Hyderabad: ఓ వ్యక్తి ఓ ఇంట్లో నుంచి ముగ్గురు మహిళలను రక్షించినట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో లవ్ జిహాద్ కేసు అని, ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయిలను కిడ్నాప్ చేశారనే క్లెయిమ్‌లతో వీడియో షేర్ అవుతోంది.
ఈ వీడియోను ఫేస్‌బుక్ పోస్ట్‌లో షేర్ చేస్తూ ఇలా రాసారు, "లవ్ జిహాద్..... తో అమాయక హిందూ ఆడపిల్లలను లోబరుచుకుని కిడ్నాప్ చేస్తున్నారు జాగ్రత్త. చంపేసి శరీరం అవయాలు అమ్ముకొని 70 నుంచి 90 లక్షలు సంపాదించుతున్నారు జాగ్రత్త." (ఆర్కైవ్)
ఇలాంటి క్లెయిమ్స్ ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1) (ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్స్ తప్పు అని కనుగొంది. ఈ వీడియో ఒక కల్పిత స్కిట్.
7:13 నిమిషాల నిడివి గల వైరల్ వీడియో ప్రారంభంలో, 'ఈ వీడియోలోని కంటెంట్ వినోద ప్రయోజనాల కోసం మాత్రమే పరిగణించబడాలి' అనే ఒక డిస్క్లైమర్ కనిపిస్తుంది. ఈ వీడియో స్క్రిప్ట్‌తో రూపొందించబడిన కల్పిత స్కిట్ అని, నిజమైన సంఘటనను చూపడం లేదని ఇది స్పష్టం చేస్తుంది.
వైరల్ వీడియో కీ ఫ్రేమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి, ఫిబ్రవరి 12, 2023న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము. ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ Naveen Jungra ద్వారా అప్‌లోడ్ చేయబడింది. వీడియో టైటిల్‌లో “అమ్మాయిలను ఎలా కిడ్నాప్ చేస్తున్నారో, తర్వాత ఏం చేస్తారో చూడండి || నవీన్ జంగ్రా కొత్త వీడియో," అని రాసారు.
వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వేరే వీడియోల్లో కూడా కనిపిస్తారు. దీని ద్వారా వీళ్ళు నటులు అని అర్థం అవుతుంది. వైరల్ వీడియో నటులను, యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిని వేరే వీడియోల్లో ఉన్న నటులను పోలికలు చూపిస్తున్న చిత్రం క్రింద చూడవచ్చు.
వీడియో స్క్రిప్ట్ చేయబడినందున క్లెయిమ్ తప్పు అని న్యూస్‌మీటర్ నిర్ధారించింది.