నిజమెంత: బ్రిక్స్ సదస్సులో కొత్త కరెన్సీని సభ్య దేశాలు ప్రవేశపెట్టలేదు

వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ కాదు. నోటు బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకాత్మకంగా జారీ చేశారు

By Newsmeter Network  Published on  29 Oct 2024 1:24 PM IST
నిజమెంత: బ్రిక్స్ సదస్సులో కొత్త కరెన్సీని సభ్య దేశాలు ప్రవేశపెట్టలేదు
Claim: వైరల్ చిత్రం BRICS దేశాలు ఆమోదించిన కొత్త అధికారిక కరెన్సీని చూపుతుంది.
Fact: వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ కాదు. నోటు బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకాత్మకంగా జారీ చేశారు. ఇది అసలు కరెన్సీ కాదు.

అక్టోబర్‌ 23న రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అక్టోబరు 22 నుండి 24 వరకు జరిగిన ఈ సమ్మిట్ లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడం, US డాలర్‌కు ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకోవడంపై కీలక చర్చలు జరిగాయి. ఈ సదస్సును పలు దేశాలు ఆసక్తికరంగా గమనించాయి.

ఈ చర్చల మధ్య, బ్రిక్స్ దేశాలకు కొత్తగా, ఏకీకృత కరెన్సీని తీసుకొచ్చినట్లు పేర్కొంటూ ఒక ఫోటో వైరల్‌గా మారింది. "ఒకే #BRICS కరెన్సీకి సంబంధించిన కొత్త నోటు" అనే శీర్షికతో ఒక X వినియోగదారు చిత్రాన్ని షేర్ చేశారు. (Archive)


వైరల్ చిత్రంలోని నోటు 100 యూనిట్ ముఖ విలువ కలిగిన కరెన్సీ నోటు. ఆ నోటుపై బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల జెండాలు, అధికారిక భాషలు ఉన్నాయి. ప్రతి దేశంలోని సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి. వెనుక వైపు, అల్జీరియా, అర్జెంటీనా, బహ్రెయిన్, బెలారస్, వెనిజులా, ఈజిప్ట్, జింబాబ్వే, ఇండోనేషియా, ఇరాన్, కజకిస్థాన్, మెక్సికో, నైజీరియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల జెండాలు ఉన్నాయి.
ఇదే వాదనతో పలు సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పోస్టు చేశారు. (Archive)
ఫ్యాక్ట్ చెకింగ్
న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. ఈ చిత్రం ఎటువంటి ద్రవ్య విలువ లేని సింబాలిక్ BRICS కరెన్సీని చూపిస్తుంది.
కరెన్సీ నోటును రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, సెప్టెంబర్ 6, 2023న అప్లోడ్ చేసిన X పోస్ట్‌ ను మేము చూశాం. రష్యన్ రాయబారి BRICS కరెన్సీని ఆవిష్కరించారని, ఇది వాడుకలోకి వచ్చినది కాదని మేము ధృవీకరించాం. దక్షిణాఫ్రికాలో BRICS+లో UAE ప్రవేశాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకలో, రష్యా రాయబారి UAE రాయబారికి సింబాలిక్ BRICS కరెన్సీని బహుమతిగా ఇచ్చారని ట్వీట్ ద్వారా తెలుసుకున్నాం.
సింబాలిక్ కరెన్సీని ఇచ్చి పుచ్చుకోవడం కొత్తది కాదని ఇది సూచించింది.
మేము అక్టోబర్ 24, 2024 నాటి ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదికను కూడా కనుగొన్నాము. ‘BRICS Unveils Symbolic Banknote, Pushes for Local Currency Trade Amid Dollar Debate.’ అంటూ పోస్టు పెట్టారు.


కజాన్ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అదే సింబాలిక్ నోట్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను ఈ నివేదికలో చూడొచ్చు. ఆ నివేదికలో “రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో, ప్రపంచ ఫైనాన్స్‌ను పునర్నిర్మించడంపై చర్చలు నిర్వహించడమే కాకుండా సింబాలిక్ బ్రిక్స్ బ్యాంక్ నోట్‌ను ఆవిష్కరించారు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా జెండాలను కలిగి ఉన్న బ్యాంక్ నోటును మనం చూడొచ్చు. సరిహద్దు లావాదేవీలలో US డాలర్‌కు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి ఈ దేశాల సమిష్టి ఆశయాలను సూచిస్తుంది." అని ఉంది.
ఆర్థిక స్వయంప్రతిపత్తిని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాలు యుఎస్ డాలర్‌కు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నాయని పుతిన్‌ చెప్పినట్లుగా నివేదిక పేర్కొంది. బ్రిక్స్ కూటమి డాలర్‌ను పూర్తిగా తిరస్కరించడం లేదని, దానిపై ఎక్కువ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మేము అక్టోబర్ 23, 2024న BRICS న్యూస్ ద్వారా X పోస్ట్‌ని కనుగొన్నాము, BRICS సదస్సులో పుతిన్‌ మాక్-అప్ నోట్‌ని పట్టుకుని ఉన్నట్లు గుర్తించాం.

అది కేవలం సింబాలిక్ నోటు మాత్రమేనని, నిజమైనది కాదంటూ టైమ్స్ నౌ, ది ఎకనామిక్ టైమ్స్ వంటి అనేక మీడియా నివేదికలు ధృవీకరించాయి. ఈ నోటు కేవలం బ్రిక్స్ ఆర్థిక విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తుందని, వాస్తవ కరెన్సీ కాదని ధృవీకరించాం.


కాబట్టి, బ్రిక్స్ కూటమి కరెన్సీని ప్రవేశపెట్టిందనే వాదన సరికాదు. సర్క్యులేట్ అవుతున్న ఫోటో బ్రిక్స్ సమ్మిట్‌లో తీసుకొచ్చిన సింబాలిక్ నోట్. ఇది US డాలర్‌కు ఆర్థిక ప్రత్యామ్నాయాలను అన్వేషించడంలో బ్రిక్స్ కూటమి ఆసక్తిని చూపుతోందని స్పష్టం చేస్తోంది.
Claim Review:వైరల్ చిత్రం BRICS దేశాలు ఆమోదించిన కొత్త అధికారిక కరెన్సీని చూపుతుంది.
Claimed By:Social Media Users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X Users
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న ఫోటో ఒరిజినల్ కాదు. నోటు బ్రిక్స్ దేశాల ఐక్యతకు ప్రతీకాత్మకంగా జారీ చేశారు. ఇది అసలు కరెన్సీ కాదు.
Next Story