Hyderabad: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సెప్టెంబర్ 2న సస్పెండ్ చేశారు.
“పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది,” అని పార్టీ Xలో పేర్కొంది, “పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె. కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.”
ఈ సందర్భంలో, కాలిపోతున్న భవనం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కవిత సస్పెన్షన్ తర్వాత బీఆర్ఎస్ భవన్ కాలిపోతోందని క్లెయిమ్‌లతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
X లో వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశారు, “కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంబరంలో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పంటించారు”. (ఆర్కైవ్)
ఇవే క్లెయిమ్స్ చేస్తున్న పోస్ట్‌లను ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. (ఆర్కైవ్ 1, ఆర్కైవ్ 2)
Fact Check
న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్ తప్పు అని కనుగొంది.
బీఆర్ఎస్ భవన్‌లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి కీవర్డ్ శోధనలను ఉపయోగించి వెతికినా ఎటువంటి విశ్వసనీయ వార్తా నివేదికలు దొరకలేదు. వైరల్ వీడియో కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా మార్చి 20, 2021న యూట్యూబ్‌లో పోస్ట్ చేయబడిన వీడియో కనుగొన్నాం.
సియాసత్ డైలీ ‘సెలబ్రేషన్ సమయంలో తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ వీడియో 00:53 నిమిషాల మార్క్ వద్ద వైరల్ వీడియోను చూడవచ్చు. యూట్యూబ్ వీడియో, వైరల్ వీడియో నుండి స్క్రీన్‌షాట్‌ల పోలికలు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు.
ఇదే వీడియో మార్చి 20, 2021న YOYO TV ఛానెల్‌లో “TRS భవన్‌లో ప్రమాదం | TRS భవన్ విజువల్స్ | తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు 2021” అనే శీర్షికతో YouTubeలో పోస్ట్ చేయబడింది.
అదే రోజున టైమ్స్ ఆఫ్ ఇండియా వీడియో నుండి స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ ఒక నివేదికను ప్రచురించింది. “తెలంగాణ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం” అని శీర్షికలో ఉంది.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి ఎన్నికల్లో గెలిచిన సురభి వాణి దేవి విజయాన్ని జరుపుకోవడానికి పార్టీ క్యాడర్ పటాకులు పేల్చడంతో తెలంగాణ భవన్‌లో మంటలు చెలరేగాయని నివేదిక పేర్కొంది.
"అగ్నిమాపక శాఖ అధికారుల ప్రకారం, భవనం ప్రధాన ద్వారం ముందు ఉన్న పోర్టికోపై పెంచుతున్న మొక్కలపై క్రాకర్ల నుండి నిప్పురవ్వలు పడిన తర్వాత మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు" అని నివేదిక పేర్కొంది.
ఎమ్మెల్సీ కె. కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత బిఆర్ఎస్ భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదాన్ని వైరల్ వీడియో చూపించలేదు. ఇది 2021 నాటి పాత వీడియో.
కాబట్టి, న్యూస్‌మీటర్ వైరల్ క్లెయిమ్స్ తప్పు అని నిర్ధారించింది.