Fact Check: ఈ చిత్రాలతో తెలంగాణలో ఇటీవల సంభవించిన వరదలకు సంబంధం లేదు

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు అని కనుగొంది. దెబ్బతిన్న రహదారి చిత్రం ఆంధ్రప్రదేశ్‌ది, తెలంగాణకు సంబంధించింది కాదు. రెస్క్యూ ఆపరేషన్ చిత్రం తెలంగాణకు చెందినది. అయితే ఇది 2020 నుండి ప్రచారంలో ఉంది. చిత్రం 1

By Newsmeter Network  Published on  4 Sep 2024 5:47 AM GMT
Fact Check: ఈ చిత్రాలతో తెలంగాణలో ఇటీవల సంభవించిన వరదలకు సంబంధం లేదు
Claim: ఈ చిత్రాలు ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణ దుస్థితిని చూపిస్తాయి.
Fact: దెబ్బతిన్న రహదారి చిత్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది. రెస్క్యూ ఆపరేషన్ చిత్రం తెలంగాణకు చెందినది. 2020 నుండి ఇంటర్నెట్‌లో ఉంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఊహించని వరదల కారణంగా 35 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. రెండు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాయి.
తెలంగాణలో ఇటీవల జరిగిన విధ్వంసాన్ని ఈ చిత్రాలు చూపిస్తున్నాయని పేర్కొంటూ దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన ప్రాంతంలో పడవలో రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి. షేర్ చేస్తున్న వారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు.
ఈ చిత్రాలను పంచుకుంటూ, ఒక X వినియోగదారు “గుజరాత్‌లోని వరదలతో దెబ్బతిన్న రోడ్లను గుజరాత్ మోడల్ అని పిలిచి ఎగతాళి చేసిన కపటవాదులు తెలంగాణలోని వరదలపై ఎందుకు మౌనంగా ఉన్నారు?” అంటూ పోస్టు పెట్టారు.

దెబ్బతిన్న రహదారి చిత్రాన్ని పంచుకుంటూ.. మరొక X వినియోగదారుడు, “ఇది కాంగ్-పాలిత తెలంగాణలోని ఒక రహదారి స్థితి, ఇది వరదలతో నాశనమవుతున్న తెలంగాణను ఎన్నడూ BJP పాలించలేదు కాబట్టి LKFC & గ్యాంగ్ ఎవరిని వెక్కిరిస్తారు? మోడీ & గుజరాత్ మోడల్‌ను అపహాస్యం చేయడానికి 2 రోజుల క్రితం వారు వడోదరలో దెబ్బతిన్న రహదారి ఫోటోలను పంచుకున్నారు" అంటూ పోస్టు పెట్టారు.
అనేక మంది X వినియోగదారులు, మీడియా సంస్థలు దెబ్బతిన్న రహదారి చిత్రాన్ని తెలంగాణకు చెందినవిగా పేర్కొంటూ వైరల్ పోస్టులు పంచుకున్నారు. Click here, here and here to view the post and articles. (Archive) (Archive)

Fact Check
దెబ్బతిన్న రహదారిపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా.. సెప్టెంబర్ 2న తెలుగు దినపత్రిక ఈనాడులో రిపోర్టు చేసినట్లు తేలింది. భారీ వర్షాల కారణంగా ఆంధ్రాలోని గన్నవరం, ఉంగుటూరు మండలాల్లోని కాల్వలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్ర‌దేశ్‌లోని కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలలో రోడ్డు వరద నీటిలో కొట్టుకుపోయిందని నివేదించారు.
జిల్లా కలెక్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన X, Facebook ఖాతాల ద్వారా పోస్ట్ చేసిన తెగిపోయిన రహదారి చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ఉద్యోగులు కృష్ణా జిల్లా కొండపావులూరు గ్రామంలో ఉండగా, ప్రధాన అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయిందని ఈ పోస్ట్‌లు సూచించాయి. అలాగే గుడివాడ ఆర్డీఓ (రెవెన్యూ డివిజనల్ అధికారి) పి.పద్మావతి రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు.

న్యూస్‌మీటర్ వైరల్ అవుతున్న క్లెయిమ్ తప్పు అని కనుగొంది. దెబ్బతిన్న రహదారి చిత్రం ఆంధ్రప్రదేశ్‌ది, తెలంగాణకు సంబంధించింది కాదు. రెస్క్యూ ఆపరేషన్ చిత్రం తెలంగాణకు చెందినది. అయితే ఇది 2020 నుండి ప్రచారంలో ఉంది.

చిత్రం 1

తెలంగాణలోని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తప్పుడు క్లెయిమ్ చేసిన వినియోగదారుని ఉద్దేశించి దెబ్బతిన్న రహదారి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఉందని స్పష్టం చేశారు.

చిత్రం 2
రెస్క్యూ ఆపరేషన్‌ను చూపుతున్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా డిజిటల్ పోర్టల్ ద్వారా మాకు ఒక నివేదికను అందింది. ఇది 2020లో పోస్ట్ చేసిన చిత్రం అని తేలింది.
హైదరాబాద్‌లోని నీటిలో మునిగిన ప్రాంతంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు తేలింది.
నవంబర్ 2, 2020న ఒక నివేదికలో Mongabay ప్రచురించిన చిత్రాన్ని కూడా మేము కనుగొన్నాము. హైదరాబాద్‌లోని ఒక నీటిలో మునిగిపోయిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన హైదరాబాద్ DRF బృందాన్ని చూపించారు.

అందువల్ల, రెండు చిత్రాలలో తెలంగాణలో ఇటీవల జరిగిన విధ్వంసం లేదా రెస్క్యూ ఆపరేషన్‌లు కనిపించడం లేదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim Review:ఈ చిత్రాలు ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణ దుస్థితిని చూపిస్తాయి.
Claimed By:X users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:దెబ్బతిన్న రహదారి చిత్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందినది. రెస్క్యూ ఆపరేషన్ చిత్రం తెలంగాణకు చెందినది. 2020 నుండి ఇంటర్నెట్‌లో ఉంది.
Next Story