హైదరాబాద్: పాకిస్థాన్ వైమానిక దళ పైలట్ జైసల్మేర్‌లో తన జెట్ నుంచి ఎజెక్ట్ అయిన తర్వాత భారత భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ రిపోర్ట్‌లను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఈ నేపథ్యంలో, భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పైలట్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రముఖ తెలుగు వార్తాపత్రిక ఈనాడు మొదటి పేజీలో ఈ ఫోటోను ప్రచురించి "భారత్ సైన్యం అదుపులో పాకిస్థాన్ పైలట్" అని పేర్కొంది.(Archive)
ఈ చిత్రంలో రాత్రి వేళ సైనిక యూనిఫాంలో ఉన్న కొందరు వ్యక్తులు కనిపిస్తున్నారు.
ఇలాంటి పోస్ట్‌లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కనిపించాయి.(Archive 1, Archive 2, Archive 3)
ఫ్యాక్ట్ చెక్
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్‌ను పరిశీలించి, తప్పుదోవ పట్టించేది అని కనుగొంది. వైరల్ ఫోటో భారత సైన్యం అదుపులో ఉన్న పాకిస్థాన్ పైలట్‌ను చూపించడం లేదు. బదులుగా, ఇది 2016లో టర్కీలోని డియార్‌బాకిర్ విమానాశ్రయం సమీపంలో టర్కిష్ ఫైటర్ జెట్ కూలిపోయిన సన్నివేశంలో ప్రజలు గుమిగూడిన దృశ్యాన్ని చూపిస్తుంది.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా, డిసెంబర్ 12, 2016న పోస్టిమీస్ వరల్డ్లో ప్రచురితమైన కథనం దొరికింది. ఒక టర్కిష్ ఎఫ్-16 యుద్ధ విమానం డియార్‌బాకిర్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిందని, పైలట్ సురక్షితంగా ఎజెక్ట్ చేశాడని సైన్యం తెలిపిందని ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ ఫోటో ఇల్యాస్ అకెంగిన్‌కు క్రెడిట్ చేయబడింది.
కీవర్డ్ సెర్చ్ ద్వారా మరింత పరిశోధించగా, ప్రముఖ ‘గెట్టీ ఇమేజెస్’ లో ఈ చిత్రం కనుగొన్నాం. ఈ ఫోటోకు "టర్కీ-ప్లేన్-క్రాష్" అనే క్యాప్షన్ ఉంది, దీని వివరణ ఇలా ఉంది: "డిసెంబర్ 12, 2016న డియార్‌బాకిర్‌లో కూలిపోయిన టర్కిష్ ఎఫ్-16 యుద్ధ విమానం సమీపంలో టర్కిష్ సైనిక సిబ్బంది చేరుకున్నారు. డియార్‌బాకిర్‌లోని విమానాశ్రయం సమీపంలో టర్కిష్ ఫైటర్ జెట్ కూలిపోయిందని సైన్యం తెలిపింది, కానీ పైలట్ విమానం నుంచి సురక్షితంగా ఎజెక్ట్ చేయగలిగాడు. క్రాష్‌కు కారణం గురుంచి సమాచారం లేదు, కానీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. / AFP / ILYAS AKENGIN (ఫోటో క్రెడిట్: ILYAS AKENGIN/AFP via Getty Images)."
ఇక్కడ పోలిక చూడవచ్చు:
ఈ క్రాష్‌కు సంబంధించిన మరిన్ని చిత్రాలు కూడా ఉన్నాయి, ఈ సంఘటన సందర్భాన్ని ధృవీకరిస్తూ కనుగొనబడ్డాయి.
భారత వైమానిక దళం ప్రతినిధి BOOMతో మాట్లాడుతూ, పఠాన్‌కోట్‌లో పాకిస్థాన్ వైమానిక దళ పైలట్‌ను పట్టుకున్నట్లు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని తెలిపారు. రాజస్థాన్‌లో పాకిస్థాన్ పైలట్ అదుపులో ఉన్నాడా అనే దానిపై కూడా అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రతినిధి తెలిపారు.
కాబట్టి, వైరల్ ఫోటో పాకిస్థాన్ వైమానిక దళ పైలట్‌ను భారత సైన్యం పట్టుకుందనే క్లెయిమ్ తప్పుదోవ పట్టించేది. ఈ చిత్రం 2016లో టర్కీలోని డియార్‌బాకిర్‌లో జరిగిన ఎఫ్-16 క్రాష్‌కు సంబంధించినది, జైసల్మేర్‌లో జరిగినట్లు చెప్పబడిన సంఘటనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు.