Fact Check: ఆపరేషన్ సింధూర్ - వీడియోలో సియాల్కోట్‌పై ఐఏఎఫ్ దాడి కాదు, ధారావిలో గ్యాస్ సిలిండర్ పేలుడు

సియాల్‌కోట్‌పై భారత సైన్యం దాడి చేసిందని క్లెయిమ్ చేస్తూ, రోడ్ మీద పెద్ద పేలుడు జరిగిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By M Ramesh Naik
Published on : 8 May 2025 6:14 PM IST

A video showing multiple explosions is going viral with claims that it shows Operation Sindoor strike on Sialkot.
Claim:వీడియోలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దాడి చేసిన దృశ్యాలు ఉన్నాయి.
Fact:ఇది తప్పు. ఈ వీడియో మార్చి 24న ముంబైలోని ధారావిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడును చూపిస్తుంది. ఇది ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించినది కాదు.

హైదరాబాద్: భారత సాయుధ దళాలు మే 7 తెల్లవారుజామున ‘ఆపరేషన్ సింధూర్’ ప్రారంభించాయి. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. సియాల్కోట్‌లోని మెహమూనా జోయా ప్రాంతంతో సహా తొమ్మిది ప్రాంతాలపై దాడులు జరిపారు.

ఈ సందర్భంలో, ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ఐఏఎఫ్ సియల్కోట్‌పై దాడి చేసిన దృశ్యాలను చూపిస్తోంది అని క్లెయిమ్ చేస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రోడ్డుపై పేలుడు జరగడం, ట్రక్కుల నుంచి మంటలు ఎగిసిపడుతుండడం చూడవచ్చు. పక్కన జనం ఆ పేలుడును చూస్తున్నట్లు కనిపిస్తుంది.

ఒక X యూజర్ ఈ వీడియోను షేర్ చేసి “పాకి లో 2am కి సూర్యుడు ఉదయించాడు #OperationSindoor ” అని క్యాప్షన్‌లో రాశారు.(Archive)

అలాంటి పోస్ట్ ఇక్కడ కూడా చూడవచ్చు. (Archive)

ఫ్యాక్ట్ చెక్

న్యూస్‌మీటర్ ఈ వైరల్ వాదన తప్పు అని కనుగొంది. ఈ వీడియో మార్చి 24న ముంబైలోని ధారావిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడును చూపిస్తుంది. ఇది ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించినది కాదు.

వైరల్ X పోస్ట్ కింద ‘@jeenathjain’ అనే యూజర్ చేసిన కామెంట్‌లో “ఇది నిజమైన వీడియో కాదు, ధారావిలో పేలుడు జరిగినప్పుడు తీసినది” అని రాశారు. (హిందీ నుంచి అనువాదం)

ఈ సమాచారంతో కీవర్డ్ సెర్చ్ చేయగా, Gulf Digital News ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఓ వీడియో కనిపించింది. ఈ వైరల్ వీడియోను మార్చి 25న “ముంబై ధారావి స్లమ్‌లో గ్యాస్ సిలిండర్లు పేలుడు” అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేశారు.

ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం, మార్చి 24న ముంబైలోని అతిపెద్ద స్లమ్ ధారావిలో ఓ ట్రక్కులో ఉన్న వంట గ్యాస్ సిలిండర్లు పేలి, మంటలు ఎగిసిపడ్డాయి.

Times of India ఈ ఘటనపై “ముంబై ధారావిలో షాక్: ట్రక్కులో 20+ ఎల్పీజీ సిలిండర్లు పేలాయి” అనే హెడ్‌లైన్‌తో కథనాన్ని ప్రచురించింది. ధారావి బస్ డిపో సమీపంలోని సియోన్-ధారావి లింక్ రోడ్డు వద్ద, నేచర్ పార్క్ దగ్గర రాత్రి 9:50 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఎల్పీజీ సిలిండర్లు ఉన్న ఓ ట్రక్కులో పేలుళ్లు సంభవించి మంటలు చెలరేగాయి అని రాశారు.

మార్చి 25న Hindustan Times ప్రచురించిన కథనంలో “ధారావిలో ట్రక్కులో సిలిండర్ పేలుళ్ల తర్వాత అగ్నిప్రమాదం; ఎవరూ గాయపడలేదు” అని పేర్కొన్నారు. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ సంతోష్ సావంత్ మాట్లాడుతూ, లారీలోని ఎల్పీజీ సిలిండర్ పేలడం వల్ల ఈ ఘటన జరిగిందని, లెవల్ II ప్రోటోకాల్ ప్రకారం ఐదు ఫైర్ ఇంజన్లను ఉపయోగించామని చెప్పారని ఈ కథనంలో పేర్కొన్నారు.

కాబట్టి, ఈ వైరల్ వీడియో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా సియల్కోట్‌లో ఐఏఎఫ్ దాడులను చూపించడం లేదు. ఇది మార్చి 24న ధారావిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనకు సంబంధించినది. కాబట్టి, న్యూస్‌మీటర్ ఈ వైరల్ క్లెయిమ్ తప్పని నిర్ధారించింది.

Claim Review:వీడియోలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దాడి చేసిన దృశ్యాలు ఉన్నాయి.
Claimed By:Social media users
Claim Reviewed By:NewsMeter
Claim Source:X
Claim Fact Check:False
Fact:ఇది తప్పు. ఈ వీడియో మార్చి 24న ముంబైలోని ధారావిలో జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడును చూపిస్తుంది. ఇది ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించినది కాదు.
Next Story