషించాం. వాటి ఫలితాలను కింద చూడవచ్చు.
ఐదు వీడియో క్లిప్‌లను Hive Moderation అనే మరో AI డిటెక్షన్ టూల్ ద్వారా విశ్లేషించగా, ఇవి అధిక శాతం (99.1%, 98.6%, 99.7%, 99.4%, 99.9%) AI తయారైన క్లిప్‌లుగా తేలాయి.
ఈ వీడియోలో కొన్ని క్లిప్‌లు నిజమైనవి అయినప్పటికీ, ఇవి 2025 లాస్ ఏంజిలెస్ కారుచిచ్చుకు సంబంధం లేని సంఘటనల నుండి తీసుకున్నవి.
పశువులు దట్టమైన మంటల నుంచి పారిపోతున్న క్లిప్ 2020 అక్టోబర్ 5న బ్రెజిల్‌లో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయబడింది.
అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే దృశ్యం 2019 మార్చి 31న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది.
హెలికాప్టర్ కారుచిచ్చును ఆర్పుతున్న దృశ్యం 2021 ఆగస్టు 2 నుండి ఇంటర్నెట్‌లో ఉంది.
కార్లు మంటల్లో కూరుకుపోయిన దృశ్యం 2024 జూన్ 3న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఇది లాస్ ఏంజిలెస్‌కు చెందినదే అయినప్పటికీ, 2025 కారుచిచ్చుకు సంబంధించినది కాదు.
న్యూస్‌మీటర్ ఈ క్లిప్‌లను వారి అసలు వీడియోలతో పోల్చి, తేదీలతో సహా ఈ విషయాలు స్పష్టం చేసింది.
కాబట్టి, ప్రస్తుతం లాస్ ఏంజిలెస్‌లో జరుగుతున్న కారుచిచ్చును చూపిస్తున్నట్లు చెప్పబడుతున్న ఈ వీడియోలో కొన్ని క్లిప్‌లు AI రూపొందించినవిగా, మరికొన్ని అసంబంధిత సంఘటనలవి అని స్పష్టమైంది.