ఫ్యాక్ట్ చెక్: ట్రంప్ గెలిచిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు “మోదీ, మోదీ” అంటూ నినాదాలు చేశారా?

ఒక వినియోగదారు నిడివి ఎక్కువ ఉన్న వీడియోను అప్లోడ్ చేసినట్లు కనుగొన్నాము. క్లిప్‌లో ట్రంప్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ని మెచ్చుకున్నారు

By Newsmeter Network  Published on  7 Nov 2024 5:39 PM IST
ఫ్యాక్ట్ చెక్:  ట్రంప్ గెలిచిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు “మోదీ, మోదీ” అంటూ నినాదాలు చేశారా?
Claim: ట్రంప్ గెలిచాక మాట్లాడుతున్నప్పుడు ఒక గుంపు “మోదీ! మోదీ! " అంటూ నినాదాలు చేశారు
Fact: వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇటీవల తన ప్రచారంలో చేరిన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ గురించి ట్రంప్ ప్రస్తావించగా అందుకు ప్రతిస్పందనగా ప్రేక్షకులు "బాబీ, బాబీ" అని నినాదాలు చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు. పెన్సిల్వేనియా, మిచిగాన్ వంటి కీలకమైన రాష్ట్రాలలో ఆయన మంచి ఆధిక్యాన్ని అందుకున్నారు. వైట్ హౌస్‌కు రెండో సారి ఆయన ప్రెసిడెంట్ గా తిరిగి వచ్చారు. యుద్ధాలను ఆపి, అమెరికాను గ్రేటెస్ట్‌గా మార్చడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాను.. రాబోయే రోజుల్లో సరిహద్దుల సమస్యను పరిష్కరిస్తామని ట్రంప్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రసంగిస్తూ హామీ ఇచ్చారు.
అయితే ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్‌ చేసిన ప్ర‌సంగానికి సంబంధించిన వీడియో క్లిప్ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. 25 సెకన్ల క్లిప్‌లో, "అమెరికాను మళ్లీ గొప్పగా హెల్తీగా మార్చడానికి ప్రయత్నిస్తాను" అని ట్రంప్ చెప్పడం వినిపించింది, ట్రంప్ ప్రసంగం మధ్య జనం పెద్దగా హర్షధ్వానాలు చేస్తున్నారు. “మోదీ! మోదీ!" అంటూ కేకలు కూడా వినిపించాయి.
X లో ఈ వీడియోను షేర్ చేస్తూ ఒక వినియోగదారు “ట్రంప్ విజయోత్సవ ప్రసంగంలో జనం #మోదీని ప్రస్తావించారు. @narendramodi, @realDonaldTrump గొప్ప స్నేహితులు.. భారతదేశం USA స్నేహం చిరకాలం కొనసాగుతుంది..అబ్కీ బార్ ట్రంప్ సర్కార్" అంటూ పోస్టు పెట్టారు.
(Archive)

Kreately అనే అకౌంట్ లో పలు తప్పుడు కథనాలు గతంలో కూడా వైరల్ అయ్యాయి.

ఫ్యాక్ట్ చెకింగ్:

మా బృందం వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని కనుగొంది. సదరు వ్యక్తులు “బాబీ! బాబీ!” అంటూ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ గురించి ట్రంప్ ప్రస్తావించగా నినాదాలు చేశారు. అంతేకానీ "మోదీ, మోదీ" కాదు.
ఈ క్లెయిమ్ కు సంబంధించిన పోస్ట్‌లపై కామెంట్లను సమీక్షించిన తర్వాత, రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ కోసం ప్రేక్షకులు "బాబీ, బాబీ" అని పిలిచారని పలువురు వినియోగదారులు చెప్పినట్లుగా మేము కనుగొన్నాము.
ఈ క్యూని ఉపయోగించి, మేము Xలో కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించాము. ఒక వినియోగదారు నిడివి ఎక్కువ ఉన్న వీడియోను అప్లోడ్ చేసినట్లు కనుగొన్నాము. క్లిప్‌లో ట్రంప్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ని మెచ్చుకోవడం, "అమెరికా హెల్తీ ఎగైన్" చేయడంలో తాను సహాయం చేస్తానని పేర్కొన్నట్లు స్పష్టంగా చూపిస్తుంది.
తన విజయ ప్రసంగం సందర్భంగా, ట్రంప్ కెన్నెడీ జూనియర్‌ గురించి మాట్లాడడంతో "బాబీ! బాబీ!" అని నినాదాలు చేశారు.(Archive)
మేము Googleలో మరొక కీవర్డ్ సెర్చ్ ను అమలు చేశాము. నవంబర్ 6న ప్రచురించిన టైమ్ మ్యాగజైన్ నివేదికను మేము కనుగొన్నాము. కథనం ప్రకారం, ట్రంప్ తన భవిష్యత్ పరిపాలన గురించి సూచన చేస్తూ, తన ప్రచారాన్ని ముగించిన స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌ను ప్రస్తావించారు. "అమెరికాను మళ్లీ ఆరోగ్యంగా మార్చడానికి కెన్నెడీ జూనియర్ సహాయం చేస్తాడని ట్రంప్ పేర్కొన్నారు"

నవంబర్ 6న ది గార్డియన్ ప్రచురించిన మరో నివేదికలో ట్రంప్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌పై ప్రశంసలు కురిపించారని, ప్రేక్షకులు “బాబీ! బాబీ!” అంటూ కథనాన్ని కూడా మేము గుర్తించాం.

మేము ట్రంప్ విజయ ప్రసంగాన్ని కూడా సమీక్షించాము, 25 నిమిషాలకు పైగా కొనసాగింది. నవంబర్ 6న NDTV ప్రచురించింది. 19:35 నిమిషాల మార్క్ వద్ద, కష్టపడి పనిచేసే అమెరికన్ల గురించి మాట్లాడుతూ, ట్రంప్ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ గురించి ప్రస్తావించారు. "అమెరికాను మళ్లీ ఆరోగ్యంగా మార్చడానికి" సహాయం చేస్తానని, తమ ప్రభుత్వం ఈ మిషన్‌లో కెన్నెడీకి మద్దతు ఇస్తుందన్నారు. 19:49 నిమిషాల మార్క్ వద్ద, ప్రేక్షకులు “బాబీ! బాబీ!” అంటూ నినాదాలు చేశారు.
కాబట్టి, ట్రంప్ విజయోత్సవ ప్రసంగంలో "మోదీ మోదీ" అని నినాదాలు చేశారన్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము నిర్ధారించాము.
Claim Review:ట్రంప్ గెలిచాక మాట్లాడుతున్నప్పుడు ఒక గుంపు “మోదీ! మోదీ! " అంటూ నినాదాలు చేశారు
Claimed By:X User
Claim Reviewed By:Newsmeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇటీవల తన ప్రచారంలో చేరిన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ గురించి ట్రంప్ ప్రస్తావించగా అందుకు ప్రతిస్పందనగా ప్రేక్షకులు "బాబీ, బాబీ" అని నినాదాలు చేశారు.
Next Story